PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vsp-citye56c0162-041c-4803-93d5-be11b4cbb050-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vsp-citye56c0162-041c-4803-93d5-be11b4cbb050-415x250-IndiaHerald.jpgవిశాఖలో ఎన్నికలు అంటేనే ఒక రెఫరెండం గా తీసుకోవాలని టీడీపీ చెబుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిని చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఈ మేరకు జగన్ అసెంబ్లీలో రాజధాని పేరిట తీర్మానం చేశారు. అయితే అది న్యాయ వివాదంతో పడింది. కోర్టులో విచారణ దశలో కేసులు ఉన్నాయి. దాని మీద తీర్పు రావాల్సి ఉంది. vsp city;view;nani;amala akkineni;tiru;jagan;rbi;telugu;vishakapatnam;media;capital;court;perni nani;minister;tdp;ycpపుర పోరు : విశాఖకు రాజధాని షాక్...?పుర పోరు : విశాఖకు రాజధాని షాక్...?vsp city;view;nani;amala akkineni;tiru;jagan;rbi;telugu;vishakapatnam;media;capital;court;perni nani;minister;tdp;ycpWed, 24 Feb 2021 12:45:35 GMTటీడీపీ చెబుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిని చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఈ మేరకు జగన్ అసెంబ్లీలో రాజధాని పేరిట తీర్మానం చేశారు. అయితే అది న్యాయ వివాదంతో పడింది. కోర్టులో విచారణ దశలో కేసులు ఉన్నాయి. దాని మీద తీర్పు రావాల్సి ఉంది.

ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ రాజధాని విషయంలో జగన్ రివర్స్ మూడ్ లో ఉన్నారని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం మొదలెట్టేసింది. దానికి ప్రాతిపదిక ఏంటి అంటే అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మానానికి మూడు వేల కోట్ల రూపాయ నిధులను బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చి సేకరించాలని తాజాగా మంత్రివర్గం నిర్ణయించింది. దాంతో విశాఖ రాజధాని ఇక ఉండదు, జగన్ తన మనసు మార్చుకున్నారు అని టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ విధంగా చేయడం వెనక జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ గెలిచే వ్యూహం ఉందని అంటున్నారు. ఎందుకంటే విశాఖకు రాజధాని అంటే కొంత మొగ్గు వైసీపీకి ఉంటుంది. రాజధాని విశాఖ కాదు, జగన్ నిర్ణయం మారింది అంటే ఆ మేరకు కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

దాంతో ఈ రకమైన వ్యూహాన్ని టీడీపీ తన అనుకూల మీడియా ద్వారా అమలు చేస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది. దాంతో ఇది పెద్ద డ్యామేజ్ చేయబొతోంది అని గ్రహించిన వైసీపీ వెంటనేనష్ట  నివారణ చర్యలకు దిగిపోయింది. విశాఖ రాజధాని విషయంలో తాము చెప్పిన‌ మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్ని నాని తాజాగా ప్రకటించడం అందులో భాగమే అంటున్నారు. విశాఖ రాజధాని ఖాయమని ఇవాళ కాకపోతే రేపు అయినా విశాఖ నుంచే వైసీపీ పాలన మొదలుపెడుతుందని ఆయన పక్కా క్లారిటీగా చెప్పేసారు. మొత్తానికి చూస్తే విశాఖలో ఎన్నికలు కాదు కానీ రాజధాని అంశం చుట్టే అంతా తిరుగుతోంది అంటున్నారు.





మీ వాట్సాప్ ఖాతా తీసేయబోతున్నారు.. కాపాడుకోవాలంటే అదే దారి

పుర పోరు : అక్కడ టీడీపీకి ఓట్లేస్తే వైసీపీకేనట...?

సినిమా స్టార్ట్ అయిన అరగంటకు హీరో ఎంట్రీ ఇస్తే..?

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!

వైరల్ : రాయలసీమ బిడ్డ చెన్నై జట్టుకు ఎంపికయ్యాడు.. అతని చరిత్ర ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బ్రాహ్మ‌ణ ఘోష‌‌‌: రాజుల కోట‌లో పూజారి విజ‌యం..

ఆ ముగ్గురి దర్శకులతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>