PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/smruthi-simhab38357a4-481f-46e7-953b-4ea1b5b8640c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/smruthi-simhab38357a4-481f-46e7-953b-4ea1b5b8640c-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన నకిలీ ఐపీఎస్ అధికారి స్మృతి సింహ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. వీరారెడ్డి అనే వ్యాపారిని మాయమాటలు చెప్పి మోసం చేసి రూ. 11.50 కోట్లు తీసుకున్న వీరిద్దరూ ఆ డబ్బుతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపారని తేల్చారుsmruthi simha;kumaar;mithra;simhaa;vijay;hyderabad;police;sucide;car;arrest;joseph vijay;reddy;simhaనకిలీ ఐపీఎస్ కేసులో సంచలనాలు!నకిలీ ఐపీఎస్ కేసులో సంచలనాలు!smruthi simha;kumaar;mithra;simhaa;vijay;hyderabad;police;sucide;car;arrest;joseph vijay;reddy;simhaFri, 26 Feb 2021 09:18:51 GMTహైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన నకిలీ ఐపీఎస్ అధికారి స్మృతి సింహ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. వీరారెడ్డి అనే వ్యాపారిని మాయమాటలు చెప్పి మోసం చేసి రూ. 11.50 కోట్లు తీసుకున్న వీరిద్దరూ ఆ డబ్బుతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపారని తేల్చారు.

తాము సంపాదించిన అక్రమ సంపాదనతో వీరు అనుభవించిన లగ్జరీ లైఫ్ వివరాలను కూడా పోలీసు వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లోని స్టార్ హోటల్ లో  రోజుకు అద్దె రూ. 50 వేలయితే, మరో రూ. 50 వేలు ఖర్చు... మొత్తం మీద 40 రోజులు బస చేశారు.  విజయ్ కుమార్ రెడ్డి, స్మృతి సింహ అలియాస్ శిరీష, రూ. 40 లక్షలు బిల్లు చేశారు. తాను మోసం చేసి తెచ్చిన డబ్బుతో బంధు మిత్రులకు డబ్బులు, చిన్న చిన్న కానుకలు ఇవ్వడంతో పాటు రూ. 1.8 కోట్లతో బీఎండబ్లూ కారు, ఆపై రూ. 1.70 కోట్లతో ఇంకో కారు, రూ. 70 లక్షలతో మరో కారును కొన్నాడు విజయ్. ప్రియురాలి పుట్టిన రోజు వస్తే రూ. 50 లక్షల కానుకలు ఇచ్చాడు.విశాఖపట్నానికి వెళ్లి ఎనిమిది రోజులు మరో లగ్జరీ హోటల్ లో అంతే లగ్జరీగా గడిపి వచ్చాడు. ఓ విల్లాను కొనేందుకు రూ. 70 లక్షలు చెల్లించాడు.

స్మృతి సింహా అసలు స్వరూపం బయటకు వచ్చింది. విజయ్ తో చాలా తెలివిగా డ్రామాలాడించిన ఆమె పూర్తిగా ఇరికించడంతో, ఏం చేయాలో తెలియని విజయ్ సూసైడ్ మెసేజ్ పెట్టి చనిపోయాడు. శిరీష తనను మోసం చేసిందని, తనను క్షమించాలని చెబుతూ వాయిస్ రికార్డును వీరారెడ్డికి పంపి, ఈనెల 5న విజయ్ సూసైడ్ కు పాల్పడగా, ఈ కేసులో ఇంతవరకూ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నిజాలను చూసి విస్తుపోతున్నారు.ఈ కేసులో స్మృతి సింహ అత్యంత కీలకమని, విజయ్ తో కలసి ఆమె తిరిగిందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇద్దరూ కలసే అన్ని మోసాలూ చేశారని, వారికి కుటుంబీకులు కూడా సహకరించారని తేల్చాయి.




చైనా సంచలన ప్రకటన వెనుక.. అసలు నిజం ఇదే..?

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌... ఆ నేతే టార్గెట్టా ?

పుర పోరు : వైసీపీ ని గెలిపిస్తాను అంటున్న టీడీపీ ఎమ్మెల్యే...?

“కలలోకొచ్చి కలవరపెట్టటం కాదే! ఇంటికిరా! ఒకసారి!” అంటూ ఆమెకు టీఆరెస్ నేత వేధింపులు వెకిలిచేష్టలు

పుర పోరు: అక్క‌డ టీడీపీ నేతల పంతాలే పార్టీని ఓడిస్తాయా ?

హెరాల్డ్ సెటైర్: పార్టీ పరిస్దితి కూడా ఇలాగే ఉందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్వ‌చ్ఛ‌మైన పాలిటిక్స్‌కు కేరాఫ్ అయినా.... ఈ త‌ప్పు ఎవ‌రిది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>