PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suicide6df64cf7-aa53-4750-82ec-8398fc7c7b50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suicide6df64cf7-aa53-4750-82ec-8398fc7c7b50-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఏదొఒక్క ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధుల వికృత చేష్టలకు అమ్మాయిల నిండు జీవితాలు బలైపోతున్నాయి. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చినప్పటికీ కామాంధుల ఆగడాలను అరికట్టలేక పోయారు.suicide;mumbai;police;february;husband;central government;father;lieకుటుంబంలో కలకలం రేపుతున్న బాలిక సూసైడ్‌ నోట్‌..!?కుటుంబంలో కలకలం రేపుతున్న బాలిక సూసైడ్‌ నోట్‌..!?suicide;mumbai;police;february;husband;central government;father;lieFri, 26 Feb 2021 08:00:00 GMTకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చినప్పటికీ కామాంధుల ఆగడాలను అరికట్టలేక పోయారు. అమ్మాయిలు వారిపై జరిగిన అఘాయిత్యాల గురించి ఎవరికీ చెప్పుకోలేక మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది.

అయితే ఇంట్లోని వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న సంగతి ఎవరికీ చెప్పలేక ఓ బాలిక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. బాలిక రాసిన సూసైడ్‌ నోట్‌ ఆ కుటుంబంలో కలకలం సృష్టించింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం ముంబై, మల్వానికి చెందిన 14 ఏళ్ల బాలిక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. బాలిక తల్లికి సంఘటనా స్థలంలో ఓ సూసైడ్‌ నోట్‌ లభించింది. అది చదివని ఆమె దాన్ని నమిలి మింగేసింది. అనంతరం పోలీసులకు ఆత్మహత్య విషయం తెలిసింది. అక్కడికి చేరుకున్న పోలీసులకు సూసైడ్‌నోట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌లు లభించాయి.

ఇక ఆ సూసైడ్‌ నోట్‌లో.. ‘నాన్న నువ్వు నన్ను కూతురిలా భావించలేదు. ఇంకో విధంగా భావించావు. నువ్వు నాకు చేసిన దాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను. అందుకే చచ్చిపోతున్నా’ అని సూసైడ్‌ నోట్లో‌ పేర్కొంది. ఆత్మహత్యకు ముందు దీన్ని స్క్రీన్‌ షాట్‌ తీసి స్నేహితులకు, బంధువులకు పంపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి పినతండ్రి తల్లి మూడో భర్త అని విచారణలో తేలింది. హాస్టల్‌లో ఉంటున్న బాలిక లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికి వచ్చింది. ఫిబ్రవరి 21వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. 


పుర పోరు... రూ. 2 ల‌క్ష‌ల‌కు ఓకే

“కలలోకొచ్చి కలవరపెట్టటం కాదే! ఇంటికిరా! ఒకసారి!” అంటూ ఆమెకు టీఆరెస్ నేత వేధింపులు వెకిలిచేష్టలు

పుర పోరు: అక్క‌డ టీడీపీ నేతల పంతాలే పార్టీని ఓడిస్తాయా ?

హెరాల్డ్ సెటైర్: పార్టీ పరిస్దితి కూడా ఇలాగే ఉందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్వ‌చ్ఛ‌మైన పాలిటిక్స్‌కు కేరాఫ్ అయినా.... ఈ త‌ప్పు ఎవ‌రిది ?

జ‌గ‌న్ ప‌థ‌కంపై ప‌రేషాన్ రాజ‌కీయం.. తెర‌వెనుక ఉన్న‌దెవ‌రు ?

పాపం.. కేటీఆర్‌..ఎంత గొంతు చించుకున్నా.. ఎవరూ నమ్మడం లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>