MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashikanna-turning-in-to-a-kickboxer-dbbae44d-c397-4742-bba9-4b14c81f7b8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashikanna-turning-in-to-a-kickboxer-dbbae44d-c397-4742-bba9-4b14c81f7b8f-415x250-IndiaHerald.jpgరాశిఖన్నా కాస్త బొద్దుగా ఉన్నా తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఆమె కొంచెం లావు ఉన్నారు. ఆ తర్వాత ఇంకాస్త బరువెక్కారు. కానీ ఆమెకు సినిమా అవకాశాలు వరుసగా వచ్చాయి. అయితే పాత్రకు తగ్గట్టు కనిపించాలంటే హీరోయిన్ సన్నగా నాజుగ్గా తయారవ్వటం చాలా ముఖ్యం. మొదట్లో రాశి ఖన్నా తన ఫిట్ నెస్ పై ఎక్కువగా శ్రద్ద పెట్టలేదు కానీ తర్వాత కాలంలో చాలా కష్టపడి బరువు తగ్గారు. rashikanna;shahid kapoor;jeevitha rajaseskhar;krishna;raashi khanna;raasi;raj;sethu;vijay;vijay sethupathi;cinema;amazon;media;thriller;husband;hero;heroine;joseph vijay;shahid;kick;rashi khanna;zero;fidaaకిక్ బాక్సర్ గా మారుతున్న రాశిఖన్నా.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..కిక్ బాక్సర్ గా మారుతున్న రాశిఖన్నా.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..rashikanna;shahid kapoor;jeevitha rajaseskhar;krishna;raashi khanna;raasi;raj;sethu;vijay;vijay sethupathi;cinema;amazon;media;thriller;husband;hero;heroine;joseph vijay;shahid;kick;rashi khanna;zero;fidaaSat, 27 Feb 2021 12:01:41 GMTరాశిఖన్నా కాస్త బొద్దుగా ఉన్నా తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఆమె కొంచెం లావు ఉన్నారు. ఆ తర్వాత ఇంకాస్త బరువెక్కారు. కానీ ఆమెకు సినిమా అవకాశాలు వరుసగా వచ్చాయి. అయితే పాత్రకు తగ్గట్టు కనిపించాలంటే హీరోయిన్ సన్నగా నాజుగ్గా తయారవ్వటం చాలా ముఖ్యం. మొదట్లో రాశి ఖన్నా తన ఫిట్ నెస్ పై ఎక్కువగా శ్రద్ద పెట్టలేదు కానీ తర్వాత కాలంలో చాలా కష్టపడి బరువు తగ్గారు.

ఆమె తనకు సంబంధించిన వర్కౌట్ వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. గతంలో వ్యాయామం చేయడానికి ఆమె బాగా కష్టపడేవారు. కానీ ఇప్పుడు ఈజీగా కసరత్తులు చేస్తూ చాలా దృఢంగా తయారయ్యారు. ఆమె తన సైజ్ జీరో బాడీ ఫోటోలను ప్రతిరోజు షేర్ చేస్తూనే ఉన్నారు. ఈమధ్య కాలంలో లంగా వోని, చీర కట్టు వస్త్రధారణలో చాలా సంప్రదాయకంగా కనిపించిన అభిమానులకు సెగలు పుట్టించారు.

అయితే చాలా సెక్సీగా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కిక్ బాక్సింగ్ నేర్చుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే.. ఆమె స్టార్ హీరో షాహిద్ కపూర్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఐతే ఈ వెబ్ సిరీస్ లోని పాత్ర నిమిత్తము ఆమె కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఈ విషయం గురించి ఒక ప్రముఖ పత్రిక ప్రశ్నించగా.. తన తదుపరి పాత్ర కోసమే కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నానని.. అలాగే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వలన మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతామని.. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా సునాయాసంగా ఎదుర్కోవచ్చు అని.. అందుకే బాక్సింగ్ నేర్చుకోవడానికి పూర్తిస్థాయిలో డెడికేషన్ చూపిస్తున్నానని ఆమె అన్నారు.

ఆమె నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదల కానున్నది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే విశాఖపట్నం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ వంద రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకొనుందని తెలుస్తోంది.


ఛీ..ఛీ.. తండ్రి,కొడుకులు ఒకే అమ్మాయి పై అత్యాచారం.. అపై దారుణం..

పుర పోరు: వైసీపీలో ఆ యువ‌నేత మంత్రాంగ‌మే హాట్ టాపిక్ ?

పుర పోరు : విశాఖను నడిపించేది మహిళలే...?

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌లో ఆరు మావే అంటోన్న టీడీపీ.. లిస్ట్ ఇదే ?

పుర పోరు : విశాఖలో వేడెక్కించేసిన వైసీపీ...?

జూనియర్ ఎన్టీయార్ ఎంట్రీకి బాబు ఓకేనా..?

పుర పోరు: ఏపీలో జ‌గ‌నోరికి దెబ్బ ప‌డేది ఇక్క‌డే.. డౌటే లేదు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>