PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrab711fe5-8412-4985-b360-98fb3ba2383b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrab711fe5-8412-4985-b360-98fb3ba2383b-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షాలు కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. రాజకీయంగా ఈ అంశాలు అన్నీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. సిఎం కేసీఆర్ టార్గెట్ గా నిరుద్యోగ సమస్యను ఈ ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నారు. రాజకీయంగా ఈ అంశంపై సిఎం కూడా కాస్త సీరియస్ గానే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే కేటీఆర్ ఉద్యోగాల కల్పన పై చర్చకు విసిరిన సవాల్ ను స్వీకరించిన దాసోజు శ్రావణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. గన్ పార్క్ దగ్గరకు రావాలని కోరిన ఆయన... కేటీఆర్ వస్తాడని ఆశిkcr;kcr;ktr;kiran kumar;kumaar;kiran;sravan;telangana;congress;assembly;tdpకేసీఆర్ కంటే టీడీపీ బెస్ట్... కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలుకేసీఆర్ కంటే టీడీపీ బెస్ట్... కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలుkcr;kcr;ktr;kiran kumar;kumaar;kiran;sravan;telangana;congress;assembly;tdpFri, 26 Feb 2021 14:00:00 GMTకేసీఆర్ టార్గెట్ గా నిరుద్యోగ సమస్యను ఈ ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నారు. రాజకీయంగా ఈ అంశంపై సిఎం కూడా కాస్త సీరియస్ గానే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే కేటీఆర్ ఉద్యోగాల కల్పన పై చర్చకు విసిరిన సవాల్ ను స్వీకరించిన దాసోజు శ్రావణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. గన్ పార్క్ దగ్గరకు రావాలని కోరిన ఆయన... కేటీఆర్ వస్తాడని ఆశించినం అన్నారు.

కానీ కేటీఆర్ చర్చకు రాకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తెలంగాణ వచ్చేనాటికి లక్షా7వేల ఖాళీలు ఉన్నాయి అని, అసెంబ్లీ లో స్వయంగా కేసీఆర్ చెప్పారు అని గుర్తు చేసారు. మీరు చేసిన ఉద్యోగాల భర్తీ నిజమైతే 2021నాటికి లక్షా 91వేలకు ఉద్యోగాల సంఖ్య ఎట్లా పెరిగింది అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగుల పరిస్థితి బానిసలుగా మారిపోయింది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. నిరంతర ప్రక్రియ అంటూ టిఆర్ఎస్ నేతలు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.

47శాతం ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీ ఉన్నాయి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో 10వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసారనడానికి సిగ్గుండాలి అని మండిపడ్డారు. కిరణ్ కుమార్ సీఎం గా ఉండగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేశాము అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ హయాంలో కూడా వరుసగా డిఎస్సి లు వేశారు అని ఆయన పేర్కొన్నారు. అప్పటి ఐఏఎస్ లను పిలుచుకుని మాట్లాడండి అని ఆయన సూచించారు. అమరవీరుల కుటుంబాలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని నిలదీశారు. టిఆర్ఎస్ వచ్చాక ఒక్క గ్రూప్ వన్, గ్రూపు టూ ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు అని మండిపడ్డారు.


పుర పోరు : విశాఖ ఎన్నికల్లో పార్టీలకు అక్కడ షాక్...?

కృష్ణ తులసి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య గురించి ఆసక్తికర విషయాలు

చెక్ సినిమా ఎలా ఉందంటే...???

ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫెయిల్యూర్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ ?

కపటదారి సినిమా ఫ్లాప్ అవ్వడానికి సుమంత్ కారణమా..?

విశాఖ టీడీపీ నేత‌కు కీల‌క ప‌ద‌వి...

కొత్త కోవిడ్ (స్టైయిన్) 7 ల‌క్ష‌ణాలు ఇవే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>