BusinessGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/business-women-latest-ap-tsb2609835-f8fb-49da-9c9d-59e8ad8fc220-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/business-women-latest-ap-tsb2609835-f8fb-49da-9c9d-59e8ad8fc220-415x250-IndiaHerald.jpg ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ (మోరిస్ గ్యారేజ్) మోటార్స్ భారత మార్కెట్లో తమ 50,000వ హెక్టర్ ఎస్‌యూవీని ఉత్పత్తి చేసినట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన ఎస్‌యూవీని పూర్తిగా మహిళా సిబ్బందితోనే త‌యారు చేయ‌డం విశేషం. ఈ బండి త‌యారీ ప్రారంభం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేవ‌ర‌కు ప్ర‌తి అంగుళాన్ని మ‌హిళా సిబ్బందే త‌యారుచేశార‌ని కంపెనీ తెలిపింది. ప్రొడక్షన్ సమయంలో షీట్ మెటల్‌ను బెండ్ చేయటం మరియు వెల్డింగ్ మొదలుకొని ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత టెస్ట్ రన్ వరకూ పూర్తిగా మహిళా ఉద్యోగులే ఇందులో పాలుపంచుకున్నారు. business, women, latest, ap, ts;auto;manya;delhi;petrol;diesel;local language;central government;redఎంజీ హెక్ట‌ర్‌... మ‌హిళా శ‌క్తికి ప్ర‌తీక‌ఎంజీ హెక్ట‌ర్‌... మ‌హిళా శ‌క్తికి ప్ర‌తీక‌business, women, latest, ap, ts;auto;manya;delhi;petrol;diesel;local language;central government;redFri, 26 Feb 2021 15:35:14 GMT
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ (మోరిస్ గ్యారేజ్) మోటార్స్ భారత మార్కెట్లో తమ 50,000వ హెక్టర్ ఎస్‌యూవీని ఉత్పత్తి చేసినట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన ఎస్‌యూవీని పూర్తిగా మహిళా సిబ్బందితోనే త‌యారు చేయ‌డం విశేషం. ఈ బండి త‌యారీ ప్రారంభం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేవ‌ర‌కు ప్ర‌తి అంగుళాన్ని మ‌హిళా సిబ్బందే త‌యారుచేశార‌ని కంపెనీ తెలిపింది. ప్రొడక్షన్ సమయంలో షీట్ మెటల్‌ను బెండ్ చేయటం మరియు వెల్డింగ్ మొదలుకొని ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత టెస్ట్ రన్ వరకూ పూర్తిగా మహిళా ఉద్యోగులే ఇందులో పాలుపంచుకున్నారు. ఎమ్‌జి మోటార్ ఇండియాకు గుజరాత్‌లోని హలోల్ వద్ద త‌యారీ కేంద్రం ఉంది.

ప్రస్తుతం ఈ ప్లాంటులో 33 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.  వీరి సామర్థ్యాన్ని 50 శాతానికి పెంచాలని కంపెనీ ప్ర‌ణాళిక ర‌చిస్తోంది. స్థానికులకు సైతం సమాన ఉద్యోగ అవకాశాలను కల్పించేలాచర్యలు తీసుకుంటున్నారు.  ప్రస్తుతం మార్కెట్లో కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ధరలు రూ.12.90 లక్షల నుండి రూ.18.63 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ కూడా మునుపటి మాదిరిగానే స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీ కేవలం 5-సీటర్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో అధిక సీటింగ్ సామర్థ్యం కోరుకునే వారి కోసం కంపెనీ హెక్టర్ ప్లస్ అనే ఎస్‌యూవీని కూడా అందిస్తోంది.


సరికొత్త క్రోమ్-స్టడెడ్ ఫ్రంట్ గ్రిల్, పెద్ద 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడి టెయిల్స్ లైట్స్ మధ్యలో రెడ్ స్ట్రిప్‌ను రీప్లేస్ చేసే బ్లాక్-అవుట్ ఎలిమెంట్ మరియు పైన బ్లాక్ కలర్ రూఫ్‌తో కూడిన డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు.

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 140 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ ఆప్షనల్ 48వి హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడా అందుబాటులో ఉంది. స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు ఆప్షనల్ సెవన్-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జ‌త‌చేసి ఉంటుంది. 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 170 బిహెచ్‌పి, 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.




మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?

పుర పోరు : విశాఖ ఎన్నికల్లో పార్టీలకు అక్కడ షాక్...?

కృష్ణ తులసి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య గురించి ఆసక్తికర విషయాలు

నటి శైలజా ప్రియ వయసు ఎంతో తెలుసా.. ఆమె భర్త ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>