MoviesSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-pushpa3be95818-3850-4b52-be02-7d0bbdbd5d9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-pushpa3be95818-3850-4b52-be02-7d0bbdbd5d9a-415x250-IndiaHerald.jpgక‌థ‌నాయకుడిగా తెర‌కెక్కుతున్న పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ త‌న‌ న‌ట విశ్వ‌రూపం చూప‌బోతున్నాడ‌ని చిత్ర‌వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో బ‌న్నీ అభిమానుల్లోనూ స‌హ‌జంగానే తార‌స్థాయి అంచ‌నాలు ఉన్నాయి.ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. సినిమా షూటింగ్‌ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్నpushpa;kumaar;allu arjun;devi sri prasad;geetha;prasad;sukumar;cinema;sangeetha;blockbuster hit;tamilnadu;makeup;arjun 1;ala vaikuntapuramloమాస్‌కే మాస్‌లా ఉన్న బ‌న్నీ....పుష్ప‌లో న‌ట విశ్వ‌రూపమే..మాస్‌కే మాస్‌లా ఉన్న బ‌న్నీ....పుష్ప‌లో న‌ట విశ్వ‌రూపమే..pushpa;kumaar;allu arjun;devi sri prasad;geetha;prasad;sukumar;cinema;sangeetha;blockbuster hit;tamilnadu;makeup;arjun 1;ala vaikuntapuramloWed, 24 Feb 2021 08:57:45 GMTసుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో బ‌న్నీ అభిమానుల్లోనూ స‌హ‌జంగానే తార‌స్థాయి అంచ‌నాలు ఉన్నాయి.ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు  ప్రకటించారు. సినిమా షూటింగ్‌ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు.
 

మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘పుష్ప’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలోని లారీ క్లీన‌ర్ గెట‌ప్ మేక‌ప్‌కోసం అల్లు అర్జున్ చాలా క‌ష్టాలే ప‌డుతున్నారు. లారీ క్లీన‌ర్ పుష్ప‌పాత్ర‌లో క‌నిపించేందుకు...న‌ల్ల‌గా మారాల్సి ఉంటుంది. మాస్‌కే మాస్‌లా క‌నిపించ‌బోతున్నారు. అయితే ఈ పాత్ర‌కోసం షూటింగ్‌లో ప్ర‌తీ రోజు దాదాపు రెండు గంట‌ల స‌మ‌యం మేకప్ కోసం కూర్చోవ‌ల్సి వ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం.


కనుబొమ్మలు, జుట్టు, మీసాలు, చర్మం రంగు.. ఇలా పత్రిదానికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మేకప్‌ చేస్తున్నారు. అలాగే సినిమాలో చాలావరకూ అల్లు అర్జున్‌ లుంగీ, షార్ట్స్‌లోనే కనబడతారు. ఈ మేకప్‌ను తొలగించాలంటే మరో గంటన్నర పడుతోందట. లుక్‌ కోసమే ఎక్కువ సమయం పడుతుండడంతో బన్నీ ప్రతిరోజూ షూట్‌కు కొంచెం ముందుగానే వచ్చేస్తున్నారని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.  ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ తమిళనాడులోని తెన్‌కాశీలో జరుగుతోంది. యాక్షన్‌ సీక్వెన్స్, పాట చిత్రీకరిస్తున్నారు చిత్రదర్శకుడు సుకుమార్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 13న విడుదల కానుంది.


భార‌త్‌లో ఆ రెండు రాష్ట్రాల‌ను క‌మ్మేస్తోన్న క‌రోనా...

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో వైసీపీకి 50 డివిజ‌న్లు... టీడీపీ 0 - జ‌న‌సేన 0 ?

పుర పోరు: ఆ సిటీలో టీడీపీకి ఆ రెండు కులాల‌తో జ‌గ‌న్ మార్క్ చెక్ ?

పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో బాలయ్య ?

పవన్ విషయంలో దిల్ రాజ్ శంకర్ ల మధ్య తెగని చర్చలు ?

పుర పోరు: మాజీ మంత్రికి బిగ్ షాక్‌.. చంద్ర‌బాబు ఫోన్ చేసినా..!

హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>