PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vasupalli07811cbf-0474-4cfb-b1c6-70217d40ce31-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vasupalli07811cbf-0474-4cfb-b1c6-70217d40ce31-415x250-IndiaHerald.jpgటీడీపీకి వైసీపీకి ఉప్పు నిప్పులా సీన్ ఉంటుంది. అసలు ఈ రెండు పార్టీల నేతలు మర్యాదాపూర్వకంగా కూడా కలసిన సందర్భాలు ఉండవు. అలాంటిది ఒక టీడీపీ ఎమ్మెల్యే దాదాపు పద్నాలుగేళ్ల పాటు టీడీపీలో కొనసాగి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో కీలకమైన పదవులను అందుకున్న నాయకుడు వైసీపీని గెలిపించి తీరుతాను అని అనడం అంటే విడ్డూరమే. vasupalli;kumaar;tiru;korea, south;jagan;ganesh kumar vasupalli;vishakapatnam;assembly;mla;fire;tdp;ycpపుర పోరు : వైసీపీ ని గెలిపిస్తాను అంటున్న టీడీపీ ఎమ్మెల్యే...?పుర పోరు : వైసీపీ ని గెలిపిస్తాను అంటున్న టీడీపీ ఎమ్మెల్యే...?vasupalli;kumaar;tiru;korea, south;jagan;ganesh kumar vasupalli;vishakapatnam;assembly;mla;fire;tdp;ycpFri, 26 Feb 2021 08:13:05 GMTటీడీపీ ఎమ్మెల్యే దాదాపు పద్నాలుగేళ్ల పాటు టీడీపీలో కొనసాగి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో కీలకమైన పదవులను అందుకున్న నాయకుడు వైసీపీని గెలిపించి తీరుతాను అని అనడం అంటే విడ్డూరమే.

ఆయన ఎవరో కాదు విశాఖలోని సౌత్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన తన కుమారులిద్దరినీ ఆ మధ్యన జగన్ ని కలసి మరీ వైసీపీలో చేర్పించారు. ఆయన వైసీపీకి జై కొడుతున్నా కూడా ఇంకా సాంకేతికంగా చూస్తే టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. అసెంబ్లీ రికార్డులలో కూడా ఆయన టీడీపీ ఎమ్మెల్యే. ఇపుడు ఆయన జీవీఎంసీ  ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తన నియోజకవర్గంలో తిరుగుతూ వైసీపీ విజయానికి గట్టిగానే  కృషి చేస్తున్నారు.

సరిగ్గా ఏడాది క్రితం చూస్తే ఇదే ఎమ్మెల్యే వాసుపల్లి టీడీపీ గెలుపు కోసం జనంలోకి వచ్చారు. ఆనాడు ఆయన టీడీపీ జెండా జీవీఎంసీ మీద ఎగురుతుందని చెప్పుకొచ్చారు. ఇపుడు దానికి పూర్తి భిన్నంగా వైసీపీ జెండాను విశాఖ కార్పోరేషన్ ఆఫీస్ మీద ఎగరేసేవరకూ విశ్రమించేది లేదు అంటున్నారు. వాస్తవానికి వాసుపల్లి విశాఖ  సౌత్ లో  బలమైన నాయకుడు. ఆయనకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన నియోజకవర్గంలో 13 కార్పోరేట్ సీట్లు ఉన్నాయి. ఇవన్నీ గుత్తమొత్తంగా వైసీపీ పరం చేయడం ద్వారా తన సత్తాను చాటుకోవాలని ఆయన చూస్తున్నారు. వాసుపల్లి వైసీపీలోకి రావడంతో టీడీపీకి గట్టి నాయకుడు అక్కడ మరొకడు  లేడు అని చెప్పాలి. దాంతో పాటు వాసుపల్లికి ఉన్న పలుకూడి, దూకుడూ చూస్తూంటే అత్యధిక శాతం వార్డులు వైసీపీ ఖాతాలో పడడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి వాసుపల్లి రాకతో వైసీపీకి మంచి బలం చేకూరింది అని అంటున్నారు.




దాయాదితో శాంతి నినాదం... పాక్‌తో చ‌ర్చ‌ల‌కు భార‌త్ స‌మ్మ‌తం..

“కలలోకొచ్చి కలవరపెట్టటం కాదే! ఇంటికిరా! ఒకసారి!” అంటూ ఆమెకు టీఆరెస్ నేత వేధింపులు వెకిలిచేష్టలు

పుర పోరు: అక్క‌డ టీడీపీ నేతల పంతాలే పార్టీని ఓడిస్తాయా ?

హెరాల్డ్ సెటైర్: పార్టీ పరిస్దితి కూడా ఇలాగే ఉందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్వ‌చ్ఛ‌మైన పాలిటిక్స్‌కు కేరాఫ్ అయినా.... ఈ త‌ప్పు ఎవ‌రిది ?

జ‌గ‌న్ ప‌థ‌కంపై ప‌రేషాన్ రాజ‌కీయం.. తెర‌వెనుక ఉన్న‌దెవ‌రు ?

పాపం.. కేటీఆర్‌..ఎంత గొంతు చించుకున్నా.. ఎవరూ నమ్మడం లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>