PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr188d6e03-285f-4c15-827a-fc6ef9a3883b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr188d6e03-285f-4c15-827a-fc6ef9a3883b-415x250-IndiaHerald.jpgతెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేశాయి. అయితే రెండు చోట్లా టీఆర్ఎస్‌కు ఎదురుగాలే వీస్తుంది. అందులోనూ తెలంగాణ సర్కారు నిరుద్యోగుల పట్ల సానుకూలంగా లేదన్న వాదన బాగా ఉంది. తెలంగాణ వచ్చాక ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్‌ కూడా వేయకపోవడం.. పెద్దగా జాబ్‌ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం ఇందుకు కారణం. కానీ.. మంత్రి కేటీఆర్ మాత్రం మేం చాలా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అంతే కాదు.. తన వాదన బలపరుచుకునేందుకు ఆయన లెక్కలు చెబుతున్నారు. కేటీఆర్ వివిధ విభాగాల్లో శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల లెక్ktr;kcr;ktr;telangana;minister;letterపాపం.. కేటీఆర్‌..ఎంత గొంతు చించుకున్నా.. ఎవరూ నమ్మడం లేదా..?పాపం.. కేటీఆర్‌..ఎంత గొంతు చించుకున్నా.. ఎవరూ నమ్మడం లేదా..?ktr;kcr;ktr;telangana;minister;letterFri, 26 Feb 2021 06:00:00 GMTతెలంగాణ సర్కారు నిరుద్యోగుల పట్ల సానుకూలంగా లేదన్న వాదన బాగా ఉంది. తెలంగాణ వచ్చాక ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్‌ కూడా వేయకపోవడం.. పెద్దగా జాబ్‌ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం ఇందుకు కారణం. కానీ.. మంత్రి కేటీఆర్ మాత్రం మేం చాలా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు.  


అంతే కాదు.. తన వాదన బలపరుచుకునేందుకు ఆయన లెక్కలు చెబుతున్నారు. కేటీఆర్ వివిధ విభాగాల్లో శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల లెక్కను వివరిస్తూ రాష్ట్ర ప్రజానీకానికి బహిరంగ లేఖ రాశారు. టీఆర్‌ఎస్  అధికారం చేప్టటిన 2014 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో 1,32,899 ఖాళీలను భర్తీ చేసిందని చెబుతున్నారు. వాటి జాబితాను శాఖల వారీగా మరోసారి వెల్లడిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.


అంతే కాదు.. ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తూనే.. గత ఆరేళ్లలో టీఎస్ ఐపాస్ విధానం ద్వారా ప్రైవేటు రంగంలో సుమారు 14 లక్షల ఉద్యోగాలను తెలంగాణ యువతకు కల్పించారట. ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియ అని.. ఆ మేరకు త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరగనున్న ఎన్నికలు ముగియగానే భర్తీ చేపడతామన్నారు కేటీఆర్.


వాస్తవాలు ఇలా ఉంటే.. నిజాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అసత్యాలతో తెలంగాణ యువతను అయోమయానికి, గందరగోళానికి గురిచేస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. కొన్ని పార్టీలు, నాయకులు పనిగట్టుకుని చేసే అసత్య ప్రచారాల ప్రభావానికి యువత లోనుకాకుండా ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో గత ప్రభుత్వాల కంటే ఎక్కువ నిబద్ధత, చిత్తుశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలు పూర్తి అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. 


ఈరోజుకు అందుకే అంత ప్ర‌త్యేక‌త‌... విశేషాలు తెలిస్తే షాక‌వుతారు..

జగన్ కి కుప్పం ప్రజల కృతజ్ఞతలు..

వైఎస్ షర్మిల పార్టీలోకి మాజీ మంత్రి....?

పుర పోరు : అక్కడ వైసీపీకి బీజేపీ బ్రేకులు...?

'ఉప్పెన' సినిమాకు వైష్ణవ్ తేజ్ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా..?

పుర పోరు : విశాఖ టీడీపీకి కొత్త చిక్కులు ?

టాలీవుడ్ లో గొప్ప నటుడు ఎవరో తెలుసా.. సంచలన నిజాలు బయటపెట్టిన పోల్ .




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>