PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-revanth-reddy62b5d7e0-12d3-4d1d-a320-9f5cc7d224a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-revanth-reddy62b5d7e0-12d3-4d1d-a320-9f5cc7d224a8-415x250-IndiaHerald.jpgషర్మిలతో మాట్లాడిన విద్యార్థి గురించి అసలు నిజాలు బయటపెట్టి.. షర్మిలను ఇరకాటంలో పెట్టారు రేవంత్ రెడ్డి.షర్మిలతో మాట్లాడిన యువకుడి పేరు సునంద్ జోసెఫ్ అని చెప్పారు రేవంత్ రెడ్డి. ఆ యువకుడు విద్యార్థి కాదు, నిరుద్యోగి కాదని అన్నారు. కల్వరి టెంపుల్ లో అర్కెస్ట్రా వాయిద్యాన్ని వాయిస్తుంటాడని చెప్పారు.ys sharmila revanth reddy;revanth;thanneeru harish rao;telangana;revanth reddy;heart;khammam;father;reddy;izzat;oscar;partyషర్మిల ఇజ్జత్ తీసిన రేవంత్షర్మిల ఇజ్జత్ తీసిన రేవంత్ys sharmila revanth reddy;revanth;thanneeru harish rao;telangana;revanth reddy;heart;khammam;father;reddy;izzat;oscar;partySat, 27 Feb 2021 21:44:05 GMTపార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల.. కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతూ మద్దతు కూడగడుతున్నారు. త్వరలోనే ఖమ్మంలో బహిరంగ సభకు షర్మిల ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఖమ్మం సభలో పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇటీవలే విద్యార్థులతో లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు షర్మిల. ఈ సందర్భంగా  ఓ విద్యార్థి ఉద్వేగంగా ప్రసంగించారు. ఆ విద్యార్థిని వేదికపైకి పిలిచి ఓదార్చారు షర్మిల. అతనికి అండగా ఉంటానిని భరోసా ఇచ్చారు. ఆ విద్యార్థి ప్రసంగం, షర్మిల రియాక్షన్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 అయితే వైఎస్ షర్మిల పార్టీపై మొదటి నుంచి విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. తాజాగా సంచలన కామెంట్లు చేశారు. కొత్త పార్టీ పేరుతో షర్మిల డ్రామాలు చేస్తుందని ఆరోపించారు. అంతేకాదు షర్మిలతో మాట్లాడిన విద్యార్థి గురించి అసలు నిజాలు బయటపెట్టి.. షర్మిలను ఇరకాటంలో పెట్టారు రేవంత్ రెడ్డి.
 షర్మిలతో మాట్లాడిన యువకుడి పేరు సునంద్ జోసెఫ్ అని చెప్పారు రేవంత్ రెడ్డి. ఆ యువకుడు విద్యార్థి కాదు, నిరుద్యోగి కాదని అన్నారు. కల్వరి టెంపుల్ లో అర్కెస్ట్రా వాయిద్యాన్ని వాయిస్తుంటాడని చెప్పారు. జోసెఫ్ తండ్రి  వైయస్ చనిపోవడానికి ముందే చాలా ఏళ్ల క్రితమే మరణించాడని తెలిపారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే షర్మిల ఈ డ్రామా ఆడారని రేవంత్ రెడ్డి విమర్శించారు. స్టేజి మీద డ్రామాను రక్తికట్టించారని... ఈ డ్రామాకు ఆస్కార్ అవార్డు కూడా తక్కువేనని అన్నారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ డ్రామాకు తెర లేపారని చెప్పారు. షర్మిలతో కనిపించిన యువకుడి ఫేస్ బుక్ ప్రొఫైల్ లో హరీశ్ రావుతో దిగిన ఫొటోలను చూడొచ్చంటూ ఆ ఫోటోలు చూపించారు రేవంత్ రెడ్డి.

షర్మిలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన విద్యార్థి..  'నాకు తండ్రి లేడు, వైయస్ చనిపోయినప్పుడు నాన్న గుండె నొప్పితో చనిపోయాడు. నాకిప్పుడు తండ్రైనా, అక్కయినా మీరే. మీరు వెనకడుగు వేయొద్దు. మీరుంటే చాలక్కా... నేనున్నానని చెప్పక్కా' అని అడిగాడు. దీనికి స్పందనగా... ఉన్నానమ్మా, నేను నిలబెడతా, మిమ్మల్ని నిలబెడతా అని షర్మిల అన్నారు. 


ప్చ్ .... అది మాత్రం నిజంగా మహేష్ ఫ్యాన్స్ కి గడ్డు కాలమే ....??

ఎడిటోరియల్: కేసీఆర్ పాచిక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పారుతుందా? పతనమౌతుందా?

బాలయ్య స్థానంలో నాగార్జున.. మెప్పించగలడా..??

బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>