MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrf3a6400a-8a9f-483e-b842-6490cd4c32aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrf3a6400a-8a9f-483e-b842-6490cd4c32aa-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పోరు ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చామని ప్రతిపక్ష పార్టీ చెబుతున్నప్పటికీ.. టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనన్న వాదన ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆ పార్టీ కార్యకర్తలు చేసిన నినాదాలే నిదర్శనం. కుప్పం పరిధిలోని గ్రామ పంచాయతీల్లో మెజార్టీ పంచాయతీలను కైవసం చేసుకున్న వైసీపీ టీడీపీ అధినేతకు సొంత నియntr;cbn;ntr;balakrishna;harika;harikrishnan;jr ntr;andhra pradesh;kuppam;panchayati;tdp;ycp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;partyటీడీపీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర చర్చ..ఈసారి బాబు తల ఊపాడంటే..??టీడీపీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర చర్చ..ఈసారి బాబు తల ఊపాడంటే..??ntr;cbn;ntr;balakrishna;harika;harikrishnan;jr ntr;andhra pradesh;kuppam;panchayati;tdp;ycp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;partySat, 27 Feb 2021 17:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పోరు ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చామని ప్రతిపక్ష పార్టీ చెబుతున్నప్పటికీ.. టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనన్న వాదన ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆ పార్టీ కార్యకర్తలు చేసిన నినాదాలే నిదర్శనం. కుప్పం పరిధిలోని గ్రామ పంచాయతీల్లో మెజార్టీ పంచాయతీలను కైవసం చేసుకున్న వైసీపీ టీడీపీ అధినేతకు సొంత నియోజకవర్గంలోనే ఊహించని షాకిచ్చింది. దీంతో.. కార్యకర్తల్లో అలుముకున్న నిస్తేజాన్ని పోగొట్టి వారిలో ఉత్తేజాన్ని నింపేందుకు స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి కుప్పంలో పర్యటించారు.

ఈ పర్యటనలో చంద్రబాబుకు ఆయన సొంత నియోజకవర్గంలోనే ఊహించని అనుభవం ఎదురైంది.జూనియర్ ఎన్టీఆర్ పార్టీ ప్రచారానికి రావాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. కేవలం డిమాండ్ మాత్రమే కాదు.. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతీ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు కనిపించాయి. గతంలో ఇంత ప్రముఖంగా జూనియర్ ఎన్టీఆర్‌ ఫొటోలను ఫ్లెక్సీలపై, బ్యానర్లపై కుప్పం టీడీపీ శ్రేణులు వినియోగించిన సందర్భాలు లేవు. ఈసారి మాత్రం.. చంద్రబాబు, లోకేష్, బాలయ్య ఫొటోలతో పాటు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను బ్యానర్లపై, ఫ్లెక్సీలపై ఏర్పాటు చేయడం ఆసక్తికర పరిణామం.

కుప్పం పర్యటనలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకునేందుకు ఇంకా సమయం ఉందన్నట్టుగా చంద్రబాబు హావభావాలు స్పష్టం చేశాయి. జూనియర్ ఎన్టీఆర్ రావాలని కార్యకర్తలు నినాదాలు చేసిన సందర్భంలో, ఆ నినాదాలు చంద్రబాబు చెవిన పడినప్పటికీ తలూపారే తప్ప ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దీని ద్వారా ఇంకా ఆ సమయం రాలేదని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్టయింది. ఇదే టూర్‌ను ముగిస్తున్న సందర్భంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు జూనియర్ రీఎంట్రీ ఇప్పట్లో ఉండదని స్పష్టం చేశాయి. అవసరమైతే మళ్లీ మళ్లీ వస్తానని, లోకేష్ కూడా వస్తాడని చెప్పిన చంద్రబాబు ఎన్టీఆర్ కూడా వస్తాడని చెప్పకపోవడం గమనార్హం...!!


ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త..! APSSDC లో ఉద్యోగాలు భర్తీ..?

ఎడిటోరియల్: కేసీఆర్ పాచిక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పారుతుందా? పతనమౌతుందా?

బాలయ్య స్థానంలో నాగార్జున.. మెప్పించగలడా..??

బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>