MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sadaa-self-kidnaap-drama-about-6-months43c08cea-789f-4f85-ba08-150c25bf123c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sadaa-self-kidnaap-drama-about-6-months43c08cea-789f-4f85-ba08-150c25bf123c-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఎదగాలన్నా.. నిలదొక్కుకోవాలన్నా.. చాలా కష్టం. ఒకవేళ సక్సెస్ అయితే స్టార్ డమ్ వచ్చేస్తుంది. దాన్ని కొనసాగించుకోవాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. తెలుగులో స్టార్ హీరోయిన్లుగా ఎదిగి.. ఒక వెలుగు వెలిగిపోయిన తర్వాత కనుమరుగై పోయిన వాళ్లూ చాలా మంది ఉన్నారు. అలాంటి హీరోయినే సదా.sadaa;nithin;sada;shankar;teja;vikram;industries;cinema;telugu;smart phone;media;tamil;panchayati;producer;love;industry;producer1;hero;girl;heroine;success;nithin reddyసదా 6 నెలల పాటు తనను తానే ఎందుకు కిడ్నాప్ చేసుకుందిసదా 6 నెలల పాటు తనను తానే ఎందుకు కిడ్నాప్ చేసుకుందిsadaa;nithin;sada;shankar;teja;vikram;industries;cinema;telugu;smart phone;media;tamil;panchayati;producer;love;industry;producer1;hero;girl;heroine;success;nithin reddyFri, 26 Feb 2021 18:00:00 GMTసినిమా పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఎదగాలన్నా.. నిలదొక్కుకోవాలన్నా.. చాలా కష్టం. ఒకవేళ సక్సెస్ అయితే స్టార్ డమ్ వచ్చేస్తుంది. దాన్ని కొనసాగించుకోవాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. తెలుగులో స్టార్ హీరోయిన్లుగా ఎదిగి.. ఒక వెలుగు వెలిగిపోయిన తర్వాత కనుమరుగై పోయిన వాళ్లూ చాలా మంది ఉన్నారు. అలాంటి హీరోయినే సదా.

తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సదా. హీరో నితిన్ కి హీరోయిన్ సదాకి అంతే పేరొచ్చింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ తో సదాకు ఆఫర్లు వచ్చాయి. పరిశ్రమలో సదా స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయమనుకున్నారు. తమిళ్ లో విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమాలోనూ హీరోయిన్ గా నటించింది. ఇదే సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సదా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందని అనుకున్నారు. తర్వాత ఆమెకు ఓ నిర్మాతతో లవ్ ఎఫైర్ ఉందనే వార్తచక్కర్లు కొట్టింది. దీంతో ఆమెకు ఆఫర్లు నెమ్మదించాయి. తర్వాత శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఓ క్యారెక్టర్ చేసింది.

ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ఒక ప్రొడ్యూసర్ సదాకి అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత సదా క్రేజ్ తగ్గిపోవడంతో ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో సదా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసింది. తర్వాత అందరి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదు. దీంతో సదా కిడ్నాప్ కి గురైందని పుకార్లు వచ్చాయి. వాళ్ల అమ్మ విసిగిపోయి మా అమ్మాయి కిడ్నాప్ కాలేదు..రూమర్స్ క్రియేట్ చేశారంటూ మీడియా ముందు చెప్పింది.

దీంతో ఆ నిర్మాత ఇండస్ట్రీ పెద్దల ముందు పంచాయతీ పెట్టాడు. దీంతో సదా డబ్బులు తిరిగి ఇచ్చేసింది. సదా పరువు పోయినట్టు ఫీలైంది. తర్వాత ఏ ప్రొడ్యూసర్ కూడా సదాని నమ్మలేదు.. సరికదా ఆమెకు సినిమా ఆఫర్ చేయలేదు. ఒక్క ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల సదా కెరీర్ నాశనమైంది.


నాటు సారా కోసం తెలివైనా ప్లానే వేశాడు కానీ.. అడ్డంగా అలా.. ఎలా.. బుక్కయ్యారబ్బా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>