PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gvmc24f5309f-5d79-4827-bcaa-f2869ab9b093-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gvmc24f5309f-5d79-4827-bcaa-f2869ab9b093-415x250-IndiaHerald.jpgవిశాఖలో పద్నాలుగేళ్ళ తరువాత జీవీఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2005న జీవీఎంసీ గా విశాఖ కార్పోరేషన్ ఎదిగింది. ఆ తరువాత 2007 ఫిబ్రవరి 21న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 2012న జీవీఎంసీ పదవీకాలం పూర్తి అయింది. gvmc;view;korea, south;congress;mp;రాజీనామా;vishakapatnam;mla;february;minister;letter;tdp;ycp;march;masterపుర పోరు : విశాఖలో వైసీపీ ఆపరేషన్...షాక్ లో తమ్ముళ్ళు...?పుర పోరు : విశాఖలో వైసీపీ ఆపరేషన్...షాక్ లో తమ్ముళ్ళు...?gvmc;view;korea, south;congress;mp;రాజీనామా;vishakapatnam;mla;february;minister;letter;tdp;ycp;march;masterWed, 24 Feb 2021 08:58:58 GMTవిశాఖ కార్పోరేషన్ ఎదిగింది. ఆ తరువాత 2007 ఫిబ్రవరి 21న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 2012న జీవీఎంసీ పదవీకాలం పూర్తి అయింది.

నాటి నుంచి ఇప్పటిదాకా ఎన్నికలు నిర్వహించలేదు. ఇక తాజాగా మార్చి 10న జీవీఎంసీకి ఎన్నికలు జరగనుండడంతో అన్ని పార్టీలు ఎన్నికల వేడిని రగిలిస్తున్నాయి. ఇదిలా ఉంటే జీవీఎంసీ పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార వైసీపీ దూకుడు చూపిస్తోంది. ఎలాగైనా విశాఖ మేయర్ పీఠం తామే దక్కించుకోవాలని వైసీపీ వ్యూహం రూపొందిస్తోంది.  ఇపుడు సిటీలో బలమైన టీడీపీ నాయకుల మీద వైసీపీ కన్ను వేసింది. వారిని తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా మరింతగా గట్టిగా పోరాడాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది. విశాఖ సౌత్ లో టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్ చేసినందున మిగిలిన మూడు చోట్ల టీడీపీ తమ్ముళ్లకు కండువాలు కప్పే కార్యక్రమానికి వైసీపీ రెడీ అయిపోయింది.

ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం మీద దృష్టి పెట్టింది. అక్కడ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఉక్కు కర్గాగారం ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో ఉత్తరంలో వైసీపీ జెండా ఎగరేసేందుకు వీలుగా పెద్ద నాయకులనే పార్టీలోకి చేర్చుకుంటున్నారు ఇక కార్పొరేషన్ ఎన్నికల్లో సహజంగా ఏకగ్రీవాలు ఉండవౌ, కానీ విశాఖ నుంచే ఆ రికార్డ్ సాధిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారు. విశాఖలో వైసీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున వార్డులను ఏకగ్రీవం చేసే కసరత్తు కూడా చేపడుతున్నారు. ఈ మొత్తం పరిణామాలతో టీడీపీ పరేషాన్ అవుతోంది. చూడాలి మరి ధీటుగా టీడీపీ ఏ వ్యూహం రూపొందిస్తుందో. ఏది ఏమైనా విశాఖ కార్పోరేషన్ ఎన్నికలు మామూలుగా జరిగే అవకాశాలు లేవు. ఢీ అంటే ఢీ కొట్టేలాగానే అన్ని పార్టీలు ఉన్నాయి.






భార‌త్‌లో ఆ రెండు రాష్ట్రాల‌ను క‌మ్మేస్తోన్న క‌రోనా...

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో వైసీపీకి 50 డివిజ‌న్లు... టీడీపీ 0 - జ‌న‌సేన 0 ?

పుర పోరు: ఆ సిటీలో టీడీపీకి ఆ రెండు కులాల‌తో జ‌గ‌న్ మార్క్ చెక్ ?

పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో బాలయ్య ?

పవన్ విషయంలో దిల్ రాజ్ శంకర్ ల మధ్య తెగని చర్చలు ?

పుర పోరు: మాజీ మంత్రికి బిగ్ షాక్‌.. చంద్ర‌బాబు ఫోన్ చేసినా..!

హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>