PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jamili09d74804-5de2-4cad-96fc-5752298360d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jamili09d74804-5de2-4cad-96fc-5752298360d4-415x250-IndiaHerald.jpgఏపీలో ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా సాగుతున్న రాజకీయాల్లో ఇప్పటిదాకా జగన్ ది పైచేయిగా కనిపిస్తోంది. జగన్ 2019 నుంచి ఏకపక్ష విజయాలతో టీడీపీకి షాకుల మీద షాకులు ఇచ్చేస్తున్నారు. ఇక ఏపీలో మళ్ళీ సైకిల్ జోరు చేస్తుందా అన్న డౌట్లు తమ్ముళ్ళకు వచ్చేస్తున్నాయి. jamili;cbn;modi;delhi;bharatiya janata party;jagan;2019;january;cycle;tdp;central government;ycp;lie;joshఆ న్యూస్ తో జగన్ కి షాక్... బాబుకు ఫుల్ జోష్...?ఆ న్యూస్ తో జగన్ కి షాక్... బాబుకు ఫుల్ జోష్...?jamili;cbn;modi;delhi;bharatiya janata party;jagan;2019;january;cycle;tdp;central government;ycp;lie;joshWed, 24 Feb 2021 13:36:24 GMTజగన్ ది పైచేయిగా కనిపిస్తోంది. జగన్ 2019 నుంచి ఏకపక్ష విజయాలతో టీడీపీకి షాకుల మీద షాకులు ఇచ్చేస్తున్నారు. ఇక ఏపీలో మళ్ళీ సైకిల్ జోరు చేస్తుందా అన్న డౌట్లు తమ్ముళ్ళకు వచ్చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఏపీలో తమదే అధికారం, జగన్ అధికారంలో ఉండేది మూడేళ్ళు మాత్రమేనని చంద్రబాబు ఇప్పటిదాక పదే పదే చెబుతూ వస్తున్నారు. జమిలి ఎన్నికలు జరిగితీరుతాయని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. మరి జమిలి ఎన్నికలు అంటే మాటలా, పెద్ద తతంగమే ఉందని అంతా అనుకుంటున్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, అధినాయకుడు మోడీ తలచుకుంటే ఏదైనా జరిగిపోవాల్సిందే.

అందుకే జమిలి ఎన్నికలకు మంచి ముహూర్తమే కేంద్రం రెడీ చేసి పెట్టిందని టాక్ నడుస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే  ఏడాది జూలై తరువాత జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఢిల్లీ వార్తలు చెబుతున్నాయి. అంటే జగన్ కి అప్పటికి కచ్చితంగా మూడేళ్ళ అధికారం పూర్తి అవుతుంది. ఇంకా రెండేళ్ళ పాటు నిక్షేపంలా అధికారం ఉంటుంది. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ పూర్తిగా అయిదేళ్ళు ఉండకుండానే జమిలి ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు.

అదే సమయంలో అయిదేళ్ల పాటు వైసీపీ ఆగడాలు భరించడం ఏలా అని తల పట్టుకుంటున్న చంద్రబాబుకు మూడేళ్ళకే మోక్షం ప్రసాదించేలా కేంద్రం జమిలి నిర్ణయం తీసుకోబోతోంది అంటున్నారు. అంటే జమిలి ఎన్నికలు జరిగితే అదృష్టం బాగుంటే టీడీపీ మళ్ళీ పగ్గాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది అని బాబు గట్టి నమ్మకం మీద ఉన్నారట. జమిలి ఎన్నికలు అంటూ జరిగితే మాత్రం జగన్ కి అది గట్టి షాక్ అని చెప్పాల్సిందే.  ఇక కొత్త ప్రభుత్వాలు 2023 జనవరి 1న కొలువు తీరుతాయి అని అంటున్నారు. అలా ప్రతీ అయిదేళ్ళకు అదే డేట్ మీద జమిలి ఎన్నికలు జరిపేలా కేంద్రం కీలకమైన నిర్ణయం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది అంటున్నారు.




చెడు చూడకు..చెడు వినకు.. చెడు మాట్లాడకు అంటున్న రంగ్ దే..

పరగడుపునే ఇవి అసలు తినకండి.. ఎందుకో తెలుసా..?

పుర పోరు : అక్కడ టీడీపీకి ఓట్లేస్తే వైసీపీకేనట...?

సినిమా స్టార్ట్ అయిన అరగంటకు హీరో ఎంట్రీ ఇస్తే..?

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!

వైరల్ : రాయలసీమ బిడ్డ చెన్నై జట్టుకు ఎంపికయ్యాడు.. అతని చరిత్ర ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బ్రాహ్మ‌ణ ఘోష‌‌‌: రాజుల కోట‌లో పూజారి విజ‌యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>