EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/sharmila-ysr-jagan-kcr-telangana-party-tdp-bjp-trs59a3b4e6-b029-4888-a2d1-c83a60669468-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/sharmila-ysr-jagan-kcr-telangana-party-tdp-bjp-trs59a3b4e6-b029-4888-a2d1-c83a60669468-415x250-IndiaHerald.jpgవైఎస్సార్ కు ఏ స్ధాయిలో అభిమానులు, మద్దుతుదారులుంటే నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుంది ? సరిగ్గా ఈ పాయింట్ మీదే షర్మిల దృష్టిపెట్టింది. అందుకనే తన రాజకీయ పార్టీ ఏర్పాటు, ప్రస్ధానాన్ని ఖమ్మం జిల్లాతోనే మొదలు పెట్టాలని డిసైడ్ అయినట్లుంది. షర్మిల ఆలోచనలకు తోడు ఖమ్మంలోని కొందరు నేతలు కూడా ఇదే విషయాన్ని పట్టుబట్టారు. దాంతో ఏప్రిల్ 9వ తేదీన లక్షమందితో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని దాదాపు డిసైడ్ అయినట్లే. ఆ బహిరంగసభలోనే పార్టీ ఏర్పాటు, జెండా, అజెండా మొత్తాన్ని జనాల మధ్యలో ప్రకటించేందుకు రంగం రెడsharmila ysr jagan kcr telangana party tdp bjp trs;view;seema;hyderabad;warangal;y. s. rajasekhara reddy;mp;huzur nagar;nalgonda;chief minister;assembly;mla;ranga reddy;ycp;khammam;karimnagar;reddy;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల పార్టీకి అదిరిపోయే లాంచింగ్ ?హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల పార్టీకి అదిరిపోయే లాంచింగ్ ?sharmila ysr jagan kcr telangana party tdp bjp trs;view;seema;hyderabad;warangal;y. s. rajasekhara reddy;mp;huzur nagar;nalgonda;chief minister;assembly;mla;ranga reddy;ycp;khammam;karimnagar;reddy;partySat, 27 Feb 2021 03:00:00 GMTపార్టీ ఏర్పాటు విషయంలో షర్మిల వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది. పార్టీ లాంచింగ్ విషయంలో అన్నీ జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీ లాంచింగ్ అదిరిపోయేట్లుండాలని డిసైడ్ చేసినట్లుంది. అందుకనే ఏప్రిల్ 9వ తేదీని పార్టీ లాంచింగ్ కు ఖమ్మంను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. మొదటినుండి ఖమ్మం జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి  వైఎస్సార్  అభిమానులు, మద్దతుదారులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ఒక ఎంపి, మూడు అసెంబ్లీ స్ధానాలు గెలవటమే దీనికి నిదర్శనం. నిజానికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తన దృష్టంతా పూర్తిగా ఏపిలోనే కేంద్రీకరించారు. తెలంగాణాలో కూడా అక్కడక్కడ పోటీచేసినా అభ్యర్ధుల తరపున ప్రచారానికి కూడా రాలేదు. అయినా ఒక ఎంపి+3 ఎంఎల్ఏ స్ధానాల్లో గెలవటం మామూలు విషయం కాదు.



వైఎస్సార్ కు ఏ స్ధాయిలో అభిమానులు, మద్దుతుదారులుంటే నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుంది ? సరిగ్గా ఈ పాయింట్ మీదే షర్మిల దృష్టిపెట్టింది. అందుకనే తన రాజకీయ పార్టీ ఏర్పాటు, ప్రస్ధానాన్ని ఖమ్మం జిల్లాతోనే మొదలు పెట్టాలని డిసైడ్ అయినట్లుంది. షర్మిల ఆలోచనలకు తోడు ఖమ్మంలోని కొందరు నేతలు కూడా ఇదే విషయాన్ని పట్టుబట్టారు. దాంతో ఏప్రిల్ 9వ తేదీన లక్షమందితో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని దాదాపు డిసైడ్ అయినట్లే. ఆ బహిరంగసభలోనే పార్టీ ఏర్పాటు, జెండా, అజెండా మొత్తాన్ని జనాల మధ్యలో ప్రకటించేందుకు రంగం రెడీ అవుతోంది.




ఇఫ్పటికే జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల ఖమ్మం జిల్లాలోని వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులతో మాత్రం రెండుమూడు సార్లు భేటీ అయ్యారు. అంటే చాలా జిల్లాలతో పోల్చితే ఖమ్మం జిల్లాకు బాగానే ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్ధమవుతోంది. షర్మిల దృష్టి ఎక్కువగా ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ పైనే ఎక్కువగా ఫోకస్ అయ్యిందని సమాచారం. వీటిల్లో కూడా ఖమ్మం, నిజామాబాద్, కరీనంగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంద్రులు కూడా బాగా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వ్యూహాత్మకంగా తెలంగాణాలో ఉంటున్న వైసీపీ అభిమానులను కూడా ఆకట్టుకునేందుకే షర్మిల పావులు కదుపుతున్నట్లు సమాచారం. చూద్దాం ఏప్రిల్ 9వ తేదీ ఏమి జరుగుతుందో.




గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>