PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jr-ntr3f7b23e1-fe9e-4d0d-af1f-cd19d5b956d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jr-ntr3f7b23e1-fe9e-4d0d-af1f-cd19d5b956d4-415x250-IndiaHerald.jpgజూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆయ‌న అభిమానులు, టీడీపీ శ్రేణులు ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నాయి. అయితే చంద్ర‌బాబుతో ఏర్ప‌డిన రాజ‌కీయ విబేధాల‌తోనే ఆయ‌న పార్టీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నార‌న్న‌ది ఆ పార్టీ నేత‌లే ఆఫ్ ది రికార్డులో చెబుతున్న మాట‌లు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తోనే టీడీపీకి మ‌ళ్లీ పూర్వ వైభ‌వం వ‌స్తుంద‌ని ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు సైతం బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. అయితే ఈ విష‌యంలో అధినేత‌కు చొర‌వ చూపి చెప్పేంత ధైర్యం, సాహ‌సం చేయడం లేదు. ఒక‌వేళ చెప్పినా.. ఆయ‌న అందుకు సానుకూలంగా స్పంcbn and ntr;cbn;ntr;jr ntr;jagan;cinema;kuppam;tdp;nandamuri taraka rama rao;partyఎన్టీఆర్‌తో చంద్ర‌బాబుకు టెన్ష‌న్ త‌ప్పేలా లేదుగా.. రామ‌య్య వ‌చ్చేస్తాడా..?!ఎన్టీఆర్‌తో చంద్ర‌బాబుకు టెన్ష‌న్ త‌ప్పేలా లేదుగా.. రామ‌య్య వ‌చ్చేస్తాడా..?!cbn and ntr;cbn;ntr;jr ntr;jagan;cinema;kuppam;tdp;nandamuri taraka rama rao;partySat, 27 Feb 2021 09:24:28 GMTఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆయ‌న అభిమానులు, టీడీపీ శ్రేణులు ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నాయి. అయితే చంద్ర‌బాబుతో ఏర్ప‌డిన రాజ‌కీయ విబేధాల‌తోనే ఆయ‌న పార్టీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నార‌న్న‌ది ఆ పార్టీ నేత‌లే ఆఫ్ ది రికార్డులో చెబుతున్న మాట‌లు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తోనే టీడీపీకి మ‌ళ్లీ పూర్వ వైభ‌వం వ‌స్తుంద‌ని ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు సైతం బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. అయితే ఈ విష‌యంలో అధినేత‌కు చొర‌వ చూపి చెప్పేంత ధైర్యం, సాహ‌సం చేయడం లేదు. ఒక‌వేళ చెప్పినా.. ఆయ‌న అందుకు సానుకూలంగా స్పందిస్తార‌న్న న‌మ్మ‌కం లేదు.. పైగా చివాట్లు పెట్టిన ఆశ్చ‌ర్యం లేదు. ఇదంతా మ‌న‌కెందుకు వ‌చ్చిన త‌ల‌నొప్పి అంటూ స‌ర్దుకుపోయే సీనియ‌ర్ నేత‌లే ఎక్కువ‌.


వాస్త‌వానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ టీడీపీలో ఆక్టివ్ అయితే పార్టీకి ఖ‌చ్చితంగా ప్ల‌స్ అవుతుంది ఆ విష‌యంలో అధినేత చంద్రబాబుకు తెలియ‌ని విష‌య‌మే కాదు. అయితే టీడీపీపై త‌న ప‌ట్టు జారిపోతుంద‌నే భ‌యాందోళ‌న‌తోనే ఎన్టీఆర్‌కు చంద్ర‌బాబు నుంచి పిలుపు వెళ్ల‌డం లేద‌న్న‌ది ఆపార్టీలోని కొంత‌మంది నేత‌లు చెప్పుకొస్తున్నారు. గ‌తంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ టీడీపీ త‌రుపున ప్ర‌చారం నిర్వ‌హించ‌డంతో పార్టీలో ఊపు క‌నిపించింది. రోడ్డు ప్ర‌మాదంలో ఎన్టీఆర్ గాయ‌ప‌డ‌టం ఆ త‌ర్వాత వారి కుటుంబంలో వ‌రుస విషాదాలు...సినిమా కెరీర్‌లో బిజిగా మారిపోవ‌డం ఇవ‌న్నీ చ‌క‌చ‌క జ‌రిగిపోయాయి. మ‌ధ్య‌లో చంద్ర‌బాబు కూడా కావాల‌నే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను పార్టీలో ప్రాధాన్యం త‌గ్గిస్తున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఆయ‌న‌కు న‌చ్చ‌క‌నే దూరంగా ఉంటున్నార‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.


గ‌తంలో చాలా జ‌రిగినా... ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. రెండు రోజుల పర్యటన కోసం కుప్పం విచ్చేసిన చంద్రబాబు, శుక్రవారం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. వీలైన చోటల్లా పార్టీ శ్రేణులతో మాట్లాడారు. కుప్పం జగన్ జాగీరు కాదని, కుప్పంలోనే మకాం వేసి.. వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తానని ఆయన ప్రతినబూనారు. అయితే, అనూహ్య రీతిలో బాబుకు ఓ చేదు అనుభవం కూడా ఎదురైంది. టీడీపీ అధినేతకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రూపంలో సెగ తగిలింది.  చంద్ర‌బాబు ఎదుట కార్య‌క‌ర్త‌లు నియ‌ర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావాల‌ని డిమాండ్ చేయ‌డం విశేషం. టీడీపీలోకి జూనియ‌ర్ ఎన్టీఆర్ పున‌రాగ‌మ‌నం చేస్తారా..? అందుకు సానుకూల‌త ఎంత‌..? చ‌ంద్ర‌బాబు చొర‌వ చూపుతారా..? తార‌క్ స‌రే అనే ప‌రిస్థితి ఉందా అంటే కొద్దిరోజులు ఆగితే గాని ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త‌రాదు.


ముఖాన్ని ఏ నీటితో కడగాలో తెలుసా..!

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...

బ్రాహ్మ‌ణ ఘోష‌: పెద్ద‌ల స‌భ‌లో మూగ‌బోయిన బ్రాహ్మ‌ణ వాణి..!

చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్..?

కాపు వేద‌న‌: కార్పొరేష‌న్ల‌లో పార్టీల త‌ల‌రాత‌లు మార్చ‌నున్న కాపులు ?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>