PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aggression-rape-women6a4823c9-f4c1-48eb-aa34-2b76073abd42-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aggression-rape-women6a4823c9-f4c1-48eb-aa34-2b76073abd42-415x250-IndiaHerald.jpgసమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎప్పుడు ఎక్కడో చోట మహిళలపై అత్యాచారం జరుగుతూనే ఉంది. ఎన్ని చట్టాలు ఉన్నా.. ఏం లాభం లేకుండా పోతుంది. కామాంధుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తాజాగా ఓ మహిళపై తన కొడుకు స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు.aggression, rape, women;women;police;woman;police station;arrest;traffic police;local language;sardar vallabhai patel;lieస్నేహితుడి తల్లిపై అఘాయిత్యం.. బండరాయితో కొట్టి..!స్నేహితుడి తల్లిపై అఘాయిత్యం.. బండరాయితో కొట్టి..!aggression, rape, women;women;police;woman;police station;arrest;traffic police;local language;sardar vallabhai patel;lieSat, 27 Feb 2021 07:00:00 GMT మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

స్నేహితుడి తల్లిపైనే కన్నేసిన ఓ దుర్మార్గుడు ఆమెపై అఘాయత్యానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన మహిళను (42) బండరాయితో బాది చంపిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముండ్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 20 ఏళ్ల చింతామణి కొడుకు పటేల్ అలియాస్ చింటూకు అదే గ్రామానికి చెందిన ఓ స్నేహితుడు ఉన్నాడు. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత స్నేహితుడి ఇంటికి వెళ్లిన నిందితుడు.. తమ పొలంలో వరి కోసే యంత్రాన్ని చూసి రావడానికి స్నేహితుడి పిలిచాడు. చింటూ లేడని చింతామణి తెలిపింది. పొలానికే కదా భయమేందుకు నేను వస్తానని చెప్పింది చింతామణి.

చింతామణి, కొడుకు స్నేహితుడు కలిసి పొలానికి బయలు దేరారు. పనులు పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి కావడంతో.. ఆ యువకుడిలో లైంగిక వాంఛ పుట్టింది. తన కామవాంఛను తీర్చాలని చింతామణిని బలవంతం చేయసాగాడు. వద్దని మహిళ అడ్డుపడినా.. ఆ యువకుడు పైపైకి రావడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె తిరగబడింది. కోపంలో ఆ యువకుడు స్థానికంగా ఉన్న బండరాయితో చింతామణి తలపై బాదాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి.

మహిళ కేకలు వేయడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. కేకలు విన్న గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని వాళ్లకు వివరించింది. తలకు తీవ్రంగా గాయాలవడంతో అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చింటూ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.


అమెజాన్ సమ్మర్ ఆఫర్స్ వచ్చేశాయ్.. ఆ వస్తువుల పై భారీ తగ్గింపు....

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?

సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సార్లు నంది అవార్డులు అందుకున్న హీరోలు ఎవరో తెలుసా..!

ఎడిటోరియల్: బెడిసి కొడితే మాజీ ప్రధాని పివి కుటుంబం పరువు ప్రతిష్ట పోయే కచరా వ్యూహం

హెరాల్డ్ స్మ‌రామీ : స్వాతంత్ర్యోద‌మ నిప్పు క‌ణిక చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌...

టాలీవుడ్ లో వరుస ఫ్లాప్ మూవీలతో సతమతమవుతున్న హీరోయిన్ ..!!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇద్దరికీ తేడా ఏమిటో స్పష్టంగా తెలిసిపోయిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>