EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-jagan-hit-a-severe-blow-on-corporate-schools-managements80bf88e7-d8d3-4e05-a2f7-f3a0a0b86e48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-jagan-hit-a-severe-blow-on-corporate-schools-managements80bf88e7-d8d3-4e05-a2f7-f3a0a0b86e48-415x250-IndiaHerald.jpgఅలాగే స్కూళ్ళ ముఖచిత్రాలను మార్చటం కోసం ‘మనబడి నాడు-నేడు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల పాఠశాలల ముఖచిత్రమే మారిపోయింది. కనీస సౌకర్యాలైన మంచినీరు, టాయిలెట్లు, కాంపౌండ్ వాల్, డిజిటల్ బోర్డులు, ఇంటర్నెట్ సౌకర్యం, కుర్చీలు, బల్లలు ఏర్పడ్డాయి. దాంతో ప్రభుత్వ స్కూళ్ళే కార్పొరేట్ స్కూళ్ళకు మించి కనబడుతున్నాయి. ఇదే సమయంలో అమ్మఒడి పథకంలో స్కూలుకు వెళ్ళే పిల్లల తల్లులకు జగన్ డబ్బులు వేస్తున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్ళల్లోని పిల్లలందరు ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చేస్తున్నారు. పోయిన విద్యాసంవతysr jagan tdp narayana chaitanya ycp;telugu desam party;jagan;telugu;tdp;ammavodi;reddy;corporate;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బ మామూలుగా లేదుగా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బ మామూలుగా లేదుగా ?ysr jagan tdp narayana chaitanya ycp;telugu desam party;jagan;telugu;tdp;ammavodi;reddy;corporate;partyFri, 26 Feb 2021 05:00:00 GMTజగన్మోహన్ రెడ్డి కొడుతున్న దెబ్బ మామూలుగా తగలటం లేదు. ప్రత్యేకించి తెలుగుదేశంపార్టీ ఆర్ధికమూలాలపై చాలా తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ఎందుకంటే ఇపుడు ఉన్న ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు, కార్పొరేట్ స్కూళ్ళ యాజమాన్యాల్లో ఎక్కువభాగం టీడీపీకి చెందినవే. టీడీపీకి ఏ అవసరం వచ్చినా ఈ యాజమాన్యాలు ఆర్ధిక వనరులను సర్దుబాటు చేసేవనే ప్రచారం జరిగేది. సరే ప్రైవేటు యాజమాన్యాల మద్దతు ఎంతున్నా మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఘోర ఓటమి తప్పలేదు. దాంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విద్యా రంగానికి సంబంధించి తీసుకుంటున్న అనేక నిర్ణయాలతో ప్రైవేటు యాజమాన్యాలు కుదేలైపోతున్నాయి. ముందుగా ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టడం. ఇది ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నా ఏదో రూపంలో ఇంగ్లీషు మీడియం అమలవ్వక తప్పదు.




అలాగే స్కూళ్ళ ముఖచిత్రాలను మార్చటం కోసం ‘మనబడి నాడు-నేడు’  అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల పాఠశాలల ముఖచిత్రమే మారిపోయింది. కనీస సౌకర్యాలైన మంచినీరు, టాయిలెట్లు, కాంపౌండ్ వాల్, డిజిటల్ బోర్డులు, ఇంటర్నెట్ సౌకర్యం, కుర్చీలు, బల్లలు ఏర్పడ్డాయి. దాంతో ప్రభుత్వ స్కూళ్ళే కార్పొరేట్ స్కూళ్ళకు మించి కనబడుతున్నాయి. ఇదే సమయంలో అమ్మఒడి పథకంలో స్కూలుకు వెళ్ళే పిల్లల తల్లులకు జగన్ డబ్బులు వేస్తున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్ళల్లోని పిల్లలందరు ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చేస్తున్నారు. పోయిన విద్యాసంవత్సరంలో ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్ధులు సుమారు 3 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరిపోయారు.




వీటిన్నింటికీ అదనంగా తాజాగా 1-8వ తరగతులన్నింటినీ రాష్ట్ర సిలబస్ నుండి సీబీఎస్ఈకి మార్చేయాలని జగన్ నిర్ణయించారు. తాజా నిర్ణయం అన్నింటికన్నా పెద్దది. అసలే ముక్కి మూలుగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్ధలు సీబీఎస్ఈ సిలబస్ నిర్ణయంతో ఒక్కసారిగా కుదేలైపోవటం ఖాయం. జగన్ నిర్ణయాల ఫలితంగా ప్రైవేటు యాజమాన్యాలు అందులోను టీడీపీ మద్దతుదారులకు ఏమి చేయాలో దిక్కుతోచటం లేదు. ఇవేమీ కక్షసాధింపు క్రింద చేస్తున్న పనులు కావు కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నాయి. ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాలని ప్రభుత్వం అనుకుంటే కాదనేందుకు ఏముంది ?




జగన్ కి కుప్పం ప్రజల కృతజ్ఞతలు..

వైఎస్ షర్మిల పార్టీలోకి మాజీ మంత్రి....?

పుర పోరు : అక్కడ వైసీపీకి బీజేపీ బ్రేకులు...?

'ఉప్పెన' సినిమాకు వైష్ణవ్ తేజ్ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా..?

పుర పోరు : విశాఖ టీడీపీకి కొత్త చిక్కులు ?

టాలీవుడ్ లో గొప్ప నటుడు ఎవరో తెలుసా.. సంచలన నిజాలు బయటపెట్టిన పోల్ .

సాయి పల్లవి కొత్త పాట ?? ఫిదా వచ్చిందే అంత హిట్ అవుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>