PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vishnu-verdhan-reddy-attack114c923d-8a55-49e9-a3f9-703110d933e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vishnu-verdhan-reddy-attack114c923d-8a55-49e9-a3f9-703110d933e8-415x250-IndiaHerald.jpgచెప్పుతో దాడి జరిగినా బీజేపీ వర్గాల నుంచి పెద్దగా రియాక్షన్ రాకపోవడానికి ఇదే కారణమంటున్నారు. బీజేపీ నేతగా ఉంటూ.. టీవీ డిబేట్లలో వ్యక్తిగత ఎజెండా ప్రకారం మాట్లాడుతుండటం.. వైసీపీకి అనుకూలంగా ఉండటం.. సొంత పార్టీలో చాలా మందికి నచ్చడం లేదట. అందుకే దాడిపై వారెవరూ నోరు మెదపడం లేదని అంటున్నారు.vishnu verdhan reddy attack;cbn;tara;vishnu;bharatiya janata party;somu veerraju;amaravati;andhra pradesh;rajya sabha;television;tdp;ycp;jac;reddy;partyబీజేపీలో విష్ణు ఏకాకి!బీజేపీలో విష్ణు ఏకాకి!vishnu verdhan reddy attack;cbn;tara;vishnu;bharatiya janata party;somu veerraju;amaravati;andhra pradesh;rajya sabha;television;tdp;ycp;jac;reddy;partyWed, 24 Feb 2021 20:41:25 GMTఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావు చెప్పుతో దాడి చేయడం సంచలనంగా మారింది. ఏపీ ప్రజలంతా ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. కాని  ఏపీ బీజేపీ నేతలు మాత్రం పెద్దగా స్పందించలేదు. నిజానికి తమ పార్టీ అధికార ప్రతినిధిపై దాడి జరిగితే.. బీజేపీ నేతలు సీరియస్ గా స్పందించాలి.  ర్యాలీలు, ధర్నాలకు దిగాలి. కాని ఏపీలో ఎక్కడా అలాంటి సీన్ కనిపించ లేదు.  

విష్ణువర్ధన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు  సోము వీర్రాజు ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా స్పందించాల్సిందే. సోము వీర్రాజుతో పాటు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ ష్ణుపై దాడిని తప్పుబట్టారు. వీళ్లద్దరు మొదటి నుంచి  విష్ణువర్ధన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్న వారే. వీళ్లు తప్ప ఇంకెవ్వరు ఈ ఘటనపై మాట్లాడలేదు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా, వైసీపీకి మద్దతుగా ఉంటారనే ప్రచారం చాలా కాలంగా ఉంది.
బీజేపీ ముసుగులో ఉన్న వైసీపీ నేత అని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుంటారు. అతను ఎప్పుడు వైసీపీ తప్పేమీ లేదన్నట్టు మాట్లాడుతారని అంటారు. అధికార వైసీపీ కంటే ప్రతిపక్ష టీడీపీనే టార్గెట్ చేస్తుంటారని చెబుతారు. ఏ అంశం చర్చకు వచ్చినా.. అందులోకి చంద్రబాబును లాగి విమర్శిస్తుంటారని విష్ణువర్ధన్ రెడ్డిపై టీడీపీ నేతలు మండిపడుతుంటారు. చెప్పుతో దాడి జరిగినా బీజేపీ వర్గాల నుంచి పెద్దగా రియాక్షన్ రాకపోవడానికి ఇదే కారణమంటున్నారు. బీజేపీ నేతగా ఉంటూ.. టీవీ డిబేట్లలో వ్యక్తిగత ఎజెండా ప్రకారం మాట్లాడుతుండటం.. వైసీపీకి అనుకూలంగా ఉండటం.. సొంత పార్టీలో చాలా మందికి నచ్చడం లేదట. అందుకే దాడిపై వారెవరూ నోరు మెదపడం లేదని అంటున్నారు.

విష్ణుతో పాటు సోము వీర్రాజు, జీవీఎల్  సైతం వైసీపీని సమర్థించే బీజేపీ నేతలని టాక్. బీజేపీ, వైసీపీ మధ్య లోపాయికారి పొత్తు ఉందని.. అందుకే ఈ ముగ్గురు దాదాపు అన్ని విషయాల్లో వైసీపీని వెనకేసుకు వస్తుంటారని చెబుతుంటారు. ఇప్పుడు విష్ణుపై దాడి ఘటనపైనా వాళ్లిద్దరే స్పందించడం మరింత ఆసక్తిగా మారింది.


కాలం మారిందంటూ దేశాన్ని అమ్ముతున్నారుగా

ప్రభాస్ ను చూసి కుళ్లుకుంటున్నారా..!

మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్..అదే జరిగితే పూనకాలే...?

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>