PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagane1ded616-fa85-4d20-95c3-35f90a0c2785-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagane1ded616-fa85-4d20-95c3-35f90a0c2785-415x250-IndiaHerald.jpgసీఎం వైఎస్‌ జగన్ బలం ఏంటి.. ఆయనకు ఓటేసే వర్గాలు ఏంటి.. గత ఎన్నికల్లో ఆయన్ను గెలిపించిన సోషల్ ఇంజినీరింగ్ ఏంటి.. ఇది ఆయన గెలిచిన చాలారోజుల పాటు చర్చ జరిగిన అంశం.. జగన్ పేదల పక్షపాతి అన్న పేరు ఆయన ప్రకటించిన పథకాల వల్ల వచ్చింది. సహజంగానే రెడ్డి కులస్తులు ఆయన వెంట నిలిచారు. క్రైస్తవుడన్న కారణంతో దళిత వర్గాలు జగన్‌కు అండగా నిలిచారన్న వాదన ఉంది. ఇక ముస్లిం వర్గాలు.. కూడా జగన్‌కే జై కొట్టాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. కొన్ని అగ్రకుల వర్గాలు తప్ప గత ఎన్నికల్లో అన్ని వర్గాలు జగన్‌ సీఎం కావాలని కోరుకున్నాjagan;amala akkineni;jagan;january;chief minister;april;reddyవామ్మో.. ఇక ఆ ఓట్లు కూడా జగన్ ఖాతాలోనేనా..?వామ్మో.. ఇక ఆ ఓట్లు కూడా జగన్ ఖాతాలోనేనా..?jagan;amala akkineni;jagan;january;chief minister;april;reddyWed, 24 Feb 2021 00:00:00 GMTజగన్ బలం ఏంటి.. ఆయనకు ఓటేసే వర్గాలు ఏంటి.. గత ఎన్నికల్లో ఆయన్ను గెలిపించిన సోషల్ ఇంజినీరింగ్ ఏంటి.. ఇది ఆయన గెలిచిన చాలారోజుల పాటు చర్చ జరిగిన అంశం.. జగన్ పేదల పక్షపాతి అన్న పేరు ఆయన ప్రకటించిన పథకాల వల్ల వచ్చింది. సహజంగానే రెడ్డి కులస్తులు ఆయన వెంట నిలిచారు. క్రైస్తవుడన్న కారణంతో దళిత వర్గాలు జగన్‌కు అండగా నిలిచారన్న వాదన ఉంది. ఇక ముస్లిం వర్గాలు.. కూడా జగన్‌కే జై కొట్టాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే.. కొన్ని అగ్రకుల వర్గాలు తప్ప గత ఎన్నికల్లో అన్ని వర్గాలు జగన్‌ సీఎం కావాలని కోరుకున్నాయి. అందుకే ఆయన బంపర్ మెజారిటీతో 175 సీట్లకు 151 సీట్లు సాధించాడు. అయితే సీఎం అయిన తర్వాత కూడా తాను చెప్పిన పథకాలు అమలు చేస్తున్న జగన్.. ఇప్పుడు తనకు ఓటేయని వర్గాలను సైతం టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా తీసుకొచ్చిన ఈబీసీ మహిళలకు ఆర్థిక సాయం పథకం అసలు లక్ష్యం అదేనన్నది విశ్లేషకుల మాట.

అందుకే.. అక్కచెల్లెమ్మల మేలు కోసమంటూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో వినూత్న పథకాన్ని రూపొందించారు. ఈబీసీ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన ‘ఈబీసీ’ పథకానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45 వేల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందించనుంది.

45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న మహిళలకు ఈ పథకం వర్తించనుంది. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగులలోపు ఉంటే.. రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నవరత్నాలు పథకాలపై ఈ ఏడాది క్యాలెండర్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వచ్చే ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు మంత్రిమండలి అంగీకారం తెలిపింది. 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాలను క్యాలెండర్‌గా రూపొందించారు. మొత్తానికి జగన్ అన్ని వర్గాలనూ తన బుట్టలో వేసుకునే పనిలో తెగ బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది కదా.




పాపం.. చిన్నప్పుడే అలాంటి దారుణమైన వ్యాధితో ఇబ్బంది పడ్డ స్టార్ హీరోయిన్!

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>