KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/lips-of-children6e947478-e3ce-4315-9307-ccb81f5e80c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/lips-of-children6e947478-e3ce-4315-9307-ccb81f5e80c7-415x250-IndiaHerald.jpgక్యూట్‌గా ఉండి.. చబ్బి ఛీక్స్‌తో ఎంతో ముద్దుగా ఉంటే చిన్న పిల్లలను చూసి ముద్దు పెట్టుకోని వారుండరనే చెప్పుకోవచ్చు. వాళ్ల స్మైల్.. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే వాళ్లను చూస్తేనే సగం ప్రేమలో పడిపోతాం. ఎంత క్యూట్‌గా ఉన్నాడు బుడ్డొడు అంటూ.. ఆగలేక ముద్దులు కూడా పెట్టేసే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సాధారణంగా చిన్న పిల్లలు ఎంతో ముద్దుగా అనిపిస్తారు.lips of children;manuబుడుగు: చిన్నపిల్లల పెదాలపై కిస్ పెట్టకండి..!?బుడుగు: చిన్నపిల్లల పెదాలపై కిస్ పెట్టకండి..!?lips of children;manuFri, 26 Feb 2021 17:00:00 GMT
అయితే చిన్న పిల్లలకు తెలియని వయసు కాబట్టి ముద్దులు పెట్టినప్పుడు వద్దని చెప్పలేరు. తల్లిదండ్రులు కూడా కాదనలేరు. పిల్లలకు ముద్దులు పెట్టే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పెదాలపై ముద్దు పెట్టడం మానేయాలి. బంధువులు ఎత్తుకున్న పెదాలపై ముద్దులు పెట్టొద్దని ఖరాఖండిగా చెప్పేయాలి. పెదాలపై ముద్దులు పెట్టడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో పెదవులు, నోటి విషయంలో కొన్ని బౌండరీస్ పాటించాలంటున్నారు సైకాలజిస్ట్ ఛార్లెస్ రెజ్నిక్. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమతో పెదవులపై ముద్దు పెడుతుంటారు. ఇది సరైనది కాదని.. దీనివలనే ఇతరులు తమ పెదవులపై ముద్దు పెట్టినప్పుడు పిల్లలు రెఫ్యూజ్ చేయరు. అమ్మానాన్న పెడతారు కదా, కాబట్టి అది సరైనదేనేమో అనేది పిల్లలు భావిస్తారంట.

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది పిల్లలకు చిన్నప్పటి నుండే నేర్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే అందరూ మంచి ఉద్దేశంతోనే ముద్దు పెడతారని చెప్పలేమని ఆయన అంటున్నారు. ఎవరైనా పెదవులపై ముద్దు పెట్టబోతే వద్దని చెప్పడం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలని రెజ్నిక్ తెలిపారు. మనుషుల ఉద్దేశాలు ఏవైనప్పటికి రోజుకో కొత్త రోగం పుట్టుకొస్తున్న ఈ కాలంలో పిల్లలను ముద్దులకు దూరంగా ఉంచడమే మంచిది. పిల్లల పెదవులపై, నోటిపై పుండ్లు ఏర్పడడానికి, రకరకాల ఇన్పెక్షన్లు, అలెర్జీలు రావడానికి ఈ ముద్దులే ప్రధాన కారణమని వైద్యుల ఆరోపణ. కాబట్టి పిల్లల ఆరోగ్యరీత్యా, మానసికంగా వారిని బలపర్చడానికి ఉపయోగపడే ఈ సూచనని తప్పక పాటించాలని ఆయన కోరుతున్నారు.


తిరుపతి వెళ్ళే వారికి బాడ్ న్యూస్... పాపం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>