PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-ts-politics-bjp-congress-latest8f531ed4-cacd-440f-83a0-0bae9c3a68f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-ts-politics-bjp-congress-latest8f531ed4-cacd-440f-83a0-0bae9c3a68f8-415x250-IndiaHerald.jpg ప్ర‌జ‌ల చేత‌, ప్ర‌జ‌ల కొర‌కు ఎన్నుకోబ‌డిన ప్ర‌తినిధులు వారంతా. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఓట్లు వేసి శాస‌న‌స‌భ‌కు పంపిస్తే రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్న‌వారిపై అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. సాక్షాత్తూ గ‌వ‌ర్న‌ర్‌నే అవ‌మానించారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ప్రతిపక్ష నేత సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు స్పీక‌ర్ సస్పెండ్ చేశారు.ap, ts, politics, bjp, congress, latest;kumaar;sundar;sundar c;bharatiya janata party;bandaru dattatreya;jai ram thakur;bandara;harsh vardhan.;congress;chief minister;petrol;diesel;governor;march;partyగ‌వ‌ర్న‌ర్‌ను నెట్టేసిన ఎమ్మెల్యేలుగ‌వ‌ర్న‌ర్‌ను నెట్టేసిన ఎమ్మెల్యేలుap, ts, politics, bjp, congress, latest;kumaar;sundar;sundar c;bharatiya janata party;bandaru dattatreya;jai ram thakur;bandara;harsh vardhan.;congress;chief minister;petrol;diesel;governor;march;partyFri, 26 Feb 2021 17:19:56 GMT 
గ‌వ‌ర్న‌ర్‌కు అవ‌మానం

ప్ర‌జ‌ల చేత‌, ప్ర‌జ‌ల కొర‌కు ఎన్నుకోబ‌డిన ప్ర‌తినిధులు వారంతా. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఓట్లు వేసి శాస‌న‌స‌భ‌కు పంపిస్తే రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్న‌వారిపై అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. సాక్షాత్తూ గ‌వ‌ర్న‌ర్‌నే అవ‌మానించారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ప్రతిపక్ష నేత సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు స్పీక‌ర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే మార్చి 20వ తేదీ వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా, సస్పెండైన వారిలో ప్రతిపక్ష నేత ముకేష్ అగ్నిహోత్రి, ఎమ్మెల్యేలు హర్ష్ వర్ధన్ చౌహాన్, సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ రైజదా, వినయ్ కుమార్ ఉన్నారు.  గవర్నర్‌ను నెట్టేసిన ఘటనపై హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సంఘ‌ట‌న‌ను ఖండించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. సమస్యలపై ప్రశ్నిస్తే వేటు వేస్తారా అని ప్ర‌శ్నించింది.  గవర్నర్ తన ప్రసంగంలో అబద్ధాలను చ‌దివార‌ని ఆ పార్టీ ఆరోపించింది.

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉదయం గవర్నర్ దత్తాత్రేయ అసెంబ్లీకి హాజరయ్యారు. సమావేశం మొదటి నుంచే కాంగ్రెస్ సభ్యులు పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడాలంటూ డిమాండ్ చేశారు. నినాదాలు చేస్తూ సభకు ఆటంకం కలిగించారు.  సభలో గందరగోళం నెల‌కొన‌డంతో దత్తాత్రేయ తన ప్రసంగం చివరి వ్యాఖ్యలను చదివి తన ప్రసంగం పూర్త‌యిన‌ట్లు భావించాలంటూ స‌భ నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించి నెట్టేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీనిపై అధికార బీజేపీ సభ్యులు  మండిపడ్డారు. గవర్నర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్మెండ్ చేయాలని బీజేపీ తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌గా స్పీక‌ర్ ఆమోదం తెలిపారు. 


ఆకాశమే హద్దురా నిజంగా ఆస్కార్ కి వెళ్లిందా??

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>