MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetti9c25c04d-4b67-4650-89b0-28ac6f43d9b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetti9c25c04d-4b67-4650-89b0-28ac6f43d9b8-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కృతి శెట్టి ప్రస్తుతం నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే సుధీర్ బాబు తో కలిసి మరొక సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈమె సినిమా రంగంలోకి అడుగు పెట్టక ముందు మోడలింగ్ చేసేవారు.krithi shetti;hrithik roshan;kumaar;abinaya;anand malayalam actor;jeevitha rajaseskhar;ram pothineni;roshan;sethu;shyam;sudigali sudheer;vijay;vijay sethupathi;bollywood;tollywood;2019;cinema;telugu;history;husband;hero;heroine;joseph vijay;nijam;anand deverakondaఉప్పెన కంటే ముందుగానే హృతిక్ రోషన్ సినిమాలో నటించిన కృతి.. ఏ మూవీలోనో తెలుసా..ఉప్పెన కంటే ముందుగానే హృతిక్ రోషన్ సినిమాలో నటించిన కృతి.. ఏ మూవీలోనో తెలుసా..krithi shetti;hrithik roshan;kumaar;abinaya;anand malayalam actor;jeevitha rajaseskhar;ram pothineni;roshan;sethu;shyam;sudigali sudheer;vijay;vijay sethupathi;bollywood;tollywood;2019;cinema;telugu;history;husband;hero;heroine;joseph vijay;nijam;anand deverakondaWed, 24 Feb 2021 11:30:00 GMTఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కృతి శెట్టి ప్రస్తుతం నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే సుధీర్ బాబు తో కలిసి మరొక సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈమె సినిమా రంగంలోకి అడుగు పెట్టక ముందు మోడలింగ్ చేసేవారు. అనంతరం కొన్ని వాణిజ్య ప్రకటనలలో కనిపించారు. ఆ తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటించిన 'సూపర్ 30' సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేశారు.

2019 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ప్రముఖ మాథ్స్ టీచర్ ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆనంద్ కుమార్ కి విద్యార్థినిగా కృతి శెట్టి నటించారు. నిజానికి సినిమాలో చాలా మంది విద్యార్థులు గా నటించగా.. వారిలో ఒకరిగా కృతి శెట్టి కనిపించారు. ఆమె నటించినవి కీలక సన్నివేశాలు కాకపోయినా మూడు సార్లు ఆమె వెండితెరపై తళుక్కుమన్నారు. పదిహేనేళ్ల వయసులోనే బాలీవుడ్ సినిమాలో ఆమె ఎంపిక కావడం నిజంగా విశేషం అనే చెప్పాలి.

ఇకపోతే ఆమె తొలిసారిగా ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించినప్పటికీ నటనలో బాగా పరిణితి చూపించి ఆశ్చర్యపరిచారు. విజయ్ సేతుపతి కనిపించిన కీలక సన్నివేశాల్లో కూడా కృతి శెట్టి తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. 17 వయసులోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన కృతి తన రెమ్యూనరేషన్ బాగా పెంచేశారని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే ఆమెకున్న అందం అభినయంతో పాటు నటనా ప్రతిభకు అరకోటి రూపాయలు పారితోషికం గా ఇచ్చినా తక్కువే కాదని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అనేక సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే ప్రాధాన్యత కలిగిన పాత్రలలో నటించడానికే ఆమె ఆసక్తి కనబరుస్తున్నారు. హీరో రామ్, ఎన్.లింగుస్వామి కాంబోలో వస్తున్న సినిమా లో కృతి శెట్టి ని హీరోయిన్ గా అనుకున్నారని సమాచారం.


సినిమా స్టార్ట్ అయిన అరగంటకు హీరో ఎంట్రీ ఇస్తే..?

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!

వైరల్ : రాయలసీమ బిడ్డ చెన్నై జట్టుకు ఎంపికయ్యాడు.. అతని చరిత్ర ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బ్రాహ్మ‌ణ ఘోష‌‌‌: రాజుల కోట‌లో పూజారి విజ‌యం..

ఆ ముగ్గురి దర్శకులతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇవే..!?

ఎడిటోరియల్: మైనార్టీ ఫైర్ బ్రాండ్, ఫిరోజ్ ఖాన్ ఇక బీజేపీ లోకి - ఒవైసి సోదరులకు ఇక చుక్కలే!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు పొలిటిక‌ల్ న్యాయం జ‌ర‌గాలంటే ఇదే క‌రెక్ట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>