PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా వైసీపీలో కొన్ని సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టలేకపోవడంతో పార్టీపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నది అని చెప్పాలి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు నేతలు కనీసం అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అనే భావన చాలా మందిలో ysrcp;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;backward classes;chief minister;ycp;party;mantraవైసీపీ అధ్యక్షుడిగా బీసీ నేత...?వైసీపీ అధ్యక్షుడిగా బీసీ నేత...?ysrcp;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;backward classes;chief minister;ycp;party;mantraSat, 27 Feb 2021 10:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా వైసీపీలో కొన్ని సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టలేకపోవడంతో పార్టీపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నది అని చెప్పాలి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు నేతలు కనీసం అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అనే భావన చాలా మందిలో ఉంది.

అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక నేతను నియమించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. బీసీ సామాజికవర్గానికి చెందిన ఒక నేతకు అధ్యక్ష బాధ్యతలను అప్పగించే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బీసీ నేతకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ కూడా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఇదే జరిగితే మాత్రం జగన్ పరిపాలన విషయంలో మరింత సీరియస్ గా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమంది మంత్రులు కూడా సమర్ధవంతంగా పని చేయకపోవడంతో వాళ్లను కూడా మార్చే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగకపోయినా శాఖలను మార్చే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని అంటున్నారు. దీనిపై త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ కీలక సమావేశం జరిగే అవకాశాలు కూడా కనబడుతున్న నేపథ్యంలోనే ఆ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఏది ఎలా ఉన్నా జగన్ తీసుకునే నిర్ణయం పై వైసీపీ వర్గాలు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నాయి. మరి జగన్ ఎంత వరకు ముందుకు వస్తారో చూడాలి.


హద్దు దాటినా అషురెడ్డి..ఏకంగా ముద్దు పెట్టేసి రచ్చ రచ్చ..?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...

బ్రాహ్మ‌ణ ఘోష‌: పెద్ద‌ల స‌భ‌లో మూగ‌బోయిన బ్రాహ్మ‌ణ వాణి..!

చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్..?

కాపు వేద‌న‌: కార్పొరేష‌న్ల‌లో పార్టీల త‌ల‌రాత‌లు మార్చ‌నున్న కాపులు ?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>