PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpgత‌న‌-మ‌న‌.. అనే తార‌త‌మ్యం లేదు.. అంద‌రూ మ‌న పార్టీ వాళ్లే.. అనే స్పూర్తితో ముందుకు సాగుతున్నారు అవినాష్‌. వాస్త‌వానికి అవినాష్ ఏ పార్టీలో ఉన్నా.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు.. త‌ర్వాత టీడీపీలో తెలుగు యువ‌త నాయ‌కుడిగా ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న యాక్టివ్ పాలిటిక్స్‌ను చేప‌ట్టారు. అయితే.. ఆయ‌న రెండు పార్టీల్లోనూ ఎంపీగా, ఎమ్మెల్యేగా టికెట్లు సంపాయించుకుని పోటీ చేసినా.. ఓడిపోయారు. ఇక‌, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీలో అడుగు పెట్టాల‌నే ల‌క్ష్యంతో ముందుకు ysrcp;nithya new;tiru;devineni avinash;east;letter;yuva;ycp;dookudu;party;youthపుర పోరు: వైసీపీలో ఆ యువ‌నేత మంత్రాంగ‌మే హాట్ టాపిక్ ?పుర పోరు: వైసీపీలో ఆ యువ‌నేత మంత్రాంగ‌మే హాట్ టాపిక్ ?ysrcp;nithya new;tiru;devineni avinash;east;letter;yuva;ycp;dookudu;party;youthSat, 27 Feb 2021 11:11:00 GMTవైసీపీ యువ నాయ‌కుడు.. దేవినేని అవినాష్ దూకుడు పెంచారు. ఆయ‌న వైసీపీని ఎట్టి ప‌రిస్థితిలోనూ విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో కూర్చోబెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆదిశ‌గా అడుగులు వేస్తున్నారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను కీల‌కంగా తీసుకున్నారు. పార్టీలో నేత‌ల‌ను క‌లుపుకొని పోతున్నారు. స‌మ‌స్య‌లు రాకుండా చూసుకుంటున్నారు. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్న అవినాష్‌.. త‌న‌దైన శైలిలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌తిప‌క్షం టీడీపీకి సైతం అంద‌నంత వేగంగా ఆయ‌న పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు.

త‌న‌-మ‌న‌.. అనే తార‌త‌మ్యం లేదు.. అంద‌రూ మ‌న పార్టీ వాళ్లే.. అనే స్పూర్తితో ముందుకు సాగుతున్నారు అవినాష్‌. వాస్త‌వానికి అవినాష్ ఏ పార్టీలో ఉన్నా.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు.. త‌ర్వాత టీడీపీలో తెలుగు యువ‌త నాయ‌కుడిగా ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న యాక్టివ్ పాలిటిక్స్‌ను చేప‌ట్టారు. అయితే.. ఆయ‌న రెండు పార్టీల్లోనూ ఎంపీగా, ఎమ్మెల్యేగా టికెట్లు సంపాయించుకుని పోటీ చేసినా.. ఓడిపోయారు.

ఇక‌, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీలో అడుగు పెట్టాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అయితే.. దీనికి సోపానంగా ఆయ‌న తూర్పు స‌హా బెజ‌వాడ‌లో వైసీపీని గెలుపు గుర్రం ఎక్కించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే అవినాష్ తూర్పులో అంద‌రినీ క‌లుపుకొని పోతున్నారు. నిర్విరామంగా పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లోనూ తిరుగుతున్నారు. ప్ర‌తి గ‌డ‌ప‌కు వెళ్లి.. వైసీపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నారు.

క‌రోనా స‌మ‌యం నుంచి ప్ర‌తి రోజు ఆయ‌న ప్ర‌జ‌ల్లోనే ఉన్నారు. ఇక‌, పార్టీలో ఇత‌ర నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ యువ‌నేత‌గా ముందుకు దూసుకు వెళుతున్నారు. త‌న కెరీర్‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఉన్న తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో అవినాష్ ఆధ్వ‌ర్యంలో సాగుతున్న‌ప్ర‌చారం హోరెత్తుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా ఒక ల‌క్ష్య‌-ఒక కృషి-ఒక ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగుతున్న అవినాష్ ఈ పుర పోరులో ఎలా ?  స‌క్సెస్ అవుతాడో ?  చూడాలి.




తాళం ప‌గ‌ల‌గొట్టి మ‌రీ యువ‌తిపై అత్యాచారం

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌లో ఆరు మావే అంటోన్న టీడీపీ.. లిస్ట్ ఇదే ?

పుర పోరు : విశాఖలో వేడెక్కించేసిన వైసీపీ...?

జూనియర్ ఎన్టీయార్ ఎంట్రీకి బాబు ఓకేనా..?

పుర పోరు: ఏపీలో జ‌గ‌నోరికి దెబ్బ ప‌డేది ఇక్క‌డే.. డౌటే లేదు..?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>