PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpg నియోజ‌క‌వ‌ర్గంలోని పడమటి పాలెం - టెక్కిశెట్టి పాలెం - కేశవాసు పాలెం - కాట్రేని పాడు - ఈటుకూరు - మేడిచర్ల పాలెం - బట్టెలంక - రామరాజు లంక - కత్తిమండ - పూనవరం - గోంగురమటం - తూర్పు పాలెం - సకినేటి పల్లి లంక లాంటి కీల‌క పంచాయ‌తీల్లో జ‌న‌సేన పాగా వేసింది. తాము గెలిపించిన రాపాక పార్టీ మారినా నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన కేడ‌ర్ చెక్కు చెద‌ర్లేద‌ని.. ఆ పార్టీ అభిమానులు క‌సితో ప‌నిచేసి మ‌రీ ఇక్క‌డ 20 పంచాయ‌తీల్లో గెలిచారు. వైసీపీ ఓటమే లక్ష్యంగా పనిచేసిన జనసైనికులు.. కొన్ని చోట్ల టీడీపీతో జతకట్ట మరీ తమ మద్ysrcp;rapaka vara prasada rao;2019;cinema;mla;letter;local language;ycp;rajolu;razole;partyఏపీలో ఆ ఎమ్మెల్యే దుకాణం బంద్‌.... మ‌ళ్లీ గెల‌వ‌డా ?ఏపీలో ఆ ఎమ్మెల్యే దుకాణం బంద్‌.... మ‌ళ్లీ గెల‌వ‌డా ?ysrcp;rapaka vara prasada rao;2019;cinema;mla;letter;local language;ycp;rajolu;razole;partyFri, 26 Feb 2021 08:03:00 GMTఏపీలో 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన న‌మోదు చేసిన ఒకే ఒక సంచ‌ల‌నం రాజోలులో.. ! పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయినా జ‌న‌సేన మాత్రం రాజోలులో గెలిచింది. అక్క‌డ పోటీ చేసిన రాపాక వ‌ర‌ప్ర‌సాద రావు విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కే ఆయ‌న వైసీపీకి ద‌గ్గ‌ర‌య్యారు. త‌న కుమారుడిని వైసీపీలో చేర్పించేశారు. ఇప్పుడు రాజోలులో అన‌ధికారికంగా ఆయ‌నే వైసీపీ ఎమ్మెల్యే. అయితే ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు.

తాజా పంచాయ‌తీ ఎన్నికల్లో కాపుల‌తో పాటు ప‌వ‌న్ ఫ్యాన్స్ అదిరిపోయే రివేంజ్ తీర్చుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో 60 పంచాయ‌తీల‌కు గాను ఏకంగా 20 చోట్ల జ‌న‌సేన స‌ర్పంచ్‌లు గెలిచి త‌మ స‌త్తా చాటారు. నియోజ‌క‌వ‌ర్గంలోని పడమటి పాలెం - టెక్కిశెట్టి పాలెం - కేశవాసు పాలెం - కాట్రేని పాడు - ఈటుకూరు -  మేడిచర్ల పాలెం - బట్టెలంక - రామరాజు లంక - కత్తిమండ - పూనవరం -  గోంగురమటం - తూర్పు పాలెం - సకినేటి పల్లి లంక లాంటి కీల‌క పంచాయ‌తీల్లో జ‌న‌సేన పాగా వేసింది.

తాము గెలిపించిన రాపాక పార్టీ మారినా నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన కేడ‌ర్ చెక్కు చెద‌ర్లేద‌ని.. ఆ పార్టీ అభిమానులు క‌సితో ప‌నిచేసి మ‌రీ ఇక్క‌డ 20 పంచాయ‌తీల్లో గెలిచారు. వైసీపీ ఓటమే లక్ష్యంగా పనిచేసిన జనసైనికులు.. కొన్ని చోట్ల టీడీపీతో జతకట్ట మరీ తమ మద్దతుదారులను గెలిపించారు. మరి కొన్ని చోట్ల టీడీపీకి మద్దతు ఇచ్చారు. మొత్తానికి రాపాక వరప్రసాద్ ను కోలుకోలేని దెబ్బ‌కొట్టారు.

రాపాక‌కు తాము ఇప్పుడు చూపించిన సినిమా త‌క్కువే అని... వచ్చే ఎన్నికల్లో సైతం ఇలాగే కలిసికట్టుగా పనిచేసి రాపాకను ఓడిస్తామని శపథం చేస్తున్నారు. దీంతో రాపాక దుకాణం ఇక మూసినట్లేనా అన్న చ‌ర్చ‌లు స్థానికంగా వినిపిస్తున్నాయి. 


కేశినేనికి చంద్రబాబు భయపడ్డారా!

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌... ఆ నేతే టార్గెట్టా ?

పుర పోరు : వైసీపీ ని గెలిపిస్తాను అంటున్న టీడీపీ ఎమ్మెల్యే...?

“కలలోకొచ్చి కలవరపెట్టటం కాదే! ఇంటికిరా! ఒకసారి!” అంటూ ఆమెకు టీఆరెస్ నేత వేధింపులు వెకిలిచేష్టలు

పుర పోరు: అక్క‌డ టీడీపీ నేతల పంతాలే పార్టీని ఓడిస్తాయా ?

హెరాల్డ్ సెటైర్: పార్టీ పరిస్దితి కూడా ఇలాగే ఉందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్వ‌చ్ఛ‌మైన పాలిటిక్స్‌కు కేరాఫ్ అయినా.... ఈ త‌ప్పు ఎవ‌రిది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>