EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagan-chandrababu-tdp-ycp-panchayat-electionsa6cc42ab-6b7b-4737-9e2d-6a426c962e0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagan-chandrababu-tdp-ycp-panchayat-electionsa6cc42ab-6b7b-4737-9e2d-6a426c962e0c-415x250-IndiaHerald.jpgమరీ మొదట్లో వైసీపీ నేతలు చెప్పుకున్నట్లుగా 90 శాతం పంచాయితీల్లో మద్దతుదారులు ఏకపక్షంగా గెలిస్తే ఎలక్షన్ కమీషన్ తరపున అభ్యంతరాలు వచ్చే అవకాశాలున్నట్లు ఆనుమానించారట. అందుకనే అక్కడక్కడ కొన్ని పంచాయితీలను వ్యూహాత్మకంగానే ప్రతిపక్షాలకు వదిలేసినట్లు వైసీపీలో ప్రచారం మొదలైంది. లేకపోతే చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు చీకట్లో కౌంటింగ్ జరిపించటం, ఓడిపోయిన వైసీపీ వాళ్ళని రీ కౌంటింగ్ పేరుతో గెలిచినట్లు ప్రకటింప చేసుకోవటమే నిజమైతే ఇదే పద్దతి అన్నీ పంచాయితీల్లోను జరగాలి కదా. కుప్పంలో 89 పంచాయితీలకు గాను 74 పంచాయితjagan chandrababu tdp ycp panchayat elections;view;cbn;kumaar;telugu desam party;telugu;kuppam;tdp;ycp;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ కోసం వైసీపీ ఇంతపని చేసిందా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ కోసం వైసీపీ ఇంతపని చేసిందా ?jagan chandrababu tdp ycp panchayat elections;view;cbn;kumaar;telugu desam party;telugu;kuppam;tdp;ycp;partyWed, 24 Feb 2021 03:00:00 GMTతాజాగా ముగిసిన నాలుగు రౌండ్ల పంచాయితి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మద్దతుదారులు సుమారు 2 వేల పంచాతీల్లో గెలిచారు. టీడీపీ మద్దతుదారులు గెలిచిన పంచాయితీలపై బిన్నాభిప్రాయాలున్నాయిలేండి. అయితే వైసీపీ చెప్పినట్లు 16 శాతం పంచాయితీలైనా లేకపోతే  చంద్రబాబునాయుడు చెప్పుకుంటున్నట్లుగా 38 శాతం పంచాయితీలైనా వ్యూహం ప్రకారం అధికారపార్టీనే వదిలేసినట్లు ప్రచారం మొదలైంది. ఇందుకు కారణం ఏమిటంటే 90 శాతంకు పైగా పంచాయితీలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకుంటే స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉందని వైసీపీ అగ్రనేతలు ఆలోచించారట. టీడీపీకి బలంలేక మద్దతుదారులతో పోటీ చేయించలేకపోయిందా ? లేకపోతే వైసీపీ నేతల ధాటికి టీడీపీ నేతలు దూరంగా ఉండిపోయారా అన్నది వేరే సంగతి.




మరీ మొదట్లో వైసీపీ నేతలు చెప్పుకున్నట్లుగా 90 శాతం పంచాయితీల్లో మద్దతుదారులు ఏకపక్షంగా గెలిస్తే ఎలక్షన్ కమీషన్ తరపున అభ్యంతరాలు వచ్చే అవకాశాలున్నట్లు ఆనుమానించారట. అందుకనే అక్కడక్కడ కొన్ని పంచాయితీలను వ్యూహాత్మకంగానే ప్రతిపక్షాలకు వదిలేసినట్లు వైసీపీలో ప్రచారం మొదలైంది. లేకపోతే చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు చీకట్లో కౌంటింగ్ జరిపించటం, ఓడిపోయిన వైసీపీ వాళ్ళని రీ కౌంటింగ్ పేరుతో గెలిచినట్లు ప్రకటింప చేసుకోవటమే నిజమైతే ఇదే పద్దతి అన్నీ పంచాయితీల్లోను జరగాలి కదా. కుప్పంలో 89 పంచాయితీలకు గాను 74 పంచాయితీలను గెలుచుకున్న వైసీపీ మద్దతుదారులకు చంద్రగిరిలోని చంద్రబాబు పుట్టి పెరిగిన పంచాయితి కందులవారిపల్లెలో గెలవటం పెద్ద కష్టమేమీకాదు.




అధికార దుర్వినియోగంతో పంచాయితీలను గెలుచుకోవాలని అనుకున్నపుడు మొత్తం 13 వేల పంచాయితీల్లోను అధికార దుర్వినియోగమే చేస్తుంది కదా వైసీపీ. కొన్నిచోట్ల ఫెయిర్ ఎలక్షన్, మరికొన్ని చోట్ల అధికార దుర్వినియోగం చేయదుకదా. కాబట్టి ముందు జాగ్రత్తగా వైసీపీ పెద్దల వ్యూహం ప్రకారమే అక్కడక్కడ కొన్ని పంచాయితీలను ప్రతిపక్షాలకు త్యాగం చేశారనే టాక్ మొదలైంది. దీని వల్ల ప్రతిపక్షాల సంగతి ఎలాగున్నా మామూలు జనాలు అధికార దుర్వినియోగం అనే అనుమానాలు వ్యక్తంచేసే అవకాశాలు తక్కువ. మొత్తానికి వ్యూహం ఏదైనా కానీండి చివరకు ఎన్నికలను బాగా జరిగాయని నిమ్మగడ్డ కూడా అంగీకరించటం గమనార్హం.




దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది

‘సర్కారు వారికి’ థమన్ లీకుల రాయుడిగా మారాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>