MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/are-the-gossips-coming-about-ravi-teja-true10718c0c-ee89-43fd-b2da-37ce139a2724-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/are-the-gossips-coming-about-ravi-teja-true10718c0c-ee89-43fd-b2da-37ce139a2724-415x250-IndiaHerald.jpgసూపర్‌హిట్ పడితే కెరీర్‌కి బూస్టప్ వస్తుంది. అలాగే రెమ్యూనరేషన్‌లో కొంచెం మార్పులొస్తాయి. కానీ రవితేజ మాత్రం సింగిల్ హిట్‌తో డబుల్‌ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నాడట. అడిగినంత ఇస్తేనే కాల్షీట్స్‌ అంటున్నాడట రవితేజ.రవితేజకి 'రాజా ది గ్రేట్' తర్వాత వరుస ఫ్లాపులొచ్చాయి. 'టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటొని, డిస్కోరాజా' ఫ్లాపులతో మార్కెట్‌ కూడా పడిపోయింది. ఈ డిజాస్టర్లతో రవితేజ పనైపోయిందనే కామెంట్స్‌ కూడా వచ్చాయి. are the gossips coming about ravi teja true;ravi;amar;kranthi;kranti;raja;ravi teja;makar sakranti;cinema;sankranthi;bank;producer;producer1;vegetable market;success;raja the great;discoraja;mass;krackరవితేజ గురించి వస్తున్న గాసిప్స్ నిజమేనా..?రవితేజ గురించి వస్తున్న గాసిప్స్ నిజమేనా..?are the gossips coming about ravi teja true;ravi;amar;kranthi;kranti;raja;ravi teja;makar sakranti;cinema;sankranthi;bank;producer;producer1;vegetable market;success;raja the great;discoraja;mass;krackWed, 24 Feb 2021 16:00:00 GMTరవితేజ మాత్రం సింగిల్ హిట్‌తో డబుల్‌ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నాడట. అడిగినంత ఇస్తేనే కాల్షీట్స్‌ అంటున్నాడట రవితేజ.

రవితేజకి 'రాజా ది గ్రేట్' తర్వాత వరుస ఫ్లాపులొచ్చాయి. 'టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటొని, డిస్కోరాజా' ఫ్లాపులతో మార్కెట్‌ కూడా పడిపోయింది. ఈ డిజాస్టర్లతో రవితేజ పనైపోయిందనే కామెంట్స్‌ కూడా వచ్చాయి. ఇలాంటి టైమ్‌లో 'క్రాక్' సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు రవితేజ.

'క్రాక్' సంక్రాంతి సీజన్‌ని క్యాష్‌ చేసుకుని, క్రేజీ కలెక్షన్లు అందుకుంది. క్రాక్‌ఫైడ్ అనే రెస్పాన్స్‌తో ఈ ఇయర్‌కి ఫస్ట్‌ హిట్‌గా నిలిచింది 'క్రాక్'. ఇక చాలాకాలం తర్వాత వచ్చిన ఈ సక్సెస్‌తో బ్యాంక్ బ్యాలెన్స్‌ పెంచుకుంటున్నాడట మాస్ మహారాజ్. రెమ్యూనరేషన్‌ భారీగా డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకు 7 నుంచి 8 కోట్లు తీసుకున్న రవితేజ, ఇప్పుడు 16 కోట్లు డిమాండ్‌ చేస్తున్నాడట.

రవితేజ ఇప్పుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి రవితేజ 16 కోట్ల వరకు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే 'క్రాక్' సినిమాకి రవితేజ 7 కోట్ల వరకు తీసుకుంటే బడ్జెట్ 20 కోట్ల వరకు అయ్యిందట. మరి ఇప్పుడు రెమ్యూనరేషనే 16 కోట్లు తీసుకుంటే బడ్జెట్ 40 కోట్ల వరకు పెరిగే అవకాశముంది. సో నిర్మాత సేఫ్ అవ్వాలంటే రవితేజ మార్కెట్ 50 కోట్లకి రీచ్ అవ్వాలి. మరి మాస్ మహారాజ్‌ హాఫ్‌ బిలియనీర్‌గా మారతాడా లేదా అన్నది బిగ్‌ క్వశ్చన్‌గా మారింది.

మొత్తానికి రవితేజ రెమ్యునరేషన్ పెంచుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అదీ ఏకంగా 16కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడన్న గాసిప్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. క్రాక్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ మాస్ మహారాజా.. సక్సెస్ రాగానే రెమ్యునరేషన్ పెంచినట్టు సమాచారం.





క‌న‌క‌దుర్గ‌మ్మ గుడిలో అస‌లు దొంగ ఈ మంత్రే

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>