PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mukesh-ambani-car1002d26d-1b01-4c53-b8b4-4c9c63d8362e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mukesh-ambani-car1002d26d-1b01-4c53-b8b4-4c9c63d8362e-415x250-IndiaHerald.jpgఅంబానీ ఇంటికి సమీపంలో పార్క్ చేసిన కారులో ఓ బెదిరింపు లేఖను ముంబై అధికారులు కనుగొన్నారు. డ్రైవర్ పక్కనే ఉండే సీటులో ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు వాడేటటువంటి బ్యాగ్ ఉండగా దానిలో ఈ లేఖ బయటపడింది. ఇందులో ముఖేష్ తో పాటు నీతా అంబానీని సైతం దుండగులు బెదిరించారు.mukesh ambani car;mukesh;mumbai;cricket;police;car;driver;letter;yevaruముకేష్ అంబానీకి వార్నింగ్!ముకేష్ అంబానీకి వార్నింగ్!mukesh ambani car;mukesh;mumbai;cricket;police;car;driver;letter;yevaruSat, 27 Feb 2021 08:44:35 GMTముంబై పోలీసులను కలవరానికి గురి చేస్తోంది. ముకేష్ అంబానీ ఇంటికి సమీపంలో పార్క్ చేసిన కారులో ఓ బెదిరింపు లేఖను ముంబై అధికారులు కనుగొన్నారు.

  కారులో డ్రైవర్ పక్కనే ఉండే సీటులో ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు వాడేటటువంటి బ్యాగ్ ఉండగా దానిలో ఈ బెదిరింపు లేఖ బయటపడింది. ఇందులో ముఖేష్ అంబానీతో పాటు నీతా అంబానీని సైతం దుండగులు బెదిరించారు.అంబానీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ రాసిన ఈ లేఖలో "నీతా అంబానీ, ముఖేష్‌ భయ్యాకు ఇదొక ఝలక్. మరోసారి ఈ పేలుడు పదార్థాలు మీ దగ్గరికి చేరుకుంటాయి. ఇది ట్రయిలర్ మాత్రమే" అని రాసుందని ముంబై పోలీసు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.

    ముఖేష్ అంబానీ ఇంటి బయట ఆగివున్న ఓ స్కార్పియోపై అనుమానంతో సోదాలు చేయగా, పేలుడు పదార్థాలు లభించాయి. ముఖేష్ కుటుంబం వాడే సెక్యూరిటీ వాహనం నంబర్ ఈ స్కార్పియోకు ఉంది. దీంతో ఈ వాహనాన్ని ఎక్కడో దొంగిలించి తెచ్చుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వాహనంలో వచ్చిన వ్యక్తి మరో వాహనంలో వెళ్లిపోయాడని ఇప్పటికే గుర్తించిన ముంబై పోలీసులు, ఈ కేసును సీరియస్ గా తీసుకుని ఆగంతుకులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.ఈ ఘటన ముంబైతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా లభించిన బెదిరింపు లేఖ మరింత దుమారం రేపుతోంది. ఈ ఘటన వెనక ఎవరున్నారో తేల్చేందుకు ముంబై పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అంబానీ నివాసమైన 'అంటీలియా'  పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు.










బ్యాంకుకు కన్నం వేయడం అంటే ఇదేనేమో.. ఏకంగా సొరంగం తవ్వి మరి..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: పెద్ద‌ల స‌భ‌లో మూగ‌బోయిన బ్రాహ్మ‌ణ వాణి..!

చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్..?

కాపు వేద‌న‌: కార్పొరేష‌న్ల‌లో పార్టీల త‌ల‌రాత‌లు మార్చ‌నున్న కాపులు ?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?

సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సార్లు నంది అవార్డులు అందుకున్న హీరోలు ఎవరో తెలుసా..!

ఎడిటోరియల్: బెడిసి కొడితే మాజీ ప్రధాని పివి కుటుంబం పరువు ప్రతిష్ట పోయే కచరా వ్యూహం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>