TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/sameeraed2d508c-8ce1-4264-9a2e-2bdb7ec57d8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/sameeraed2d508c-8ce1-4264-9a2e-2bdb7ec57d8e-415x250-IndiaHerald.jpgతన అందం అభినయంతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను చాలాకాలంపాటు అలరించిన సమీరా షరీఫ్ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ఆమె సీరియళ్లకు, ప్రోగ్రాములకు దూరంగా ఉంటున్నారు. జీ తెలుగు లో ప్రసారం అయిన ఎన్నో సీరియళ్ళలో ఆమె వరుసగా నటించారు. నాగబాబు నేతృత్వంలో ప్రారంభమైన అదిరింది కామెడీ షో కి ఆమె యాంకర్ గా కూడా వ్యవహరించారు. అప్పుడే ఆమెకు బాగా పాపులారిటీ వచ్చింది. sameera;abinaya;raja;sana;victoria;cinema;marriage;youtube;you tube;comedy;wife;hero;heroine;raja the great;sameera sherief;adirindiఅక్కగా భావించిన ఆమే నేను హీరోతో ఎఫైర్ పెట్టుకున్నానని ప్రచారం చేసింది: యాంకర్ సమీరాఅక్కగా భావించిన ఆమే నేను హీరోతో ఎఫైర్ పెట్టుకున్నానని ప్రచారం చేసింది: యాంకర్ సమీరాsameera;abinaya;raja;sana;victoria;cinema;marriage;youtube;you tube;comedy;wife;hero;heroine;raja the great;sameera sherief;adirindiFri, 26 Feb 2021 20:12:53 GMTసమీరా షరీఫ్ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ఆమె సీరియళ్లకు, ప్రోగ్రాములకు దూరంగా ఉంటున్నారు. జీ తెలుగు లో ప్రసారం అయిన ఎన్నో సీరియళ్ళలో ఆమె వరుసగా నటించారు. నాగబాబు నేతృత్వంలో ప్రారంభమైన అదిరింది కామెడీ షో కి ఆమె యాంకర్ గా కూడా వ్యవహరించారు. అప్పుడే ఆమెకు బాగా పాపులారిటీ వచ్చింది.

అయితే సీనియర్ నటిమణి సనా బేగం కుమారుడు సయ్యద్ అన్వర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తన యాక్టింగ్ కెరీర్ కి విరామం ఇచ్చారు. కానీ యూట్యూబ్ లోని తన సొంత ఛానల్లో వీడియోలు పెడుతూ తన అభిమానులకు టచ్ లోనే ఉంటున్నారు. సయ్యద్ తల్లి సనా బేగం ఆవిడా మా ఆవిడే సినిమాలో హెడ్ కానిస్టేబుల్ విక్టోరియా పాత్రలో నటించారు. రాజా ది గ్రేట్ సినిమా లో ఆమె హీరోయిన్ లక్కీ కి ఆంటీగా నటించారు. ఆమె తన సినిమా కెరీర్ లో ఎక్కువగా భార్య, అత్త, పిన్ని వంటి క్యారెక్టర్ రోల్స్ లో చేశారు.

సీరియల్స్ లో హీరో పాత్రలో నటించే ఒక వ్యక్తి తో సమీరా కి ఎఫైర్ ఉందని అప్పట్లో పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల సమీరా షరీఫ్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తనపై గతంలో వచ్చిన పుకార్ల పై స్పందించారు. తన గురించి తప్పుడు ప్రచారం చేసింది తాను ఎప్పుడూ అక్క గా భావించే ఒక సీరియల్ నటి అని సమీరా వెల్లడించారు. అక్క గా భావించిన సహానటి తన పక్కనే ఉంటూ తన గురించి తప్పుడు ప్రచారం చేసింది అనే విషయం తనకు చాలా ఆలస్యంగా తెలిసింది అని ఆమె అన్నారు. తన గురించి తప్పుడు పుకార్లు సృష్టించిందనే నిజాన్ని తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని సమీరా తన బాధను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎవరితో కూడా క్లోజ్ గా ఉండాలి అనుకోవడం లేదని.. వృత్తిపరంగా మాత్రమే మాట్లాడటం తప్పించి.. ఎవరితోనూ క్లోజ్ గా ఉండే ధైర్యం కూడా చేయనని ఆమె అన్నారు.


మరో బాంబ్ పేల్చిన శివాజి!

గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>