Moviessravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aakash3cdce6df-09d5-41c4-929c-b7fffa748b49-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aakash3cdce6df-09d5-41c4-929c-b7fffa748b49-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా పేరు చెప్పగానే ఈ సినిమాఫలానా హీరో అని టక్కున సమాధానం చెప్పేస్తారు. సినిమాలో హీరోకి అంతటి ప్రాముఖ్యత కలిగి.అయితే మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు వారి సినీ జీవితం మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి వెండితెరకు దూరం అయిపోయారు. ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటారు.ఆ విధంగా పరిచయమై ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరోలు ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యాaakash;abbas;akash;jeevitha rajaseskhar;raja;shankar;tarun;tiru;vadde naveen;venkat;roja;new zealand;cinema;telugu;tirupati;tamil;marriage;love;hindi;blockbuster hit;husband;hero;chatrapathi shivaji;sivaji;master;tarun kumar;love story;chitram;loverకెరియర్ మంచి ఊపు మీద ఉండగా సడన్ గా వెండితెరపై... మాయమైన హీరోలు వీళ్లే..!కెరియర్ మంచి ఊపు మీద ఉండగా సడన్ గా వెండితెరపై... మాయమైన హీరోలు వీళ్లే..!aakash;abbas;akash;jeevitha rajaseskhar;raja;shankar;tarun;tiru;vadde naveen;venkat;roja;new zealand;cinema;telugu;tirupati;tamil;marriage;love;hindi;blockbuster hit;husband;hero;chatrapathi shivaji;sivaji;master;tarun kumar;love story;chitram;loverFri, 26 Feb 2021 03:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో హీరోలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా పేరు చెప్పగానే ఈ సినిమాఫలానా హీరో అని టక్కున సమాధానం చెప్పేస్తారు. సినిమాలో హీరోకి అంతటి ప్రాముఖ్యత కలిగి.అయితే మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు వారి సినీ జీవితం మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి వెండితెరకు దూరం అయిపోయారు. ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటారు.ఆ విధంగా పరిచయమై ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరోలు ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ విధంగా ఇండస్ట్రీకి దూరమైన హీరోలు ఎవరో ఇక్కడ చూద్దాం...

1) ఆకాష్:
హీరో ఆకాశ్ అనగానే చాలా మందికి ఆనందం, నవ వసంతం సినిమాలు గుర్తుకొస్తాయి. 1999లో "రోజా వనం" అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆకాశ్ 2001 లో "రామ్మా చిలకమ్మా" అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. అదే విధంగా తెలుగులో ఆనందం సినిమా ఆకాష్ కు మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా తర్వాత పిలిస్తే పలుకుతా, మనసుతో, ఆనందమానందమాయే వంటి సినిమాలలో నటించారు.ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో ఎన్నో చిత్రాలలో నటించిన ఆకాష్ ఒక్క సారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

2) వడ్డే నవీన్:
"కోరుకున్న ప్రియుడు"అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన వడ్డే నవీన్ ఆ తరువాత చాలా బాగుంది, తిరుమల తిరుపతి వెంకటేశా, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది. పెళ్లి వంటి చిత్రాలలో నటించారు. వడ్డే నవీన్ సినీ కెరియర్ లో పెళ్లి మంచి విజయాన్ని అందించింది. హీరో నవీన్ 2010లో శ్రీమతి కళ్యాణం అనే చిత్రంలో చివరిసారిగా హీరోగా నటించారు. తరువాత 2016లో ఎటాక్ అనే సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించి తరువాత వెండితెరకు కనుమరుగైపోయారు.

3) తరుణ్:
తరుణ్ అంటేనే లవర్ బాయ్ అని ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న తరుణ్ బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి కెరియర్ లో మంచి పొజిషన్లో ఉన్న తర్వాత ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. 2014లో వేట అనే సినిమాలో నటించి నాలుగేళ్లపాటు గ్యాప్ తీసుకున్నారు. తరువాత 2018 లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరుణ్ పెద్దగా ప్రేక్షకాదరణ పొందే లేకపోయారు.

4) అబ్బాస్:
అబ్బాస్... అంటే వెంటనే గుర్తొచ్చేది హార్పిక్ అడ్వటైజ్మెంట్. అబ్బాస్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలోనే తన మొదటి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తన మొదటి సినిమా ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న తర్వాత ఎన్నో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటించారు. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు.

5) శివాజీ:
శివాజీ ఎన్నో సినిమాలలో నటిస్తూ మరికొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లలో అందరినీ మెప్పించారు. 1997 లో మాస్టర్ సినిమా ద్వారా తన కెరీర్ ని ప్రారంభించిన శివాజీ తరువాత పలు సినిమాలలో సందడి చేశారు. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల వైపు వెళ్లారు. వీరే కాకుండా హీరో వేణు, రాజా, వెంకట్ వంటి మరికొంత మంది హీరోలు కూడా ఇదే విధంగా ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైన వారి జీవితాలలో స్థిరపడ్డారు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : విష్ణుపై దాడి వెనక ఇంత జరిగిందా ?

జగన్ కి కుప్పం ప్రజల కృతజ్ఞతలు..

వైఎస్ షర్మిల పార్టీలోకి మాజీ మంత్రి....?

పుర పోరు : అక్కడ వైసీపీకి బీజేపీ బ్రేకులు...?

'ఉప్పెన' సినిమాకు వైష్ణవ్ తేజ్ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా..?

పుర పోరు : విశాఖ టీడీపీకి కొత్త చిక్కులు ?

టాలీవుడ్ లో గొప్ప నటుడు ఎవరో తెలుసా.. సంచలన నిజాలు బయటపెట్టిన పోల్ .




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>