PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sleepef923a61-b50f-4e35-a143-b81de472efad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sleepef923a61-b50f-4e35-a143-b81de472efad-415x250-IndiaHerald.jpgఇంట్లో ఎక్కువ సేపు నిద్రపోయే వాళ్లను చూస్తూనే ఉంటాం. ఎక్కువ సమయం నిద్రపోతే.. ఇంట్లో పెద్దవాళ్లు ‘‘ఏంటా మొద్దు నిద్ర.. సోంబేరిలా పడుకున్నావ్.’’ అంటూ తిడుతూ ఉంటారు. అయితే ఇలా నిద్రపోతూ కూడా రూ.లక్షలు సంపాదించుకునే విషయం మీకు తెలుసా.sleep;health;bengaluru 1;job;application;march;adirindiజాబ్ అదిరింది.. ఐదు రోజులు నిద్ర.. రూ.14 లక్షలు..!జాబ్ అదిరింది.. ఐదు రోజులు నిద్ర.. రూ.14 లక్షలు..!sleep;health;bengaluru 1;job;application;march;adirindiSat, 27 Feb 2021 06:00:00 GMT హెల్త్ అడ్వైజ్ వెబ్‌సైట్ కల్పిస్తోంది. మంచి నిద్రకు సహాయపడే ఉత్పత్తులను తయారు చేసి.. అందులో భాగంగా ఈ ఉద్యోగాన్ని చేర్చారు. ప్రస్తుతం ఈ ఉద్యోగానికి దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తోంది.

ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు కంపెనీ చెప్పిన ప్రదేశాల్లో ఐదు రోజులపాటు నిద్ర పోవాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో వారికి రూ.14.5 లక్షల వేతనాన్ని అందజేస్తారు. హెల్త్ అడ్వైజ్ వెబ్‌సైట్ ప్రకారం.. వివిధ ప్రాంతాల్లోని పర్యావరణానికి అనుగుణంగా ప్రజల నిద్ర నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయంపై అధ్యాయనం చేస్తున్నారు. దీనికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి ఐదు రోజులపాటు కంపెనీ చెప్పిన ప్రాంతంలో నిద్ర పోవాల్సి ఉంటుంది. అయితే కొత్త వాతావరణంలో ఎలా నిద్రపోయారు.. నిద్ర ఎలా పట్టింది.. నిద్రలో తన అనుభవాల గురించి తెలుసుకుంటారు. నిద్ర నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తారు.

ప్రతి రోజు నిద్ర ఎలా పట్టిందనే విషయంపై 1 నుంచి 10 వరకు రేటింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రోజూ నిద్రలో తన అనుభవాన్ని నివేదిక రూపంలో పొందుపర్చాలి. అలా వారు ఇచ్చే నివేదిక ఆధారంగానే ఆయా ప్రాంతాల్లో నిద్ర నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ ఉద్యోగానికి అభ్యర్థులు మార్చి 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని వెబ్‌సైట్ తెలిపింది.

కాగా, బెంగళూరుకు చెందిన వేక్ ఫిట్ అనే మ్యాట్రెస్ తయారీ సంస్థ కూడా ఇలాంటి ఆఫర్‌నే అందించింది. వినియోగదారులకు ఎలాంటి పరుపులు తయారు చేయాలనే విషయం స్లీప్ ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభించింది. ఇందులో ఎంపికైనవారు 100 రోజుల పాటు 9 గంటలు నిద్రపోవాలి. పోటీలో పాల్గొన్న వారికి లక్ష రూపాయలు అందజేస్తారు. విజేతగా నిలిస్తే వారికి రూ.10 లక్షలు ఇస్తామని అప్పట్లో ప్రకటించింది.


ఈరోజుకు అందుకే అంత ప్ర‌త్యేక‌త‌... చ‌రిత్ర‌లో కీల‌క దిన‌మని మీకు తెలుసా..?

గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>