PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/new-traffic-rules-implementation0beff869-9787-4594-8d41-0de2690c0e2b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/new-traffic-rules-implementation0beff869-9787-4594-8d41-0de2690c0e2b-415x250-IndiaHerald.jpgమోటారు వాహన నిబంధనలను ప్రభుత్వం సవరించింది. దీన ప్రకారం ఇకపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే సాక్ష్యాధారాలతో సహా రికార్డ్ అవుతుంది. అంటే తప్పించుకోడానికి వాహనదారులకు ఎలాంటి అవకాశం ఉండదనమాట. ఎలక్ట్రానిక్ మానిటరింగ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫ్ రోడ్ సేఫ్టీ పేరుతో నిబంధనలు జతచేసిన ప్రభుత్వం ముసాయిదాని విడుదల చేసింది. new traffic rules;amala akkineni;police;population;central government;redట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక బ్యాండ్ బాజానే..ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక బ్యాండ్ బాజానే..new traffic rules;amala akkineni;police;population;central government;redSat, 27 Feb 2021 11:00:00 GMT
కేంద్ర మోటారు వాహన నిబంధనలు-1989ని సవరిస్తూ ముసాయిదా విడుదల చేసింది ప్రభుత్వం. ఇందులో రూల్‌ 139-ఎ కింద కొత్తగా ‘కంట్రోల్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌’ అని, 139-బి కింద ‘ఎలక్ట్రానిక్‌ మానిటరింగ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ రోడ్‌ సేఫ్టీ’  కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. వీటిపై అభ్యంతరాలున్నవారు 30రోజుల లోపు సలహాలు, సూచనలు పంపాలని ఆహ్వానించింది.

కొత్త నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..
కొత్త నిబంధనల ప్రకారం పోలీసులు, రవాణా సిబ్బందికి బాడీ వేరబుల్‌ కెమెరాలు ఇస్తారు. రహదారుల వెంట పోలీసు వాహనాల డ్యాష్‌ బోర్డుల్లోనూ ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేస్తారు. అందులోనే సీసీటీవీ కెమెరా, స్పీడ్‌గన్‌, వాహనాల బరువును పసిగట్టే సెన్సార్లు ఉంటాయి.

కొత్త నిబంధనల ప్రకారం పోలీసులు ధరించిన కెమెరాలు, రహదారుల పక్కన ఏర్పాటు చేసిన కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాలు, చిత్రాల ఆధారంగా చర్యలు తీసుకొనే అధికారం పోలీసులు, రవాణా అధికారులకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని హైరిస్క్‌, హైడెన్సిటీ కారిడార్లు, జాతీయ, రాష్ట్ర రహదారులు, రద్దీ కూడళ్లు, రాష్ట్ర రాజధానులు, 10లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో ఇలాంటి ఎలక్ట్రానిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పరికరాలు ఏర్పాటు చేస్తాయి. అతి వేగంతో వాహనాన్ని నడిపినప్పుడు; నోపార్కింగ్ ఏరియాల్లో వాహనాలను ఆపినప్పుడు, డ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపినప్పుడు, ఈ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా చలానాలు జారీ చేస్తారు. రెడ్ సిగ్నల్ క్రాస్ చేసినా, ఓవర్ టేక్ చేసినా కూడా ఈ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది కాబట్టి, దాని ప్రకారం చలానా వెళ్లిపోతుంది. అయితే చలాన్లు రాస్తే.. ఆ విషయంపై 15 రోజుల్లోపు వాహనదారులకి నోటీసు పంపాల్సి ఉంటుంది. చలాన్లను నిర్దిష్ట గడువులోగా చెల్లించేలా నిబంధనలు కూడా ఇందులో పొందు పరిచారు. ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా సేకరించిన సాక్ష్యాధారాలను కనీసం 30 రోజుల పాటు భద్రపరిచి వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటారు. మొత్తమ్మీద ఇకపై చలాన్లు రాయడానికి రికార్డెడ్ సాక్ష్యాధారాలను తీసుకు వస్తోంది ప్రభుత్వం. పోలీసులకే వేరబుల్ కెమెరాలు ఇచ్చి మరింత పగడ్బందీగా నిబంధనలు అమలు చేయబోతోంది. 


ఇక లాభం లేదు... రంగంలోకి దిగిన జగన్

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌లో ఆరు మావే అంటోన్న టీడీపీ.. లిస్ట్ ఇదే ?

పుర పోరు : విశాఖలో వేడెక్కించేసిన వైసీపీ...?

జూనియర్ ఎన్టీయార్ ఎంట్రీకి బాబు ఓకేనా..?

పుర పోరు: ఏపీలో జ‌గ‌నోరికి దెబ్బ ప‌డేది ఇక్క‌డే.. డౌటే లేదు..?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>