PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona9f43da3a-58ee-48f3-9926-47d5f9034e12-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona9f43da3a-58ee-48f3-9926-47d5f9034e12-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో కొత్త‌గా క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.తెలంగాణ రాష్ట్రంలో శుక్ర‌వారం రాత్రి 8 గంటల వరకు 40,821 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 178 పాజిటివ్‌ కేసులు నమోదైన‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ శనివారం ఉద‌యం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,98,631కి చేరింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,633కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 148 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేcorona;health;srinivas;telangana;bari;district;heart;doctor;shaktiతెలంగాణ‌లో మ‌ళ్లీ ప‌డ‌గ విప్పుతున్న క‌రోనా.. జిల్లాల్లోనూ ప‌దుల సంఖ్య‌లో కేసులుతెలంగాణ‌లో మ‌ళ్లీ ప‌డ‌గ విప్పుతున్న క‌రోనా.. జిల్లాల్లోనూ ప‌దుల సంఖ్య‌లో కేసులుcorona;health;srinivas;telangana;bari;district;heart;doctor;shaktiSat, 27 Feb 2021 10:30:00 GMT హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,98,631కి చేరింది.  నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,633కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 148 మంది కోలుకున్నారు.  రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,939 ఉండగా.. వీరిలో 850 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 30 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 86,59,666కి చేరింది.


ఇదిలా ఉండ‌గా న‌మోద‌వుతున్న కేసుల్లో జిల్లా నుంచి స‌గానికంటే ఎక్కువ‌గా ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని వైద్యులు చెబుతున్నారు. క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ జిల్లాల నుంచి అధికంగా కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని అధికారులు పేర్కొంటున్నారు. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని, లేదంటే కేసుల సంఖ్య పెరిగితే అరిక‌ట్ట‌డానికి మ‌ళ్లీ ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇక కరోనా టీకా పొంద‌డంలోనూ వారియ‌ర్స్ ఉత్సాహంగా పాల్గొనాల‌ని సూచిస్తున్నారు. తెలంగాణలో రెండవ దశలో దాదాపు 55 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు డైరక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు.


దీర్ఘకాలిక వ్యాదులున్న 45 ఏళ్లకు పైబడిన వారు టీకా తీసుకోవడానికిగాను తమకు కో-మార్బిడిటీస్‌ ఉన్నాయని ధ్రువీకరించే ఆరోగ్య నివేదికల పత్రాలను చూపాల్సి ఉంటుంది. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీ వ్యాధులతో పాటు మధుమేహం, కేన్సర్‌, తీవ్ర ఆస్తమా, మానసిక రుగ్మతలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటాన్ని కో మార్బిడిటీ‌స్ గా పరిగణించే అవకాశం ఉంది. తెలంగాణలో దాదాపు 1500 సెంటర్లలో వ్యాక్సిన్ ఏర్పాటుకు సన్నాహలు చేస్తున్నారు.




పుర పోరు: నాడు జ‌గ‌న్‌ను ఢీ కొట్టిన ఒకే ఒక్క‌డు మ‌ళ్లీ గెలిచేస్తాడా ?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...

బ్రాహ్మ‌ణ ఘోష‌: పెద్ద‌ల స‌భ‌లో మూగ‌బోయిన బ్రాహ్మ‌ణ వాణి..!

చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్..?

కాపు వేద‌న‌: కార్పొరేష‌న్ల‌లో పార్టీల త‌ల‌రాత‌లు మార్చ‌నున్న కాపులు ?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>