PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr26835b7b-d1d6-4a8d-aa6d-0fc9f4936119-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr26835b7b-d1d6-4a8d-aa6d-0fc9f4936119-415x250-IndiaHerald.jpgఏమాటకామాటే సోషల్ మీడియా అనేది చాలా కీలకపాత్ర పోషిస్తుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు రాజకీయాల్లో కొన్ని కొన్ని వ్యవహారాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి అంటే సోషల్ మీడియా పుణ్యమే అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దీనితో నాయకులందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. రాజకీయంగా ఎంతో బలంగా ఉన్న పార్టీ అయినా సరే సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా లేకపోతే అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రధానమంత్రి నుంచి ప్రతిపక్ష నేతలు వరకు అందరూ కూడా చాలావరకkcr;kcr;ktr;bhavana;prema;bharatiya janata party;hushaaru;media;prime minister;love;minister;partyసోషల్ మీడియా మీద కేసీఆర్ కు ప్రేమ పెరిగిపోయిందా...?సోషల్ మీడియా మీద కేసీఆర్ కు ప్రేమ పెరిగిపోయిందా...?kcr;kcr;ktr;bhavana;prema;bharatiya janata party;hushaaru;media;prime minister;love;minister;partyWed, 24 Feb 2021 11:00:00 GMTమీడియా అనేది చాలా కీలకపాత్ర పోషిస్తుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు రాజకీయాల్లో కొన్ని కొన్ని వ్యవహారాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి అంటే సోషల్ మీడియా పుణ్యమే అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దీనితో నాయకులందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. రాజకీయంగా ఎంతో బలంగా ఉన్న పార్టీ అయినా సరే సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా లేకపోతే అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

అందుకే ప్రధానమంత్రి నుంచి ప్రతిపక్ష నేతలు వరకు అందరూ కూడా చాలావరకు ఇప్పుడు సోషల్ మీడియా మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో చాలా మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నారు అనే భావన సీఎం కేసీఆర్ లో వ్యక్తమవుతుంది. సోషల్ మీడియా విషయంలో చాలామంది అసలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. బీజేపీ నేతలు సోషల్ మీడియాలో చాలా హుషారుగా ఉన్న సరే వారు సైలెంట్ గా ఉంటున్నారు అని ఆవేదన వ్యక్తమవుతోంది.

దీనిపై ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ఒక నిపుణుల బృందాన్ని టిఆర్ఎస్ పార్టీ సంప్రదించిందని త్వరలోనే సదరు నిపుణుల బృందంతో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. టిఆర్ఎస్ పార్టీలో చాలామంది నేతలు సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ఇదే ఉప ఎన్నికల్లో కూడా దెబ్బ కొట్టింది. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే దెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే సీఎం కేసీఆర్ ఇప్పుడు దీని మీద ప్రత్యేక దృష్టి సారించారని సమాచారం. మంత్రి కేటీఆర్ కూడా ఈ అంశానికి సంబంధించి చర్చలు జరిపారని సీఎం కేసీఆర్ సోషల్ మీడియాను ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన క్లాసుల నిర్వహణ కూడా ఉంటుందని టిఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.


అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!

బ్రాహ్మ‌ణ ఘోష‌‌‌: రాజుల కోట‌లో పూజారి విజ‌యం..

ఆ ముగ్గురి దర్శకులతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇవే..!?

ఎడిటోరియల్: మైనార్టీ ఫైర్ బ్రాండ్, ఫిరోజ్ ఖాన్ ఇక బీజేపీ లోకి - ఒవైసి సోదరులకు ఇక చుక్కలే!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు పొలిటిక‌ల్ న్యాయం జ‌ర‌గాలంటే ఇదే క‌రెక్ట్ ?

పుర పోరు: జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌లో ఆ యువ‌నేత గెలిస్తే... తిరుగులేని హీరోయే.. ?

పుర పోరు: దేవినేని ప‌రువు సొంతూళ్లోనే మ‌ళ్లీ గోవిందా... గోవిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>