PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/private-teachers44354b01-c477-41a8-a63d-5f7aa05813b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/private-teachers44354b01-c477-41a8-a63d-5f7aa05813b6-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ స్కూళ్ల సంగతి పక్కకు పెడితే.. బడ్జెట్‌ స్కూళ్లే ఎక్కువ. అంటే ఇవి చిన్న స్థాయి స్కూళ్లన్నమాట. వీటిలో ఉపాధ్యాయుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కిరాయి ఇండ్లలో ఉంటున్నవారు, ఉద్యోగాలను నమ్ముకుని బైక్‌, టీవీ వంటివి కొనుక్కున్నవారు తీవ్రంగా ఇబ్బందులు పడ్తున్నారు. రెంటు కట్టలేక, ఈఎంఐలు చెల్లించలేక నానా అవస్థ పడుతున్నారు. ‘భారత్ దేఖో’ అనే యూత్ ఆర్గనైజేషన్ ఇటీవల ‘బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ల’లో పనిచేస్తున్న టీచర్ల పరిస్థితులపై చేసిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ‘భారత్ దేఖోprivate-teachers;hyderabad;india;school;january;television;november;survey;corporate;zeroటీచర్ల కష్టాలు: ప్రైవేటీ టీచర్ల దీన పరిస్థితి.. ఈ నివేదిక నిండా కష్టాలు, కన్నీళ్లే..!టీచర్ల కష్టాలు: ప్రైవేటీ టీచర్ల దీన పరిస్థితి.. ఈ నివేదిక నిండా కష్టాలు, కన్నీళ్లే..!private-teachers;hyderabad;india;school;january;television;november;survey;corporate;zeroWed, 24 Feb 2021 09:00:00 GMTకార్పొరేట్ స్కూళ్ల సంగతి పక్కకు పెడితే.. బడ్జెట్‌ స్కూళ్లే ఎక్కువ. అంటే ఇవి చిన్న స్థాయి స్కూళ్లన్నమాట. వీటిలో ఉపాధ్యాయుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కిరాయి ఇండ్లలో ఉంటున్నవారు, ఉద్యోగాలను నమ్ముకుని బైక్‌, టీవీ వంటివి కొనుక్కున్నవారు తీవ్రంగా ఇబ్బందులు పడ్తున్నారు. రెంటు కట్టలేక, ఈఎంఐలు చెల్లించలేక నానా అవస్థ పడుతున్నారు.  ‘భారత్ దేఖో’ అనే యూత్ ఆర్గనైజేషన్ ఇటీవల ‘బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ల’లో పనిచేస్తున్న టీచర్ల పరిస్థితులపై చేసిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

‘భారత్ దేఖో’సంస్థ నవంబర్ నుంచి జనవరి వరకు సిటీలోని 30 బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ల టీచర్లతో ఆన్‌‌లైన్‌‌ సర్వే నిర్వహించింది.  ‘లాక్‌‌ డౌన్‌‌లో ప్రైవేటు టీచర్లు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ప్రస్తుతం వారి ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉంది, ఏం చేస్తున్నారు’అన్న అంశాలపై సర్వే చేపట్టింది. ఇందులో 220 మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు పాల్గొన్నారు. ఇందులో 78.6 శాతం మంది ఫిమేల్, 21.4 శాతం మేల్ టీచర్లున్నారు. సర్వేలో వారంతా తమ దుస్థితిని వివరించారు.

సర్వే నివేదిక ప్రకారం.. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నాలుగు వేలకుపైగా బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లు ఉనాయి.  అందులో 70 వేల మంది టీచర్లున్నారు. ఇప్పుడు వీరిలో 50 వేల మంది దాకా ఖాళీగా ఉండగా.. మరో 20 వేలమంది టీచర్లు నైన్త్, టెన్త్ క్లాసులకు పాఠాలు చెప్తున్నారు. స్కూళ్ల మేనేజ్మెంట్లు ఈ 20 వేల మందికి కూడా సగం జీతాలు, హవర్లీ బేస్డ్ జీతాలిస్తూ పని చేయించు కుంటున్నాయి. స్కూళ్లు రీఓపెన్ అయినా కూడా చాలా మేనేజ్మెంట్లు టీచర్లకు పూర్తి జీతాలు ఇవ్వడం లేదు.

దారుణం ఏంటంటే.. కొన్నిచోట్ల రోజంతా పని చేయించుకుని కూడా సగం జీతం మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం మొత్తం టీచర్లలో 10 శాతం మంది కూడా ఫుల్ శాలరీలు తీసుకోవడం లేదంటే వాళ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లాక్‌‌ డౌన్‌‌లో 85.7 శాతం మంది టీచర్లకు ఎలాంటి ఇన్‌‌ కమ్‌‌ లేదని.. పూర్తిగా జీరో ఇన్‌‌ కంతో జీవితాలు వెళ్లదీశారని సర్వే చెబుతోంది. కేవలం 14.3 శాతం మంది టీచర్లకు మాత్రమే కొంతవరకు ఇన్‌‌కం లభించిందని.. అది కూడా వారు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారని తేలింది. సర్వే రిపోర్టు ప్రకారం.. అన్‌‌లాక్‌‌ తర్వాత స్కూళ్లు తెరిచినా 62 శాతం మంది టీచర్లకు ఉద్యోగాలు లేని పరిస్థితి.




భార‌త్‌లో ఆ రెండు రాష్ట్రాల‌ను క‌మ్మేస్తోన్న క‌రోనా...

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో వైసీపీకి 50 డివిజ‌న్లు... టీడీపీ 0 - జ‌న‌సేన 0 ?

పుర పోరు: ఆ సిటీలో టీడీపీకి ఆ రెండు కులాల‌తో జ‌గ‌న్ మార్క్ చెక్ ?

పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో బాలయ్య ?

పవన్ విషయంలో దిల్ రాజ్ శంకర్ ల మధ్య తెగని చర్చలు ?

పుర పోరు: మాజీ మంత్రికి బిగ్ షాక్‌.. చంద్ర‌బాబు ఫోన్ చేసినా..!

హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>