Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/death7654df30-601d-4742-8866-017834634a37-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/death7654df30-601d-4742-8866-017834634a37-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది తెలిసి తెలియని ఈ వయసులోనే ప్రేమలో పడడం చివరికి ప్రేమను పెద్దలు ఒప్పుకుంటారో లేదో అనే అనుమానంతో ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి ఎన్నో తెరమీదకు వస్తున్నాయి ఇక ఇటీవల సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెలుగులోకి వచ్చిన ప్రేమజంట ఆత్మహత్య కలకలం సృష్టించింది. అయితే ప్రేమజంట ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుగుతుండగా ఎన్నో ఆసక్తికర నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవDeath;prema;tiru;district;smart phone;police;pond;suryapeta;marriage;love;air;local language;father;kodadప్రేమజంట ఆత్మహత్య కేసులో బయటపడ్డ అసలు నిజం.. ఫోన్ మాట్లాడుతుండగా..?ప్రేమజంట ఆత్మహత్య కేసులో బయటపడ్డ అసలు నిజం.. ఫోన్ మాట్లాడుతుండగా..?Death;prema;tiru;district;smart phone;police;pond;suryapeta;marriage;love;air;local language;father;kodadSat, 27 Feb 2021 08:09:35 GMTఈ మధ్యకాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది తెలిసి తెలియని ఈ వయసులోనే ప్రేమలో పడడం చివరికి ప్రేమను పెద్దలు ఒప్పుకుంటారో లేదో అనే అనుమానంతో ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి ఎన్నో తెరమీదకు వస్తున్నాయి ఇక ఇటీవల సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెలుగులోకి వచ్చిన ప్రేమజంట ఆత్మహత్య కలకలం సృష్టించింది. అయితే ప్రేమజంట ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుగుతుండగా ఎన్నో ఆసక్తికర నిజాలు బయటకు వస్తున్నాయి.


 ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. కోదాడ పట్టణ పరిధిలోని చేగొండి రామయ్య తిరుపతమ్మ దంపతుల చిన్న కొడుకు  ఇరవై ఏళ్ల మణికంఠ.. ఐటిఐ పూర్తి చేసి  స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి అదే కాలనీలో ఉండే ఫాతిమా అనే 16 ఏళ్ల యువతితో పరిచయం అయింది. వీరి మధ్య ప్రేమ చిగురించడం తో కొన్నాళ్లుగా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తరచు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు. ఇక ఇటీవల ఫోన్లో మాట్లాడుతూ ఉండగా తండ్రి  చూసి ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ మణికంఠ ను మందలించాడు.



 దీంతో తీవ్ర మనస్తాపం చెందాడు మణికంఠ.  తర్వాత రోజు నుంచే ఇంట్లో కనిపించకుండా పోయాడు అదే సమయంలో ఫాతిమాకూడా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో.. కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయితే కోదాడ చెరువు వద్ద యాసిడ్ బాటిల్, చెప్పులు రెండు గ్లాసులు కనిపించడంతో అనుమానం వచ్చిన పోలీసులు గజ  ఈత గాళ్ళ సాయంతో  చెరువులో గాలించగా ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. అయితే క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని ఇద్దరు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



సోష‌ల్ మీడియాపై నిఘా స్టార్ట్‌.... శంషాబాద్‌లో ఒక‌రి అరెస్టు...

చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్..?

కాపు వేద‌న‌: కార్పొరేష‌న్ల‌లో పార్టీల త‌ల‌రాత‌లు మార్చ‌నున్న కాపులు ?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?

సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సార్లు నంది అవార్డులు అందుకున్న హీరోలు ఎవరో తెలుసా..!

ఎడిటోరియల్: బెడిసి కొడితే మాజీ ప్రధాని పివి కుటుంబం పరువు ప్రతిష్ట పోయే కచరా వ్యూహం

హెరాల్డ్ స్మ‌రామీ : స్వాతంత్ర్యోద‌మ నిప్పు క‌ణిక చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>