MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppenafc431e9c-44eb-460a-ad63-9625a1bd43cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppenafc431e9c-44eb-460a-ad63-9625a1bd43cb-415x250-IndiaHerald.jpgమెగాస్టార్. ఈ నాలుగు అక్షరాలు. టాలీవుడ్ అన్న మరో నాలుగు అక్షరాలకు ధీటు అయినవి. చిరంజీవిగా ఎంట్రీ ఇచ్చి సినిమా ఫీల్డ్ తో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుని ఎవరికీ అందనంత ఎత్తులకు ఎదిగిన గ్రేట్ నెస్ చిరుకే సొంతం. ఆయనే ఒక సినీ విశ్వ విద్యాలయం అని అనుకున్నా తప్పు లేదు.అతిశయోక్తి అంతకంటే లేదు. uppena;chiranjeevi;jeevitha rajaseskhar;prema;vishwa;tollywood;cinema;love;blockbuster hit;director;hero;silver;silver screen;vaishnav tej;adhursమెగా మేనల్లుడి రేర్ ఫీట్...బాక్సులు బద్దలే...?మెగా మేనల్లుడి రేర్ ఫీట్...బాక్సులు బద్దలే...?uppena;chiranjeevi;jeevitha rajaseskhar;prema;vishwa;tollywood;cinema;love;blockbuster hit;director;hero;silver;silver screen;vaishnav tej;adhursWed, 24 Feb 2021 11:00:00 GMTటాలీవుడ్ అన్న మరో నాలుగు అక్షరాలకు ధీటు అయినవి. చిరంజీవిగా ఎంట్రీ ఇచ్చి సినిమా ఫీల్డ్ తో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుని ఎవరికీ అందనంత ఎత్తులకు ఎదిగిన గ్రేట్ నెస్ చిరుకే సొంతం. ఆయనే ఒక సినీ విశ్వ విద్యాలయం అని అనుకున్నా తప్పు లేదు.అతిశయోక్తి అంతకంటే లేదు.

నిజానికి చిరంజీవి సినీ జీవితం అంత సులువుగా పట్టాలెక్కలేదు. ఎన్నో ఆటుపోట్లు ఓర్చి మరీ ఆయన హీరోగా ఒక్కో మెట్టూ ఎదిగారు. ఆయన వారసులకు మాత్రం అవన్నీ సోపానాలుగా మారాయి. తాజాగా ఆయన రెండవ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీ అయితే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో అంతా కొత్త వారే ఉన్నప్పటికీ మూవీ మాత్రం అదుర్స్ అన్నట్లుగా కలెక్షన్లు కొల్లగొడుతోంది.

రిలీజ్ అయి ఇప్పటికి పదిహేను రోజులు దగ్గరపడుతున్నా కూడా ఈ మూవీ కలెక్షన్లు అలా స్ట్రాంగ్ గానే ఉండడం విశేషం. ఒక అధ్బుతమైన ప్రేమ కధను సెల్యూలాయిడ్ మీద పండిస్తే వచ్చే రిజల్ట్ ఇలాగే ఉంటుందని డైరెక్టర్ సానా బుచ్చిబాబు రుజువు చేశాడు. ఇక కొత్త వారు అయినప్పటికీ హీరో హీరోయిన్లను కరెక్ట్ గా వాడుకుంటే వారి టాలెంట్ ఎలా వెండి తెర మీద వికసిస్తుందో కూడా చెప్పిన సినిమా ఉప్పెన.

ఈ మూవీలో సాంగ్స్ బాగున్నాయి. కెమెరా పనితనం సూపర్ అంటున్నారు. నిర్మాణత విషయంలో ఎక్కడా రాజీపడకుండా మైత్రీ మూవీ మేకర్స్ బాగా తీశారు. అందుకే ఈ మూవీ సంచలన విజయం సాధిస్తోంది అంటున్నారు. ఈ సినిమాను 20 కోట్లతో నిర్మిస్తే యాభై కోట్ల పైగా వసూళ్ళు సాధిస్తోందిట. అదే కనుక జరిగితే మెగా మేనల్లుడి కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసి పెట్టినట్లే అంటున్నారు. తొలి సినిమా తో ఎవరూ ఇంతలా కలెక్షన్లు కొల్లగొట్టలేదు అంటున్నారు. మొత్తానికి ఈ మూవీతో మెగా కాంపౌండ్ లో మరో గర్వకారణమైన రికార్డు వచ్చి చేరుతోంది అన్న మాట.






అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!

బ్రాహ్మ‌ణ ఘోష‌‌‌: రాజుల కోట‌లో పూజారి విజ‌యం..

ఆ ముగ్గురి దర్శకులతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇవే..!?

ఎడిటోరియల్: మైనార్టీ ఫైర్ బ్రాండ్, ఫిరోజ్ ఖాన్ ఇక బీజేపీ లోకి - ఒవైసి సోదరులకు ఇక చుక్కలే!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు పొలిటిక‌ల్ న్యాయం జ‌ర‌గాలంటే ఇదే క‌రెక్ట్ ?

పుర పోరు: జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌లో ఆ యువ‌నేత గెలిస్తే... తిరుగులేని హీరోయే.. ?

పుర పోరు: దేవినేని ప‌రువు సొంతూళ్లోనే మ‌ళ్లీ గోవిందా... గోవిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>