PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmilabb3de1da-ba41-4ae8-9236-2589f8749511-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmilabb3de1da-ba41-4ae8-9236-2589f8749511-415x250-IndiaHerald.jpgతన పార్టీ గురించి సంచలన విషయాలు చెప్పారు వైఎస్ షర్మిల. తాను పార్టీ పెట్టడం మా అన్నకు ఇష్టం లేదన్నారు. అయినా మా అనుబంధాల్లో తేడాలుండవని తెలిపారు. మాటలు, అనుబంధాలు, రాఖీలు ఉంటాయన్నారు. తమ మధ్య ఉన్నవి విబేధాలో భిన్నాభిప్రాయాలో తనకు తెలియదని చెప్పారు షర్మిల.ys sharmila;kcr;vijayashanti;deva;dr rajasekhar;jayalalitha;nithya new;prema;hyderabad;jagan;telangana;y. s. rajasekhara reddy;love;letter;reddy;dookudu;partyజగన్ తో సంబంధం లేదు! షర్మిల సంచలన కామెంట్లుజగన్ తో సంబంధం లేదు! షర్మిల సంచలన కామెంట్లుys sharmila;kcr;vijayashanti;deva;dr rajasekhar;jayalalitha;nithya new;prema;hyderabad;jagan;telangana;y. s. rajasekhara reddy;love;letter;reddy;dookudu;partyWed, 24 Feb 2021 20:07:06 GMTపార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకు వెళుతున్నారు. పార్టీ ఏర్పాట్లపై రోజూ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో లోటస్ పాండ్ లోని షర్మిల నివాసం నిత్యం సందడిగా మారుతోంది. బుధవారం విద్యార్థులతో సమావేశమయ్యారు షర్మిల.
 
తన పార్టీ గురించి సంచలన విషయాలు చెప్పారు వైఎస్ షర్మిల. తాను పార్టీ పెట్టడం అన్న జగన్ కు  ఇష్టం లేదన్నారు. అయినా మా అనుబంధాల్లో తేడాలుండవని తెలిపారు. మాటలు, అనుబంధాలు, రాఖీలు ఉంటాయన్నారు. తమ మధ్య ఉన్నవి విబేధాలో భిన్నాభిప్రాయాలో తనకు తెలియదని చెప్పారు షర్మిల. పార్టీ వేరు.. ప్రాంతం వేరైనా.. అన్నా చెల్లెళ్లుగా తామెక్కటే అన్నారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన షర్మిల.. తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్‌నే అడగాలన్నారు. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. విజయశాంతి, కేసీఆర్ ఇక్కడి వారా అని ప్రశ్నించారు షర్మిల.  జయలలిత కూడా తమిళనాడు వాసి కాదని చెప్పారు.

తనకు హైదరాబాద్ తో విడదీయరాని బంధం ఉందన్నారు షర్మిల. తాను తెలంగాణ
కోడలనని స్పష్టం చేశారు. దేవుడి దయతో తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చాక
ప్రజల సమస్యలు తీరాయా?  అని ప్రశ్నించారు. అమరవీరుల ఆశయాలు నెరవేరలేదన్నారు.
ఉద్యమంలో  లేనంత మాత్రాన.. తెలంగాణపై ప్రేమ ఉండదా  అని నిలదీశారు. అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వాళ్ల గడపకు వెళ్లి వస్తానని చెప్పారు. తనకు అమ్మ విజయమ్మ మద్దతు ఉందని తెలిపారు వైఎస్ షర్మిల.

అంతకుముందు విద్యార్థులతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. మీ అక్కగా సమాజాన్ని బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో ఎంతో మంది ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తెలుగు ప్రజలను రాజశేఖర్ రెడ్డి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని, డబ్బు లేని కారణంగా ఏ పేద విద్యార్థి చదువు ఆగి పోవద్దని ఆయన భావించారన్నారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా వెయ్యి కడితే మిగతా ఫీజులు ప్రభుత్వం భరించేదని చెప్పారు. వైఎస్సార్ తీసుకొచ్చిన పథకం ద్వారా.. ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. 


కాలం మారిందంటూ దేశాన్ని అమ్ముతున్నారుగా

ప్రభాస్ ను చూసి కుళ్లుకుంటున్నారా..!

మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్..అదే జరిగితే పూనకాలే...?

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>