Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/bedi-hanuman-temple8dd5111e-a56f-4271-a374-411f79a4cf88-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/bedi-hanuman-temple8dd5111e-a56f-4271-a374-411f79a4cf88-415x250-IndiaHerald.jpg హిందువులకు ఎంతో పవిత్రమైన దేవుడు హనుమంతుడు. భూత, ప్రేత పిశాచాలను ఒంటి చేత్తో నాశనం చేయగల చిరంజీవి హనుమంతుడని అంతా నమ్ముతుంటారు. అయితే అలాంటి అమేయ బలసంపన్నుడైన హనుమంతుడు దేశ వ్యాప్తంగా ఎన్నో ఆలయాల్లో అపూర్వ పూజలందుకుంటుంటాడు. అయితే ఒరిస్సాలోని ఓ ఆలయంలో మాత్రం హనుమంతుడికి సంకెళ్లు వేసి..bedi hanuman temple;chiranjeevi;sada;apoorva;deva;puri jagannadh;aqua;ayodhya;hindus;mahaఅక్కడ హనుమంతుడు సంకెళ్లతో బంధించి ఉంటాడు.. ఏళ్లుగా అలాగే..అక్కడ హనుమంతుడు సంకెళ్లతో బంధించి ఉంటాడు.. ఏళ్లుగా అలాగే..bedi hanuman temple;chiranjeevi;sada;apoorva;deva;puri jagannadh;aqua;ayodhya;hindus;mahaWed, 24 Feb 2021 15:57:30 GMTఇంటర్నెట్ డెస్క్: హిందువులకు ఎంతో పవిత్రమైన దేవుడు హనుమంతుడు. భూత, ప్రేత పిశాచాలను ఒంటి చేత్తో నాశనం చేయగల చిరంజీవి హనుమంతుడని అంతా నమ్ముతుంటారు. అయితే అలాంటి అమేయ బలసంపన్నుడైన హనుమంతుడు దేశ వ్యాప్తంగా ఎన్నో ఆలయాల్లో అపూర్వ పూజలందుకుంటుంటాడు. అయితే ఒరిస్సాలోని ఓ ఆలయంలో మాత్రం హనుమంతుడికి సంకెళ్లు వేసి ఉంటాయి. ఇలాంటి విగ్రహం మొత్తం దేశంలోనే ఇది ఒక్కటే ఉంది. అది కూడా ఏదో చిన్న ఆలయం కాదు.. ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం.

పూరి జగన్నాథ ఆలయం ఎంత ప్రఖ్యాతి గాంచిన ఆలయమో వేరే చెప్పనవసరం లేదు. ఈ ఆలయంలో ఆంజనేయస్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్న ఆంజనేయస్వామి దేవాలయాన్ని దరియా మహావీర దేవాలయం అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పటి వరకు ఏ ఆలయంలో చూడని విధంగా ఆంజనేయస్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడి హనుమ విగ్రహం సంకెళ్ళతో బంధించబడి ఉంటుంది. ఈ విధంగా స్వామి వారిని సంకెళ్లతో బంధించడానికి గల కారణాలు కూడా పురాణాల్లో పేర్కొన్నారు. వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

జగన్నాథ ఆలయం ఈ ప్రాంతంలో వెలసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి సముద్ర దేవుడు ఆలయాన్ని సందర్శించాడు.అయితే సముద్ర దేవుడు ఇక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నీటితో మునిగిపోయి హానికర వాతావరణం ఏర్పడింది. దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలంతా సముద్ర దేవుడి నుంచి తమను రక్షించాల్సిందిగా ఆ జగన్నాధుని వేడుకున్నారు. భక్తుల ప్రార్థనలతో అనుగ్రహించిన జగన్నాథుడు ఆ ప్రాంతానికి రక్షకుడిగా హనుమను నియమించాడు. ఆంజనేయస్వామి రామభక్తుడు అనే విషయం మనకు తెలిసిందే. దీంతో జగన్నాధునికి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా ఆంజనేయుడు అయోధ్య వెళ్ళివస్తాడు. ఆ విషయం తెలియడంతో జగన్నాథుడు ఆగ్రహించాడని, అప్పుడే.. ఆంజనేయుడి కాళ్లు, చేతులను సంకెళ్లతో బంధించి ఇకపై ఈ స్థలంలో సదా వెలిసి ఉండమని ఆదేశించాడని స్థల పురాణం.

అప్పటి నుంచే ఈ ఆలయంలో కొలువై ఉన్న ఆంజనేయుడిని దరీయా మహావీర అని కూడా పిలుస్తారు. అంటే సముద్రం నుంచి ఆ మహా నగరాన్ని సంరక్షిస్తున్న మహావీరుడు అని అర్థం. అదేవిధంగా సంకెళ్ళతో బంధింపబడి ఉన్నాడు కాబట్టి బేడీ హనుమంతుడు అని కూడా పిలుస్తారు. సముద్ర గర్భం తీరం దగ్గరే ఉన్నప్పటికీ.. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా ఈ స్థలంలోకి మాత్రం సముద్రపు నీరు చేరదని అక్కడి ప్రజలు చెబుతుంటారు. దీనికి కారణం హనుమంతుడేనని వారి నమ్మకం.


క‌న‌క‌దుర్గ‌మ్మ గుడిలో అస‌లు దొంగ ఈ మంత్రే

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>