PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/tdp-ysrcp-janasena767486c2-bfaa-4753-b37a-30b986eb61a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/tdp-ysrcp-janasena767486c2-bfaa-4753-b37a-30b986eb61a5-415x250-IndiaHerald.jpg ఆ కార్పొరేష‌న్ ఏదో కాదు ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా కేంద్ర‌మైన క‌డ‌ప‌. క‌డ‌ప కార్పొరేష‌న్లో మొత్తం 50 డివిజ‌న్లు ఉన్నాయి. అక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి అంజాద్ బాషా మంత్రిగానే కాకుండా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దీనికి తోడు ఎంపీ అవినాష్ రెడ్డి, క‌డ‌ప మాజీ మేయ‌ర్ గా ప‌ని చేసిన క‌మ‌లాపురం ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి లాంటి వాళ్లు అక్క‌డ గ‌ట్టిగా వ‌ర్క్ చేస్తున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన విప్ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి సైతం క‌డ‌ప కార్పొరేష‌న్లో గెలుపు కాదు మొత్తం అన్ని వార్డులు స్వీప్ చేసి స‌త్తా tdp ysrcp janasena;srikanth;andhra pradesh;devineni avinash;mp;district;deputy chief minister;cm;mla;minister;letter;tdp;ycp;kollu ravindra;reddyపుర పోరు: ఆ కార్పొరేష‌న్లో వైసీపీకి 50 డివిజ‌న్లు... టీడీపీ 0 - జ‌న‌సేన 0 ?పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో వైసీపీకి 50 డివిజ‌న్లు... టీడీపీ 0 - జ‌న‌సేన 0 ?tdp ysrcp janasena;srikanth;andhra pradesh;devineni avinash;mp;district;deputy chief minister;cm;mla;minister;letter;tdp;ycp;kollu ravindra;reddyWed, 24 Feb 2021 08:32:00 GMTఏపీలో కార్పొరేష‌న్లు, మున్సిపాల్టీల ఎన్నిక‌ల కోసం గ‌త యేడాది రిలీజ్ చేసిన నోటిఫికేష‌న్‌ను కంటిన్యూ చేస్తూ ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంది. ఇక ప‌లు కార్పొరేష‌న్ల‌లో అధికార వైసీపీ మ‌రోసారి త‌న ఆధిప‌త్యం చాటుకోనుంది. చాలా చోట్ల టీడీపీ సింగిల్ డిజిట్ దాటే ప‌రిస్థితి లేదు. మూడు, నాలుగు కార్పొరేష‌న్ల‌లో మాత్ర‌మే టీడీపీ గట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంది. అయితే

ఒక కార్పొరేష‌న్లో మాత్రం వైసీపీ స్వీప్ చేసేస్తుంద‌ని.. అక్క‌డ ఒక్క‌టంటే ఒక్క కార్పొరేట‌ర్ సీటు కూడా విప‌క్షాల‌కు వెళ్లే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. ఆ కార్పొరేష‌న్లో టీడీపీ, జ‌న‌సేనే కాదు ఏ పార్టీకి కూడా ఒక్క కార్పొరేట‌ర్ సీటు కూడా గెలిచే ఛాన్స్ లేదంటున్నారు. ఆ కార్పొరేష‌న్ ఏదో కాదు ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా కేంద్ర‌మైన క‌డ‌ప‌. క‌డ‌ప కార్పొరేష‌న్లో మొత్తం 50 డివిజ‌న్లు ఉన్నాయి. అక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి అంజాద్ బాషా మంత్రిగానే కాకుండా డిప్యూటీ సీఎంగా ఉన్నారు.

దీనికి తోడు ఎంపీ అవినాష్ రెడ్డి, క‌డ‌ప మాజీ మేయ‌ర్ గా ప‌ని చేసిన క‌మ‌లాపురం ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి లాంటి వాళ్లు అక్క‌డ గ‌ట్టిగా వ‌ర్క్ చేస్తున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన విప్ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి సైతం క‌డ‌ప కార్పొరేష‌న్లో గెలుపు కాదు మొత్తం అన్ని వార్డులు స్వీప్ చేసి స‌త్తా చాట‌డంతో పాటు టీడీపీకి షాక్ ఇవ్వాల‌ని టార్గెట్ గా పెట్టుకున్నారు.

ప్ర‌స్తుతం అక్క‌డ ఉన్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ప‌రిశీలిస్తే టీడీపీ మూడు, నాలుగు కార్పొరేట‌ర్ సీట్లు గెలిస్తే గొప్పే అన్న‌ట్టుగా ఉంది. ఇక జ‌న‌సేన .. మిగిలిన పార్టీల‌కు అక్క‌డ డిపాజిట్లు వ‌చ్చినా గొప్పే అనుకోవాలి. మ‌రి టీడీపీ ఇక్క‌డ మూడు .. నాలుగు కార్పొరేట‌ర్ సీట్లు అయినా గెలుస్తుందా ?  లేదా డ‌క్ అవుట్ అవుతుందా ? అన్న‌ది చూడాలి. 


కాసుల వర్షం కురిపిస్తున్న మిడతలు.. లక్షలు సంపాదిస్తున్నారు రైతులు..?

పుర పోరు: ఆ సిటీలో టీడీపీకి ఆ రెండు కులాల‌తో జ‌గ‌న్ మార్క్ చెక్ ?

పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో బాలయ్య ?

పవన్ విషయంలో దిల్ రాజ్ శంకర్ ల మధ్య తెగని చర్చలు ?

పుర పోరు: మాజీ మంత్రికి బిగ్ షాక్‌.. చంద్ర‌బాబు ఫోన్ చేసినా..!

హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...

హెరాల్డ్ సెటైర్ : ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రస్ దొరకటం లేదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>