PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/municipal-polls849aa634-0f69-4301-8c73-5e974c3e5c6f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/municipal-polls849aa634-0f69-4301-8c73-5e974c3e5c6f-415x250-IndiaHerald.jpgఏపీలో 4 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఓవైపు ఎన్నికల కమిషన్, పోలీసులు చెబుతున్నా.. ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఎన్నికల ప్రక్రియపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో పురపోరుపై మరింత పగడ్బందీగా వ్యవహరించాలని చూస్తోంది ఎన్నికల కమిషన్. అందుకే వీడియో రికార్డింగ్ లపై ఆధారపడుతోంది. municipal polls;district;police;panchayati;letter;tdp;local languageపురపోరు: ఈసారి వీడియో రికార్డింగ్ లే సాక్ష్యం..పురపోరు: ఈసారి వీడియో రికార్డింగ్ లే సాక్ష్యం..municipal polls;district;police;panchayati;letter;tdp;local languageFri, 26 Feb 2021 11:00:00 GMTఏపీలో 4 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఓవైపు ఎన్నికల కమిషన్, పోలీసులు చెబుతున్నా.. ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఎన్నికల ప్రక్రియపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో పురపోరుపై మరింత పగడ్బందీగా వ్యవహరించాలని చూస్తోంది ఎన్నికల కమిషన్. అందుకే వీడియో రికార్డింగ్ లపై ఆధారపడుతోంది.

పురఎన్నికల ప్రక్రియలో భాగంగా.. జిల్లా ఖజానా, ఉప ఖజానా కార్యాలయాల్లో ఇదివరకు భద్రపరిచిన నామినేషన్‌ పత్రాలు, పోలింగ్‌ సామగ్రిని తగిన పోలీసు బందోబస్తు మధ్య బయటకు తీయించాలని అధికారులకు సూచించింది ఎన్నికల కమిషన్. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయించాలని పేర్కొంది. 75 పురపాలక, నగర పంచాయతీ, 12 నగరపాలక సంస్థల్లో వచ్చే నెల 2 నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం అవుతోంది. దీనికి ముందస్తు ఏర్పాట్లపై పుర కమిషనర్లకు పురపాలకశాఖ పలు సూచనలు చేసింది.

కరోనా కారణంగా గతేడాది మార్చిలో మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా వేసిన సమయంలో అప్పటికే దాఖలైన నామినేషన్లు, సంబంధిత పత్రాలు, ఇతర సామగ్రిని జిల్లా ట్రెజరీ, సబ్‌ ట్రెజరీ కార్యాలయాల్లో భద్రపరిచారు. ఎన్నికల సంఘం ఈ నెల 15న తాజా ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేయడంతో.. భద్రపరిచిన పోలింగ్‌ సామగ్రిని బయటకు తీస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన వెంటనే బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తులతో బ్యాలెట్‌ పత్రాలు ముద్రించేందుకు స్థానికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటు ముద్ర వేసేందుకు 40 వేల కొత్త ఇంకు బాటిళ్లు తెప్పిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 9,307 పోలింగు కేంద్రాలను మున్సిపల్ ఎన్నికలకోసం సిద్ధం చేశారు. వీటిలో 109 చోట్ల మార్పులు అవసరమని కమిషనర్లు ప్రతిపాదించారు. గతంలో 666 మంది ఎన్నికల అధికారులు, 670 మంది అదనపు, సహాయ ఎన్నికల అధికారులను నియమించారు. వీరిలో 12 శాతం మంది బదిలీ, పదవీవిరమణ కారణాలతో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియకు అందుబాటులో లేరు. దీంతో వారి స్థానంలో అదే హోదా గల అధికారులను నియమించబోతున్నారు. మరోవైపు ప్రతి జిల్లాకు సమన్వయ అధికారులను సైతం ఎన్నికల కమిషన్ నియమించింది. 


ఫౌంహౌస్ అంటే మీకేమ‌ర్థ‌మ‌వుతుంది?

పుర పోరు: టీడీపీ మేయ‌ర్‌గా క‌మ్మ నేత ఖ‌రారైన‌ట్టే ?

టీచర్ల కష్టాలు: ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు.. కష్టాల నెలవులు..!

పుర పోరు: నా మాటే.. కాదు నా మాటే.. వైసీపీలో ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే ?

చైనా సంచలన ప్రకటన వెనుక.. అసలు నిజం ఇదే..?

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌... ఆ నేతే టార్గెట్టా ?

పుర పోరు : వైసీపీ ని గెలిపిస్తాను అంటున్న టీడీపీ ఎమ్మెల్యే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>