PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/wooden-statuec0ceb374-a373-4e3c-9175-ba2063452faa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/wooden-statuec0ceb374-a373-4e3c-9175-ba2063452faa-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో భార్యను వేధింపులకు గురి చేసే భర్తల గురించి చాల కథనాలల్లో చదువుతూనే ఉంటాం. కాగా గతేడాది ఆగష్టులో కర్ణాటకలో ఇటువంటి ఘటన జరిగింది. కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా భార్య కొన్నేళ్ళ క్రిందట ఓ రోడ్డు యాక్సిడెంట్‌లో మరణించారు. చావు మనిషినే కానీ.. మనసులను దూరం చేయదని ఈ దంపతుల మధ్య ప్రేమానుబంధాలు మరోసారి నిరూపించాయి.wooden statue;pooja hegde;ramana;srinivas;veerabhadram;august;wife;aqua;local language;kakinada;pettaభార్యకు ప్రేమతో.. నిలువెత్తు చెక్క విగ్రహం.. ఎక్కడంటే..!?భార్యకు ప్రేమతో.. నిలువెత్తు చెక్క విగ్రహం.. ఎక్కడంటే..!?wooden statue;pooja hegde;ramana;srinivas;veerabhadram;august;wife;aqua;local language;kakinada;pettaFri, 26 Feb 2021 07:00:00 GMTశ్రీనివాస్ గుప్తా భార్య కొన్నేళ్ళ క్రిందట ఓ రోడ్డు యాక్సిడెంట్‌లో మరణించారు. చావు మనిషినే కానీ.. మనసులను దూరం చేయదని ఈ దంపతుల మధ్య ప్రేమానుబంధాలు మరోసారి నిరూపించాయి. భార్య కాలం చేసిన కొన్నాళ్లకు శ్రీనివాస్ గుప్తా కొత్తింటికి గృహప్రవేశం చేశాడు. ఈ శుభ కార్యక్రమానికి తన భార్య లేని లోటు తెలియకుండా ఉండాలని అనుకున్నాడు. తాజాగా అలాంటి ఘటనే మరొక్కటి చోటు చేసుకుంది.

ఇక భార్యపై ఉన్న ప్రేమతో ఆమె విగ్రహం తయారు చేయించిన సంఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. తనను విడిచి పరలోకాలకు వెళ్ళిపోయిన భార్యపై తనకున్న ఎనలేని ప్రేమను చాటుకున్నాడు ఓ వ్యక్తి. ఆమె మధురస్మృతులు ఎప్పటికీ తనతోనే ఉండాలనే ఉద్దేశంతో భార్యకు ఏకంగా నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించాడు. అంతేకాదు, వేదమంత్రాల సాక్షిగా ఆమె విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించుకున్నాడు.

కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట గ్రామం రమణ రావు కాలనీలో నివాసముంటున్నారు.. మూడవ ఏపీఎస్పీ రిటైర్డ్ ఆర్ఎస్ఐ బుర్ర వీరభద్రం..ఇతని భార్య మాణిక్యాంబ..వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే గతేడాదిన్నర క్రితం అంతుపట్టని రోగంతో హఠాత్తుగా భార్య మృతి చెందింది. దీంతో వీరభద్రం తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మాణిక్యమ్మ జ్ఞాపకాలు పదిలంగా దాచుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం ఆమెకు నిలువెత్తు విగ్రహం చేయించాడు.

నవర గ్రామానికి చెందిన శిల్పి సత్యలింగంను సంప్రదించి అతని భార్య ప్రతిమను టేకు చెక్కతో తయారు చేయించాడు. మూడు నెలల శ్రమ ఫలితంగా మాణిక్యమ్మ ప్రతిబింబం తయారైంది. వేద పండితుల నడుమ, పూజా కార్యక్రమాలతో ఆమె ప్రతిమను ఇంట్లో ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహించారు. వీరభద్రంకు తన భార్యపై ఉన్న ప్రేమను చూసిన స్థానికులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


దాయాదితో శాంతి నినాదం... పాక్‌తో చ‌ర్చ‌ల‌కు భార‌త్ స‌మ్మ‌తం..

“కలలోకొచ్చి కలవరపెట్టటం కాదే! ఇంటికిరా! ఒకసారి!” అంటూ ఆమెకు టీఆరెస్ నేత వేధింపులు వెకిలిచేష్టలు

పుర పోరు: అక్క‌డ టీడీపీ నేతల పంతాలే పార్టీని ఓడిస్తాయా ?

హెరాల్డ్ సెటైర్: పార్టీ పరిస్దితి కూడా ఇలాగే ఉందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్వ‌చ్ఛ‌మైన పాలిటిక్స్‌కు కేరాఫ్ అయినా.... ఈ త‌ప్పు ఎవ‌రిది ?

జ‌గ‌న్ ప‌థ‌కంపై ప‌రేషాన్ రాజ‌కీయం.. తెర‌వెనుక ఉన్న‌దెవ‌రు ?

పాపం.. కేటీఆర్‌..ఎంత గొంతు చించుకున్నా.. ఎవరూ నమ్మడం లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>