BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/shampu-shower239b2da2-9acc-4d48-986f-c8955a4d0506-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/shampu-shower239b2da2-9acc-4d48-986f-c8955a4d0506-415x250-IndiaHerald.jpgఆరోగ్యకరమైన , ఒత్తైన, పొడవాటి జుట్టు ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ప్రతి ఒక్కరు దాని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. హెయిర్ మాస్క్ లు, హెయిర్ ప్యాక్ లు, హెయిర్ క్రీములు, షాంపూలు, కండీష్ నర్లు ఇలా ఎన్నో రకాల ఉత్పత్తులను ఎంపిక చేసుకొని, జుట్టుపై ప్రయోగం చేస్తూ ఉంటారు. అయితే వాటివల్ల ఎంతవరకు ఉపశమనం కలుగుతుందో తెలియదు కానీ, త్వరగా జుట్టుపై ప్రభావం చూపుతూ ఉంటాయి. ఒకవేళ చర్మం అలర్జీ అయినట్లయితే జుట్టు కూడా అలాగే ఉంటుంది. అయితే మనం వాడే షాంపూ లు మన జుట్టుపై ప్రభావం చూపుతాయి అనేది మాshampu,shower;oil;girlమీరు వాడే షాంపూ సరైనదేనా.. ఒకవేళ కాకపోతే మీ జుట్టు ఏమి సూచిస్తోందో .. మీకు తెలుసా..?మీరు వాడే షాంపూ సరైనదేనా.. ఒకవేళ కాకపోతే మీ జుట్టు ఏమి సూచిస్తోందో .. మీకు తెలుసా..?shampu,shower;oil;girlWed, 24 Feb 2021 07:00:00 GMTఆరోగ్యకరమైన , ఒత్తైన, పొడవాటి జుట్టు ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ప్రతి ఒక్కరు దాని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. హెయిర్ మాస్క్ లు, హెయిర్ ప్యాక్ లు, హెయిర్ క్రీములు, షాంపూలు, కండీష్ నర్లు ఇలా ఎన్నో రకాల ఉత్పత్తులను ఎంపిక చేసుకొని, జుట్టుపై ప్రయోగం చేస్తూ ఉంటారు. అయితే వాటివల్ల ఎంతవరకు ఉపశమనం కలుగుతుందో తెలియదు కానీ, త్వరగా జుట్టుపై ప్రభావం చూపుతూ ఉంటాయి. ఒకవేళ చర్మం అలర్జీ అయినట్లయితే జుట్టు కూడా అలాగే ఉంటుంది. అయితే మనం వాడే షాంపూ లు మన జుట్టుపై ప్రభావం చూపుతాయి అనేది మాత్రం  ఎంతో నిజం. అయితే మీరు వాడే షాంపు మీ జుట్టుకు సరైనదా..? కాదా..? అని సూచించే కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


జుట్టు నిర్జీవంగా మారడం :
షాంపూ చేసిన తర్వాత మీ జుట్టు నిర్జీవంగా, నీరసంగా ప్రాణం లేనిదిగా ఉన్నట్టు భావిస్తున్నారా..? అయితే మీరు మీ జుట్టు కి వాడే షాంపు తప్పని తెలుస్తోంది. మీరు వాడే షాంపూ మీ జుట్టు నుండి వచ్చే తేమను గ్రహిస్తుంది. ఫలితంగా జుట్టు పొడిబారిపోవడం, గడ్డి లాగా మారడం, జుట్టు కొనలు విరిగిపోవడం లాంటివి జరుగుతాయి.


పొడి జుట్టు:
షాంపూ చేసిన తర్వాత మీ జుట్టు అధికంగా పొడిగా, నీరసంగా అనిపిస్తోందా..? అయితే మీరు మీ జుట్టుకు సరైన షాంపూను ఉపయోగించడం లేదని గ్రహించాలి. ఒకవేళ మీరు అదే షాంపూను  కంటిన్యూ చేస్తే మాత్రం,   జుట్టులోని తేమ పూర్తిగా తొలగిపోయి,  జుట్టు నిర్జీవంగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలే సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.

జిడ్డుగల జుట్టు:
షాంపూ చేసిన తర్వాత కూడా కొంతమంది జుట్టు జిడ్డుగా, జిగటగా అనిపిస్తూ ఉంటుంది. అయితే తప్పు షాంపూను ఉపయోగించడం వల్ల జుట్టు కుదుళ్ళపై నూనె స్రావం పెరుగుతుంది.ఫలితంగా చుండ్రు ఏర్పడి జుట్టు మురికిగా మారుతుంది.




హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...

హెరాల్డ్ సెటైర్ : ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రస్ దొరకటం లేదా ?

ఆ విషయంలో జగన్ ముందు.. జగన్ తర్వాత అనుకోవాల్సిందే..

దేవుడా: 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల ఎంపీ..!?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ మెలికతో టీడీపీకి షాకేనా ?

ఏపీ సీఎం జగన్ ఒక్క రోజు ఆదాయం ఎంతో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ కోసం వైసీపీ ఇంతపని చేసిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>