Crimeyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/ambani4a21c29e-e7cc-48a4-b965-4b4fe259875a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/ambani4a21c29e-e7cc-48a4-b965-4b4fe259875a-415x250-IndiaHerald.jpgప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖ రాశాడు. ఆ లేఖ పోలీసులకు చిక్కడంతో ప్రస్తుతం సంచలనంగా మారింది. నిన్న ఆంటిలియా దగ్గర పేలుడు పదార్థాలు దొరికిన కారులోనే ఆగంతకుడు రాసిన లేఖ కూడా పోలీసులకు లభించింది. జిలెటిన్ స్టిక్కులున్న కారులో స్వాధీనం చేసుకున్న లేఖను ముంబై పోలీసులు..ambani;mukesh;mumbai;police;car;letterఇది ట్రైలర్ మాత్రమే...అంబానీకి బెదిరింపు లెటర్.. ముంబైలో హై అలర్ట్!ఇది ట్రైలర్ మాత్రమే...అంబానీకి బెదిరింపు లెటర్.. ముంబైలో హై అలర్ట్!ambani;mukesh;mumbai;police;car;letterFri, 26 Feb 2021 12:50:00 GMTముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖ రాశాడు. ఆ లేఖ పోలీసులకు చిక్కడంతో ప్రస్తుతం సంచలనంగా మారింది. నిన్న ఆంటిలియా దగ్గర పేలుడు పదార్థాలు దొరికిన కారులోనే ఆగంతకుడు రాసిన లేఖ కూడా పోలీసులకు లభించింది. జిలెటిన్ స్టిక్కులున్న కారులో స్వాధీనం చేసుకున్న లేఖను ముంబై పోలీసులు శుక్రవారం బయటపెట్టారు. ముఖేష్ అంబానీ కుటుంబాన్ని ఉద్ధేశించి ఆగంతకుడు ఈ లేఖ రాశాడు. ‘పేలుడు పదార్థాలున్న కారును మీ ఇంటి సమీపంలో వదిలివేయడం ట్రైలర్ మాత్రమే... ఇంకా ముందు ముందు చాలా ఉంది’ అంటూ ఆగంతకుడు రాసిన లేఖలో పేర్కొన్నాడు.

ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, కుటుంబానీ అదృష్టవంతులనీ, ఇప్పడుకు పక్కన వదిలి వెళ్లిపోతున్నానని, ఈ సారి మాత్రం నేరుగా పేలుడు పదార్థాలు మీ వద్దకే వస్తాయం’టూ ఆగంతకుడు కారులో వదిలిన లేఖలో పేర్కొన్నాడు. పేలుడు సామగ్రితో పాటు వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారికి కారులో కొన్ని నంబరు ప్లేట్లు దొరికాయి. వాటిలో కొన్ని ముఖేశ్‌ అంబానీ భద్రతా బృందంలో ఉపయోగించే వాహనాల నంబర్‌ ప్లేట్లతో మ్యాచ్‌ కావడంతో పోలీసులు కూడా షాక్‌కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ నివాసమున్న ప్రాంతంలో అధికారులు భద్రత పటిష్ఠం చేశారు.

ఇదిలా ఉంటే ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో గురువారం పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఆయన ఇంటికి సమీపంలో ఆపి ఉన్న ఓ కారులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ముందుగా కనిపెట్టి పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన బాంబ్ స్క్వాడ్‌తో సహా అక్కడకు చేరుకున్న పోలీసులు బాంబులు ఏవీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ వాహనం ఎవరిదనే విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆ వాహనం వద్ద దొరికిన నంబరు ప్లేట్లు పోలీసులకు షాక్ ఇచ్చాయి. అంబానీ సెక్యూరిటీకి సంబంధించిన నంబరు ప్లేట్లే అక్కడ దొరకడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.


అలెర్ట్ అయిన కేంద్రం... ఆరోగ్య శాఖా మంత్రులతో అత్యవసర సమావేశం

పురపోరు: చంద్రబాబు ఆశ వదిలేసుకున్నారా..?

పుర పోరు : ప్రజాశాంతి పార్టీ కన్నా అధ్వాన్నంగా టీడీపీ ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క నాగార్జునకు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది

ష‌ర్మిల తెలంగాణ పొలిటిక‌ల్ ఎంట్రీతో కేసీఆర్‌కే లాభం...ఆస‌క్తిక‌ర అంశం తెర‌పైకి..

పుర పోరు: టీడీపీ మేయ‌ర్‌గా క‌మ్మ నేత ఖ‌రారైన‌ట్టే ?

టీచర్ల కష్టాలు: ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు.. కష్టాల నెలవులు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>