MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sujithc0741bcb-0626-4441-bb31-304949ec880b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sujithc0741bcb-0626-4441-bb31-304949ec880b-415x250-IndiaHerald.jpgకేవలం ఒకే సినిమా చేసి రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం కొట్టేశాడు కుర్ర దర్శకుడు సుజిత్. ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేయకుండా కేవలం షార్ట్ ఫిలిం తీసిన అనుభవంతోనే మొదటి సినిమా అవకాశం దక్కించుకున్నాడు. మొదటి సినిమా శర్వానంద్ తో రన్ రాజా రన్ అనే సినిమా తీసి ప్రభాస్ దృష్టిలో పడ్డాడు. కేవలం ఆ సినిమా అనుభవంతోనే సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసి ఒక రకమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా పెట్టిన పెట్టుబడులు వెనక్కి వచ్చేశాయి. అయితే ఒక రకంగా ఈ సినిమా ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయిందిtollywood;chiranjeevi;prabhas;sharwanand;krishnam raju;raja;sujeeth;bollywood;cinema;saaho;marriage;remake;director;thriller;sardar vallabhai patelఎట్టకేలకు సినిమా సైన్ చేసిన సుజీత్..ఏకంగా బాలీవుడ్లో !ఎట్టకేలకు సినిమా సైన్ చేసిన సుజీత్..ఏకంగా బాలీవుడ్లో !tollywood;chiranjeevi;prabhas;sharwanand;krishnam raju;raja;sujeeth;bollywood;cinema;saaho;marriage;remake;director;thriller;sardar vallabhai patelWed, 24 Feb 2021 11:00:00 GMTకేవలం ఒకే సినిమా చేసి రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం కొట్టేశాడు కుర్ర దర్శకుడు సుజిత్. ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేయకుండా కేవలం షార్ట్ ఫిలిం తీసిన అనుభవంతోనే మొదటి సినిమా అవకాశం దక్కించుకున్నాడు. మొదటి సినిమా శర్వానంద్ తో రన్ రాజా రన్ అనే సినిమా తీసి ప్రభాస్ దృష్టిలో పడ్డాడు. కేవలం ఆ సినిమా అనుభవంతోనే సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసి ఒక రకమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా పెట్టిన పెట్టుబడులు వెనక్కి వచ్చేశాయి. అయితే ఒక రకంగా ఈ సినిమా ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది అనే చెప్పాలి..ఆ తరువాత చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ వచ్చాడు సుజీత్. 

అయితే చిరంజీవి లూసిఫర్ సినిమా రీమేక్ చేసే బాధ్యతను ఈ దర్శకుడికి అప్పగించడంతో ఈ దర్శకుడి లైఫ్ మళ్లీ లైన్ లో పడిందని భావించారు అందరూ.. కానీ ఏమైందో ఏమో ఈయన ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈయన కరోనా టైంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. ఇప్పట్లో సినిమా అవకాశాలు దక్కవేమోనని అందరూ భావిస్తున్న తరుణంలో ఏకంగా ఒక బాలీవుడ్ సైన్ సినిమా సైన్ చేసి అందరికీ షాకిచ్చాడు సుజీత్. జి స్టూడియోస్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థతో తాను పని చేయబోతున్నా అని ఈ దర్శకుడు ప్రకటించాడు.

అయితే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలు అయితే ఇంకా ఏమి ప్రకటించలేదు. ఇక సుజీత్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నామని జి స్టూడియోస్ సంస్థ కూడా అధికారికంగా ప్రకటించింది. ఒక సంయుక్త ప్రెస్మీట్లో సుజిత్, జీ సంస్థ సీఈవో షరీఫ్ పటేల్ మాట్లాడుతూ తమ కలయికలో ఒక సినిమా తెరకెక్కబోతుంది ప్రకటించారు. సాహో ఒక పూర్తి స్థాయి యాక్షన్ మూవీ అయితే ఇప్పుడు తీస్తున్న సినిమా మాత్రం ఎమోషన్స్ మిక్స్ అయిన యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పుకొచ్చాడు. చాలా గ్యాప్ వచ్చిన కారణంగా సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతాను అని ఎదురుచూస్తున్నట్లు సుజిత్ చెప్పుకొచ్చాడు..


అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!

బ్రాహ్మ‌ణ ఘోష‌‌‌: రాజుల కోట‌లో పూజారి విజ‌యం..

ఆ ముగ్గురి దర్శకులతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇవే..!?

ఎడిటోరియల్: మైనార్టీ ఫైర్ బ్రాండ్, ఫిరోజ్ ఖాన్ ఇక బీజేపీ లోకి - ఒవైసి సోదరులకు ఇక చుక్కలే!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు పొలిటిక‌ల్ న్యాయం జ‌ర‌గాలంటే ఇదే క‌రెక్ట్ ?

పుర పోరు: జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌లో ఆ యువ‌నేత గెలిస్తే... తిరుగులేని హీరోయే.. ?

పుర పోరు: దేవినేని ప‌రువు సొంతూళ్లోనే మ‌ళ్లీ గోవిందా... గోవిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>