PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/agan-nimmagadda-elections14d19c2c-8377-4b33-b576-85b230091e4e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/agan-nimmagadda-elections14d19c2c-8377-4b33-b576-85b230091e4e-415x250-IndiaHerald.jpgఎంతోకాలంగా ఊరిస్తున్న మునిసిప‌ల్ మ‌రియు కార్పోరేష‌న్ల పున‌ర్విభ‌జ‌న‌కు ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు ల‌భించాయి. ఎన్నిక‌ల క‌మిష‌న్ సూచ‌న మేర‌కు మంగ‌ళ‌వారం రాత్రి తెలంగాణ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర‌వింద్‌కుమార్ నుంచి ఆయా మునిసిప‌ల్ మ‌రియు కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని తెలుస్తున్న నేప‌థ్యంలో ఈ ప్ర‌క్రియ మొదలు కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప‌రిధిలో 58 డివిజ‌న్లు ఉండ‌గా కొత్త‌గా మ‌రో 8డివిజ‌న్లు పెర‌గ‌నునpoll;amala akkineni;telangana;january;pettaఆ కార్పోరేష‌న్ల‌కు ఎన్నిక‌లు అప్పుడే.. డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న మొద‌లైందిగా...ఆ కార్పోరేష‌న్ల‌కు ఎన్నిక‌లు అప్పుడే.. డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న మొద‌లైందిగా...poll;amala akkineni;telangana;january;pettaWed, 24 Feb 2021 07:40:00 GMTతెలంగాణ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర‌వింద్‌కుమార్ నుంచి ఆయా మునిసిప‌ల్ మ‌రియు కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని తెలుస్తున్న నేప‌థ్యంలో ఈ ప్ర‌క్రియ మొదలు కావ‌డం గ‌మ‌నార్హం.  ప్ర‌స్తుతం గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప‌రిధిలో 58 డివిజ‌న్లు ఉండ‌గా కొత్త‌గా మ‌రో 8డివిజ‌న్లు పెర‌గ‌నున్నాయి. దీంతో మొత్తం డివిజ‌న్ల సంఖ్య 66కు చేరుకోనుంది. డివిజన్ల పునర్విభజన ప్రక్రియతో ప్ర‌స్తుత డివిజ‌న్ల భౌగోళిక స‌రిహ‌ద్దుల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.


అలాగే రిజ‌ర్వేష‌న్లూ మార‌నున్నాయి. డివిజన్ల సంఖ్య 66కు పెరగడంతో మహిళలకు 50శాతం కేటాయింపు ద్వారా 33డివిజన్లు దక్కనున్నాయి.   అలాగే  ఖ‌మ్మం కార్పోరేష‌న్‌ను  60 డివిజ‌న్ల‌కు, అచ్చంపేట మునిసిపాలిటీ 20 వార్డులు, సిద్ధిపేట 43  వార్డులు, జ‌డ్చ‌ర్ల 27  వార్డులు, న‌కిరేక‌ల్ 20  వార్డులు, కొత్తూరు మునిసిపాలిటీ 12  వార్డులకు పెర‌గ‌నున్నాయి. 30 రోజుల్లోగా పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అర్వింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 24 నుంచి డివిజన్ల పునర్విజన ప్రక్రియ ప్రారంభమవుతుంది వచ్చే నెల 25న నోటిఫికేషన్‌ జారీతో ముగియ‌నుంది. పునర్విభజనకు సంబంధించి ఏ రోజు ఏం చేయాలనేది షెడ్యూల్‌లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నది.


వరంగల్‌ మహానగర పాలక సంస్థతో సహా రాష్ట్రంలో 7 పురపాలక సంఘాల్లో డివిజన్ల పునర్విభజన జరుగుతుంది. దీంతో పాలకవర్గం కాలపరిమితి ముగిసిన వెంటనే ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేదని స్పష్టమువుతోంది. గడువు ముగిసిన వెంటనే మూడు నెలల పాటు ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానున్నట్టు తెలుస్తోంది. అంటే ఎన్నికలు జూన్‌ రెండో వారంలో జరగొచ్చని తెలుస్తోంది. వాస్తవానికి వరంగల్‌ మహానగర పాలక సంస్థ డివిజన్ల పునర్విభజన జనవరి రెండో వారంలోనే పూర్తి కావలసి ఉంది.





తెలంగాణ‌ను టెన్ష‌న్ పెడుతోన్న కొత్త క‌రోనా వైర‌స్ ఇదే

పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో బాలయ్య ?

పవన్ విషయంలో దిల్ రాజ్ శంకర్ ల మధ్య తెగని చర్చలు ?

పుర పోరు: మాజీ మంత్రికి బిగ్ షాక్‌.. చంద్ర‌బాబు ఫోన్ చేసినా..!

హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...

హెరాల్డ్ సెటైర్ : ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రస్ దొరకటం లేదా ?

ఆ విషయంలో జగన్ ముందు.. జగన్ తర్వాత అనుకోవాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>