BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/white-heads-blacka04fe28c-6a5d-4a36-b5db-687a2da08d2b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/white-heads-blacka04fe28c-6a5d-4a36-b5db-687a2da08d2b-415x250-IndiaHerald.jpgమనలో చాలా మంది ముఖం మీద ఉన్న చర్మ రంధ్రాలను పూడ్చడానికి, ముఖాన్ని తెల్లగా మార్చుకోవడానికి, ముఖం అందంగా ఉండేలా చేసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ముఖం మీద అనుకోకుండా వచ్చే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటివాటిని తొలగించాలంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి, తగ్గించుకోవచ్చు.. అయితే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..white,heads black;egg;oil;aaviri;coffeeబ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..?బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..?white,heads black;egg;oil;aaviri;coffeeFri, 26 Feb 2021 09:45:00 GMTమనలో చాలా మంది ముఖం మీద ఉన్న చర్మ రంధ్రాలను పూడ్చడానికి, ముఖాన్ని తెల్లగా మార్చుకోవడానికి, ముఖం అందంగా ఉండేలా చేసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ముఖం మీద అనుకోకుండా వచ్చే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటివాటిని తొలగించాలంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి, తగ్గించుకోవచ్చు.. అయితే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


గుడ్డు లోని తెల్లసొన ఇందుకు బాగా పనికి వస్తుంది. గుడ్డులోని తెల్ల సొన తీసుకొని, ముక్కు మీద, గడ్డ మీద,ఎక్కడైతే మీ ముఖం మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కనిపిస్తాయో, వాటి పైన ఒక మందపాటి లేయర్ లాగా అప్లై చేయాలి. అయితే పూర్తిగా ఆరేవరకు వదిలేయాలి. ఆ తరువాత ఫీల్ ఆఫ్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల ముక్కు మీద, గడ్డం మీద ఉన్న బ్లాక్ హెడ్స్,  వైట్ హెడ్స్ అన్ని ఆ మాస్క్ తో పాటు బయటకు వచ్చేస్తాయి.  ఆ తర్వాత ఎక్కడైతే ఈ మాస్క్ ను అప్లై చేస్తామో, ఆ భాగంలో మాశ్చరైజర్ ఉపయోగించడం ఉత్తమం.

అంతేకాకుండా కాఫీ పొడి లో కొద్దిగా చక్కెర,ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖం మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నచోట స్క్రబ్ లాగ ఉపయోగించాలి. 20 నిమిషాలపాటు ఆరనిచ్చి, ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్లో దొరికే ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ కూడా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే ఫెవికాల్ కూడా ముక్కు మీద ఏర్పడ్డ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ పద్ధతిని నెలకు ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. ముక్కుపైన ఫెవికాల్  ను ఒక మందపాటి లేయర్ లాగ వేసి, పది నిమిషాలు ఆరనిచ్చి, తర్వాత ఫీల్ ఆఫ్ చేసేయాలి. అయితే ఈ పద్ధతిని పాటించే ముందు ముఖానికి ఆవిరి పట్టడం వంటివి చేయాలి.




డైరెక్టర్ తేజ పరిచయం చేసిన 12 మంది నటులు ఎవరో తెలుసా..!?

పుర పోరు: టీడీపీ మేయ‌ర్‌గా క‌మ్మ నేత ఖ‌రారైన‌ట్టే ?

టీచర్ల కష్టాలు: ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు.. కష్టాల నెలవులు..!

పుర పోరు: నా మాటే.. కాదు నా మాటే.. వైసీపీలో ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే ?

చైనా సంచలన ప్రకటన వెనుక.. అసలు నిజం ఇదే..?

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌... ఆ నేతే టార్గెట్టా ?

పుర పోరు : వైసీపీ ని గెలిపిస్తాను అంటున్న టీడీపీ ఎమ్మెల్యే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>