PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-fire-on-modi-and-amithshah6c6d171d-19b3-4c06-a356-e8d0c28d47b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-fire-on-modi-and-amithshah6c6d171d-19b3-4c06-a356-e8d0c28d47b1-415x250-IndiaHerald.jpg చెప్ప‌డానికి మాత్ర‌మేకానీ.. ఆచ‌రించ‌డానికి మాత్రం చేతులు రావు అన్న‌ట్లుగా భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌ల తీరు ఉంటోంది. కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన‌ద‌గ్గ‌ర నుంచి ఇష్ట‌మొచ్చిన రీతిలో సంస్థ‌ల‌ను, వ్య‌వ‌స్థ‌ల‌ను అస్త‌వ్య‌స్తం చేస్తున్నారేకానీ దేశాన్ని బాగుచేయాల‌నే ఉద్దేశం మాత్రం ఏమీ క‌న‌ప‌డ‌టంలేద‌ని సొంత పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుంటున్న ప‌రిస్థితి.mamatha , narendra modi, amith shah, central;mamata benerjee;benarjee;mini;west bengal - kolkata;narendra modi;mamata banerjee;prime minister;chief minister;minister;tamilnadu;central government;election commission;april;march;mamta mohandas;partyమీ ఇంటికి వ‌స్తే ఏం పెడ‌తావు.. మా ఇంటికి వ‌స్తే ఏం తెస్తావు..మీ ఇంటికి వ‌స్తే ఏం పెడ‌తావు.. మా ఇంటికి వ‌స్తే ఏం తెస్తావు..mamatha , narendra modi, amith shah, central;mamata benerjee;benarjee;mini;west bengal - kolkata;narendra modi;mamata banerjee;prime minister;chief minister;minister;tamilnadu;central government;election commission;april;march;mamta mohandas;partyFri, 26 Feb 2021 21:07:08 GMTచెప్ప‌డానికి మాత్ర‌మేకానీ.. ఆచ‌రించ‌డానికి మాత్రం చేతులు రావు అన్న‌ట్లుగా భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌ల తీరు ఉంటోంది. కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన‌ద‌గ్గ‌ర నుంచి ఇష్ట‌మొచ్చిన రీతిలో సంస్థ‌ల‌ను, వ్య‌వ‌స్థ‌ల‌ను అస్త‌వ్య‌స్తం చేస్తున్నారేకానీ దేశాన్ని బాగుచేయాల‌నే ఉద్దేశం మాత్రం ఏమీ క‌న‌ప‌డ‌టంలేద‌ని సొంత పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుంటున్న ప‌రిస్థితి. మీ ఇంటికి వ‌స్తే ఏం పెడ‌తావు.. మా ఇంటికి వ‌స్తే ఏం తెస్తావు.. అన్న‌ట్లుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీరుంద‌ని, ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఒకేసారి, ప‌శ్చిమ‌బెంగాల్‌కు మాత్రం ఎనిమిది విడ‌త‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డంలోని మ‌ర్మ‌మేంటో అర్థ‌మ‌వుతోంద‌నే వ్యాఖ్య‌లు విన‌వ‌స్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికలైన దాదాపు రెండేళ్ల తర్వాత దేశంలో మినీ ఎన్నికల సంగ్రామానికి తెరలేసింది. దక్షిణాది, తూర్పు, ఈశాన్య భారతంలోని నాలుగు పెద్ద రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీల ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తంగా ఐదు అసెంబ్లీల పరిధిలో 824 స్థానాలు, 18.68 కోట్ల మంది ఓటర్లున్నారన్న ఈసీ.. ఎన్నికల విధుల్లో 2.7 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారని చెప్పింది.

ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఒకేసారి ఎన్నిక‌ల‌కు నిర్వ‌హిస్తుండ‌గా ప‌శ్చిమ బెంగాల్‌లో 8 ద‌శ‌లు, అసోంలో 3 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని ఈసీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ లో  ఏకంగా 8 ఫేజుల్లో(మార్చి 27, ఏప్రిల్‌ 1, ఏప్రిల్‌ 6, ఏప్రిల్‌ 10, ఏప్రిల్‌ 17, ఏప్రిల్‌ 22, ఏప్రిల్‌ 26, ఏప్రిల్ 29న) ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఇది ముమ్మాటికీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడమేనని బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ మండిపడ్డారు.

అసోంలో మూడు విడతలుగా, తమిళనాడు, కేరళలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తూ, బెంగాల్‌లో మాత్రం ఎందుకు ఎనిమిది విడతలుగా నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క జిల్లాలోనే రెండు, మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు.  ‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సలహా మేరకే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందా? వాళ్ల ప్రచారాన్ని సులభతరం చేయడానికేనా? అస్సాం, తమిళనాడుల్లో తొందరగా ఎన్నికలు పూర్తిచేసుకొని త‌ర్వాత బెంగాల్‌పై ప‌డ‌దామ‌నుకొని ప్ర‌ణాళిక‌లు ర‌చించుకున్నార‌ని, మీ ప‌ప్పులు బెంగాల్లో ఉడ‌క‌వ‌ని మ‌మ‌త ప్ర‌ధాన‌మంత్రిని, హోంమంత్రిని హెచ్చ‌రించారు.


టీడీపీలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ అయ్యారు...?

గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>