HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/oopirithithulu-claning7055d44c-2761-4265-b5fe-6cb4b70877c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/oopirithithulu-claning7055d44c-2761-4265-b5fe-6cb4b70877c5-415x250-IndiaHerald.jpgఊపిరితిత్తులు మన శరీరంలో అతి ముఖ్యమైన పనిని వ్యవహరిస్తాయి. శ్వాస తీసుకోవడానికి ఊపిరితిత్తులు చాలా అవసరం. అంతే కాకుండా మనం పీల్చుకునే ఆక్సిజన్, అన్ని అవయవాలకు పంపించి, శరీరం నుంచి కార్బన్ డయాక్సైడ్ ను తొలగిస్తాయి. వాతావరణంలో పెరిగే కాలుష్యం కారణంగా ఆక్సిజన్ దొరికే అవకాశం చాలా కష్టంగా మారింది. కాబట్టి శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతినే అవకాశం కూడా చాలా ఎక్కువ. కాబట్టి ముందుగా మనం ఆక్సిజన్ ను ఏ విధంగా పొందాలి.. ముఖ్యంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..oopirithithulu,claning;thulasi;samosa;vitamin c;vitamin;tulasi;chicken;onion;beetroot;garlic;green tea;neem;oxygen;carbon dioxide;spinach;buttermilk;cinnamon;indian gooseberry;shaktiఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?oopirithithulu,claning;thulasi;samosa;vitamin c;vitamin;tulasi;chicken;onion;beetroot;garlic;green tea;neem;oxygen;carbon dioxide;spinach;buttermilk;cinnamon;indian gooseberry;shaktiFri, 26 Feb 2021 17:00:00 GMTఊపిరితిత్తులు మన శరీరంలో అతి ముఖ్యమైన పనిని వ్యవహరిస్తాయి. శ్వాస తీసుకోవడానికి ఊపిరితిత్తులు చాలా అవసరం. అంతే కాకుండా మనం పీల్చుకునే ఆక్సిజన్, అన్ని అవయవాలకు పంపించి, శరీరం నుంచి కార్బన్ డయాక్సైడ్ ను తొలగిస్తాయి. వాతావరణంలో పెరిగే కాలుష్యం కారణంగా ఆక్సిజన్ దొరికే అవకాశం చాలా కష్టంగా మారింది. కాబట్టి శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతినే అవకాశం కూడా చాలా ఎక్కువ. కాబట్టి ముందుగా మనం ఆక్సిజన్ ను ఏ విధంగా పొందాలి.. ముఖ్యంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..? అనే అంశాల గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం...


ఎక్కువగా పచ్చని వాతావరణంలో గడపడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. వీలైనంత వరకు ఇంటి చుట్టూ ఆవరణంలో చెట్లను,మొక్కలను పెంచుకోవడానికి పూనుకోవాలి. అప్పుడే మనకు తగినంత ఆక్సిజన్ అంది, ఆరోగ్యంగా ఉంటాము. ఇక ఊపిరితిత్తుల ఆరోగ్య విషయానికి వస్తే ప్రతిరోజు తక్కువ మొత్తంలో, ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం పై దృష్టి పెట్టాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే గుడ్లు, చేపలు, లీన్ మటన్,పాలు, పెరుగు, మజ్జిగ,పన్నీరు,సోయాబీన్స్, రాగి జావా, పప్పు ధాన్యాలు మొదలైనవి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

అలాగే ఉసిరి,జామ, నారింజ, స్ట్రాబెరీ, కివి, విటమిన్ సి కలిగిన పండ్లను తీసుకుంటూ ఉండాలి. పసుపు, నారింజ పండ్లు, కూరగాయలలో కెరటోనాయిడ్స్ పుష్కలంగా ఉండి, అవి యాంటీ యాక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో వ్యతిరేకంగా పోరాడతాయి. అలాగే పాలకూర, మెంతికూర, బీట్రూట్, టొమాటోలు, క్యారెట్,ఉల్లిపాయ, బ్రోకలీ,మిరియాలు వంటివి  తీసుకుంటూ ఉండాలి. అలాగే దాల్చిన చెక్క, అల్లం,వెల్లుల్లి,పసుపు,తులసి,ఏలకులు, గ్రీన్ టీ, పుదీనా ఆకులను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి.  వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.


తక్కువ నూనెను వంటలలో వాడుతూ ఉండాలి. అంతే కాకుండా రోజుకు ఎక్కువ నీరు తాగుతూ ఉండాలి. ఇక వేపుళ్ళు అసలుకే తినకూడదు. అలాగే వడా, కట్లెట్, సమోసా, చికెన్ ఫ్రైడ్ రైస్,  చికెన్ ఫ్రై లు మొదలైన వేయించిన వస్తువులను దూరంగా ఉండాలి. సిగరెట్లు, మద్యం వాటికి దూరంగా ఉండాలి.




ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>